newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గాంధీ ఆసుపత్రి సిబ్బంది ఆవేదన.. సమాజం చిన్నచూపు విచారకరం!

27-03-202027-03-2020 16:01:48 IST
Updated On 27-03-2020 16:02:15 ISTUpdated On 27-03-20202020-03-27T10:31:48.864Z27-03-2020 2020-03-27T10:31:42.896Z - 2020-03-27T10:32:15.310Z - 27-03-2020

గాంధీ ఆసుపత్రి సిబ్బంది ఆవేదన.. సమాజం చిన్నచూపు విచారకరం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పుడు ప్రపంచానికి దేవుడు ఒక్కడే.. తనే వైద్యుడు.. దేవత ఒక్కరే.. ఆమె వైద్యురాలు. డాక్టర్లు దేవుడితో సమానం అని చదువుకున్నాం.. అప్పుడప్పుడు చూస్తుంటాం కూడా. కానీ వారి స్థాయి ఏంటో.. వారి గొప్పతనం ఏంటో సమాజానికి ఇప్పుడే పూర్తిగా తెలిసింది. డాక్టర్లు.. వారి సహాయకులు.. వైద్య సిబ్బంది లేకుంటే.. అని తలచుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది.

మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరం అవసరం.. అవసరమైతే తప్ప బయటకు వద్దు.. అప్పుడే మీ ప్రాణాలు మీరు కాపాడుకోగలరు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల నినాదం. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమే గడగలాడిపోతుంది. కరోనా సోకిన వ్యక్తిని తన కుటుంబ సభ్యులకు కూడా తాకడానికి లేదు. ఇంకా చెప్పాలంటే వ్యాధి సోకిన వ్యక్తి తన అవయవాలను కూడా తాను తాకడానికి లేదు.

అంత ప్రమాదకరంగా కరోనా వైరస్ విజృభిస్తుంది. కానీ.. కరోనా పాజిటివ్ రోగులతో పాటు అనుమానితులకు కూడా తన స్వహస్తాలతో సేవలు అందిస్తూ ప్రతి నిమిషం వారిని బ్రతికించడం కోసం పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది దేవుడితో పోల్చినా తక్కువే. ఒకపక్క వారి కుటుంబాలను కూడా రిస్క్ చేస్తూ.. తాను బిక్కుబిక్కుమంటూనే తన వృత్తిని నిర్వర్తిస్తున్నారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేని వారిని సమాజంలో కొందరు చిన్నచూపు చూడడం సమాజం తలదించుకోవాల్సిన సమయం. ఇది ఎక్కడో కాదు పూర్తిస్థాయిలో తెలంగాణలోని కరోనా సోకిన వ్యక్తులకు చికిత్స అందిస్తున్న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోనే జరుగుతుండడం అవమానకరం. తాజాగా గాంధీ వైద్య సిబ్బంది  ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రావణ్ కుమార్‌కు తాజాగా ఒక లేఖ రాశారు.

ఆ లేఖలో వారి బాధలు, వెతలు వెళ్లబోసుకున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా రోగులను బ్రతికించేందుకు పోరాడుతున్నామని.. కానీ తమ జాగ్రత్తలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ ఐసోలేషన్ వార్డులలో చికిత్స అందిస్తున్న తాము తన కుటుంబ సభ్యులను తాకేందుకు కూడా భయపడుతున్నామన్నారు.

అన్నిటికి తెగించి 24 గంటలు వైద్యం అందిస్తున్నా కనీసం తాముండే కాలనీలలో కూడా మాకు రక్షణ లేదని.. మమ్మల్నే కరోనా పేషేంట్లుగా చూస్తున్నారని.. ఇంటి నుండి భయపడుతూ ఆసుపత్రికి వస్తున్నామన్నారు. లేడీ స్టాఫ్ ను తమ భర్తలు ఇంటి నుండి తీసుకొచ్చి.. తీసుకెళ్తున్నా పోలీసులు ఆంక్షలతో ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు.

ఈ బాధలు ఆసుపత్రి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే గాంధీలోని ఓ పాత భవనం నివాసం ఉండాలని ఆదేశించారని.. అందులో అరకొర సౌకర్యాలు.. కనీస భద్రత లేవని తమవి కూడా ప్రాణాలేనని పేర్కొన్నారు. కాగా, ఈ అన్ని పరిస్థితులను చూసిన కొందరు నర్సులు, ఇతర సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది తాము పనిచేయలేమని తమకి స్వచ్ఛంద సెలవులు మంజూరు చేయాలనీ కోరారు.

కాగా, ఇప్పటికే కొందరు సీనియర్ సిబ్బంది ఆరోగ్య కారణాలు, ఇతర కారణాలను చూపు సెలవులపై వెళ్లినట్లుగా తెలుస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగి రోగుల సంఖ్య పెరుగుతూ వైద్య సిబ్బందికి బాధలు పెరిగితే పరిస్థితి దారుణంగా మారుతుంది. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోని.. వారికి తగిన సౌకర్యాలు, రవాణా, ఆహారం, జాగ్రత్తలతో వైద్యం చేసేలా శిక్షణ, పూర్తిస్థాయిలో తగిన ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాల్సి ఉంది.

 

 

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   4 hours ago


చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

   5 hours ago


షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

   2 hours ago


తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

   5 hours ago


జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

   6 hours ago


అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

   7 hours ago


కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

   20 hours ago


కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

   a day ago


దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

   a day ago


Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   17-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle