newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గవర్నర్ చొరవతో కేసీయార్‌లో కదలిక వచ్చిందా?

21-07-202021-07-2020 08:35:40 IST
Updated On 21-07-2020 10:45:46 ISTUpdated On 21-07-20202020-07-21T03:05:40.704Z21-07-2020 2020-07-21T03:05:22.402Z - 2020-07-21T05:15:46.735Z - 21-07-2020

గవర్నర్ చొరవతో కేసీయార్‌లో కదలిక వచ్చిందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు హైకోర్టు ఆగ్రహం.. ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నవేళ తెలంగాణసీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సౌందరరాజన్‌ను కలిశారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ భేటీ సందర్భంగా పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో కరోనా వైరస్ స్థితిగతులను గవర్నర్‌కు కేసీఆర్ వివరించారని సమాచారం. కరోనా పెరుగుతున్న తీరు... కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం అందిస్తోన్న వైద్యం తదితర అంశాలను ఆయన గవర్నర్‌కు వివరించారు. 

సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయ నిర్మాణం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశంపైనా కేసీఆర్ చర్చించారని తెలుస్తోంది.రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ సీఎం కేసీఆర్ చాలా రోజుల పాటు కరోనాపై సమీక్షలు నిర్వహించలేదు. దీంతో గవర్నర్ స్వయంగా రంగంలోకి దిగారు. 

చీఫ్ సెక్రటరీ, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించడానికి ప్రయత్నించారు. కానీ వారు హాజరు కాలేదు. దీంతో గవర్నర్ ప్రయివేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలతో భేటీ నిర్వహించారు.ఆదివారం ప్రధాని మోదీ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆరా తీశారు. ఆ మరుసటి రోజే గవర్నర్‌తో కేసీఆర్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తెలంగాణలో 45 వేలకుపైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.తెలంగాణలో ఇప్పటి వరకు 2,65,219 కరోనా టెస్టులు చేయగా.. 45,076 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో 32,438 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 17,081 బెడ్స్ అందుబాటులో ఉండగా.. 15,181 పడకలు ఖాళీగా ఉన్నాయి.

ఇంతకు ముందే గవర్నర్ డాక్టర్ తమిళసై గాంధీ ఆస్పత్రికి సందర్శించిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స. ధరల విషయం ఆమె ఆరాతీశారు. గవర్నర్ అంటే రబ్బర్ స్టాంప్ కాదని, క్రియాశీలకంగా వ్యవహరిస్తే ఎలా వుంటుందో ఆమె నిరూపించారు. 

అయితే గవర్నర్ తీరు అధికార పార్టీ నేతలకు మింగుడుపడడం లేదు. ఇంత యాక్టివ్ గా వుంటే ఎలా? తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని వారు మధనపడుతున్నారు. అయితే ఒక డాక్టర్ గా ఆమెకు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం. అందుకే ఆమె ఎవరేమనుకున్నా రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా, గవర్నర్ స్థానంలో బాధ్యాతాయుతమయిన పాత్ర పోషిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

ఇదిలా వుంటే గవర్నర్-సీఎం మధ్య ఎలాంటి అభిప్రాయా భేదాలు లేవని నిరూపించడానికి, పాలన సవ్యంగానే సాగుతోందని సంకేతాలివ్వడానికి సీఎం కేసీయార్ గవర్నర్ తో భేటీ అయి ఉండవచ్చు. రాజకీయ విషయాల్లో కేసీయార్ తెగేదాకా లాగే మనిషి కాదు. ఎక్కడ తగ్గాలో ఆయనకు బాగా తెలుసు కదా. 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle