newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గాంధీ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

14-07-202014-07-2020 12:46:45 IST
Updated On 14-07-2020 16:45:25 ISTUpdated On 14-07-20202020-07-14T07:16:45.769Z14-07-2020 2020-07-14T07:16:42.244Z - 2020-07-14T11:15:25.305Z - 14-07-2020

గాంధీ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 700 మంది ఔట్ సోర్సింగ్ స్టాఫ్, శానిటేషన్, సెక్యూరిటీ ఉద్యోగులు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. చాలీ చాలని జీతాలతో వారు బతుకు వెళ్ళదీస్తున్నారు. దీంతో వారంతా ఆందోళనకు దిగారు. 8 వేల రూపాయల జీతంతో తామెలా జీవించేదని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వేతనాలు పెంచాలని, తమ సర్వీసులు క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది అంతా జేఏసీగా ఏర్పడి ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనతో గాంధీ ఆస్పత్రిలో సేవలు నిలిచిపోయాయి. వారు రోడ్డుమీద బైఠాయించడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. సమస్యలు పరిష్కరించాలని, జీతాలు పెంచాలని గత ఐదురోజులుగా తాము ఆందోళన చేస్తుంటే మంత్రి, అధికారులు పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు.

కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పని చేస్తుంటే గుర్తించడం లేదని, తమ ఆకలికేకలు వినడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కొత్తగా రిక్రూట్ చేసుకున్న నర్సులకు రూ.25 వేల వేతనం ఇస్తున్నారని, 14 ఏళ్లుగా తాము పనిచేస్తుంటే తమకు రూ.17,500 ఇవ్వడం ఏంటని వారు ప్రశ్నించారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు మంత్రి ఈటల రాజేందర్ ను కోరుతున్నారు. 

 

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   an hour ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   4 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   21 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle