గాంధీలో మళ్లీ విధుల బహిష్కరణ..
22-09-202022-09-2020 16:22:02 IST
Updated On 22-09-2020 16:25:06 ISTUpdated On 22-09-20202020-09-22T10:52:02.269Z22-09-2020 2020-09-22T10:51:52.483Z - 2020-09-22T10:55:06.677Z - 22-09-2020

గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది మరోసారి విధులు బహిష్కరించారు. మూడు నెలల క్రితం తమ డిమాండ్ మేరకు జీతాల పెంపుతో పాటు, కరోనా వార్డుల్లో పనిచేస్తున్నవారికి ఇన్సెంటివ్ లు, నెలలో 15 రోజులు ఖచ్చితంగా పనిదినాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను ఇంతవరకూ నెరవేర్చలేదని గాంధీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. హామీలిచ్చి మూడు నెలలు గడిచిపోయినా ఇంతవరకూ పెంచిన జీతాలు, స్పెషల్ అలవెన్సులు ఇవ్వకపోవడంతో సిబ్బంది ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ఆవరణలో పేషెంట్ కేర్, ఔట్ సోర్సింగ్, సెక్యూరిటీ, పారిశుద్ధ్య కార్మికులు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో గాంధీ సిబ్బంది ఆందోళన చేపట్టగా.. కరోనా వార్డుల్లో ఉన్న రోగులకు సరైన వైద్యం అందని పరిస్థితి తలెత్తింది. కరోనా రోగులతో పాటు ఇతర వార్డుల్లోనూ ఇదే పరిస్థితి. గతంలో సిబ్బంది విధులు బహిష్కరించినప్పుడు కూడా పేషెంట్లు చాలా ఇబ్బందులు పడ్డారు. మూడు నెలల క్రితం ఏకంగా ఆరు రోజుల పాటు సిబ్బంది విధులు బహిష్కరించారు. అప్పట్లో కరోనా విజృంభణ అధికంగా ఉండటంతో కరోనా వార్డుల్లోని పేషెంట్లు చాలా ఇబ్బందులెదుర్కొన్నారు.
గాంధీ సిబ్బంది విధులు బహిష్కరిస్తే కరోనా పేషెంట్లకు సరిగ్గా వైద్యం అందదని భావించిన ప్రభుత్వం.. సిబ్బంది డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. 7 నుంచి 14 ఏళ్లుగా పనిచేస్తున్న నర్సులకు జీతాల పెంపుతో పాటు కరోనా వార్డుల్లో పనిచేసేవారికి స్పెషల్ అలవెన్సులుంటాయని ప్రకటించింది. అలాగే శానిటరీ సిబ్బందికి 15 రోజుల పనిదినాలతో పాటు ప్రతిరోజూ ఇంక్రిమెంట్లిస్తామని పేర్కొంది. ఇప్పుడు ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేయకపోవడంతో సిబ్బంది ఆందోళనకు దిగారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
13 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
9 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
12 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
16 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
19 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
20 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా