newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గవర్నర్ Vs సీఎం... కరోనా చిచ్చుపెట్టిందా?

08-07-202008-07-2020 07:52:06 IST
Updated On 08-07-2020 10:22:03 ISTUpdated On 08-07-20202020-07-08T02:22:06.034Z08-07-2020 2020-07-08T02:21:59.363Z - 2020-07-08T04:52:03.966Z - 08-07-2020

గవర్నర్ Vs సీఎం... కరోనా చిచ్చుపెట్టిందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఏం జరుగుతోంది? కరోనా పరీక్షలు జరుగుతున్నాయా? సీఎం కేసీయార్ ఎక్కడ? తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ల మధ్య కరోనా చిచ్చు పెట్టిందా ? ఒక పక్క రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నా సీఎం కేసీఆర్ దృష్టి సారించడం లేదు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ తెలంగాణ గవర్నర్ కరోనా విషయంలో దృష్టి సారించారా ?

తెలంగాణ సీఎస్, హెల్త్ సెక్రెటరీ కి రావాలని కబురు పంపించినా గవర్నర్ ఆదేశాలను పక్కన పెట్టి రాలేమని సందేశం పంపడం వెనక సీఎం కేసీఆర్ వున్నారా ?దీంతో గవర్నర్ సీరియస్ గా ఉన్నారా ? ఇవి ఇప్పుడు గవర్నర్, సీఎం కెసిఆర్ ల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

కరోనా మహమ్మారి... తెలంగాణ రాష్ట్రాన్ని కాకుండా యావత్ ప్రపంచాన్ని గజ గజ వణికిస్తుంది. ఈ మహమ్మారితో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో గాంధీ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని, ఇక ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీకి పాల్పడుతున్నారని ప్రతిపక్ష పార్టీల విమర్శలు, ప్రజల విన్నపాలు గవర్నర్ తమిళిసై వరకు చేరాయి. 

ఇదే సమయంలో సీఎం కేసీఆర్ ఎక్కడ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం పై సీరియస్ గా ఉన్న గవర్నర్ తమిళిసై కరోనా పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారని సమాచారం. ఇక ఇదే విషయం తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారింది. 

గవర్నర్ గా తమిళిసై ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది కానీ, ఆమె స్వయంగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తే పరిపాలన అధికారాలను చేతుల్లోకి తీసుకున్నట్లుగా ఉంటుందని భావించి సి ఎస్, మరియు హెల్త్ సెక్రటరీ చేత రాలేమని చెప్పించినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతేకాదు కరోనా ఫిర్యాదులపై గవర్నర్ తమిళిసై తానే ప్రభుత్వంలా చేతుల్లోకి తీసుకోవడం సరికాదు అనే భావన అంతర్గతంగా ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఇప్పటికే కెసిఆర్ ఎక్కడ అని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న వేళ గవర్నర్ తలపెట్టిన సమీక్ష సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హెల్త్ సెక్రటరీ శాంతి కుమారి హాజరైతే తెలంగాణ రాష్ట్రంలో పాలన పై తప్పుడు సంకేతాలు వెళతాయన్న ఆలోచనతో తమిళిసై సమీక్ష సమావేశానికి రాలేమని, అప్పటికే నిర్ణయించిన కార్యక్రమాలలో బిజీగా ఉన్నామని ప్రభుత్వమే సీఎస్, హెల్త్ సెక్రటరీ తో చెప్పించారు అని సమాచారం. రాజ్ భవన్ నుండి పిలుపు వస్తే హుటాహుటిన వెళ్లాల్సిన అధికారులు ,నిర్దేశించుకున్న ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున హాజరు కాలేమని సమాధానం ఇవ్వడమే ఇంత చర్చకు ప్రధాన కారణం.

అయితే రాష్ట్రంలో కరోనా వ్యవహారంలో, అలాగే అధికారులు సమాధానం ఇచ్చిన తీరుతో తీవ్ర అసహనంతో ఉన్న గవర్నర్ తమిళిసై కరోనా చికిత్సలో దోపిడీపై తనకు అందిన ఫిర్యాదుల మేరకు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో భేటీ అయ్యారు. ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.

ఐసోలేషన్ సౌకర్యం ఉన్న ఆసుపత్రులలో వసతులతో పాటు, చికిత్స, పడకలు, బిల్లులు, పరీక్షలు, ప్రైవేటు ఆసుపత్రులపై ప్రజల ఫిర్యాదులపై కూడా సమీక్షలో తమిళిసై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. గవర్నరే స్వయంగా రంగంలోకి దిగి ఆస్పత్రి వర్గాలతో సమీక్ష చేపట్టినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఈ వ్యవహారంలో తమిళిసై జోక్యం చేసుకోవడం తెలంగాణ సర్కార్ ను ఇబ్బంది పెడుతోంది. ఇక తాను కబురు పంపినా రాలేమన్న అధికారులు తీరుపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle