newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గవర్నర్‌తో కేసీయార్ భేటీ... బాబాయి మృతితో తమిళసైకి పరామర్శ

30-08-202030-08-2020 12:28:52 IST
Updated On 30-08-2020 12:30:38 ISTUpdated On 30-08-20202020-08-30T06:58:52.120Z30-08-2020 2020-08-30T06:58:45.614Z - 2020-08-30T07:00:38.202Z - 30-08-2020

గవర్నర్‌తో కేసీయార్ భేటీ... బాబాయి మృతితో తమిళసైకి పరామర్శ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్యరాజన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఇటీవల గవర్నర్‌ బాబాయి, తమిళనాడులోని కన్యాకుమారి ఎంపీ వసంత్‌కుమార్‌ కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.  ఈసందర్బంగా ఎంపీ వసంత్ ఆకస్మిక మృతిపై సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. రాజ్‌భవన్‌కు వచ్చి సంతాపం తెలిపిన ముఖ్యమంత్రికి గవర్నర్‌ తమిళిసై ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు.

నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడే ఎంపీ వసంత్ ఇకలేరు

ముఖ్యమంత్రి వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్‌, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఉన్నారు. ఇదిలా వుంటే కరోనా వైరస్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన వసంత్‌కుమార్‌ అంత్యక్రియలు ఆదివారం ఉదయం కన్యాకుమారి జిల్లా అగస్తీశ్వరంలో జరగనున్నాయి. ఎంపీగానే కాకుండా ఆయన పారిశ్రామిక వేత్తగా కూడా అందరికీ చిరపరిచితుడు. 

వివిధ కారణాల వల్ల ప్రజాప్రతినిధుల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగడం సహజం. అయితే వసంతకుమార్‌  ప్రాతినిధ్యం వహించిన కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గంలో యాభై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఉప ఎన్నికలు జరగనున్నాయి.  2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వసంత్‌కుమార్‌ గెలుపొందగా, ఆయన పదవీకాలం ఇంకా నాలుగేళ్లు ఉంది. ఆయన కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ 2019 ఎన్నికల్లో ఓడించారు. కరోనా వచ్చిన కొత్తలోనే కరోనా వ్యాప్తి తీవ్రంగా వుంటుందని పార్లమెంట్ సాక్షిగా ప్రసంగించారు. చిన్న వ్యాపారుల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనాను జాతీయ విపత్తుగా పరిగణించాలన్నారు. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle