newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గరికపాడు చెక్ పోస్ట్ వద్ద హై డ్రామా.. చివరాఖరికి ఏపీలోకి ఎంట్రీ

26-03-202026-03-2020 07:14:30 IST
2020-03-26T01:44:30.148Z26-03-2020 2020-03-26T01:41:31.835Z - - 15-04-2021

గరికపాడు చెక్ పోస్ట్ వద్ద హై డ్రామా.. చివరాఖరికి ఏపీలోకి ఎంట్రీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు మోడీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలుచేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లోని కొన్ని హాస్టళ్ళ యాజమాన్యాలు హాస్టల్స్ ఖాళీ చేయమన్నాయి.  దీంతో ఆయా హాస్టల్స్ లో ఉండేవారంతా పోలీసు స్టేషన్స్ కి క్యూ కట్టారు. వందలాదిమంది హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్ బీ, పంజాగుట్ట, మేడ్చల్, సికింద్రాబాద్, బాలానగర్ ప్రాంతాల్లో పోలీసులను కలిశారు.  దీంతో వారు వారి సొంత ప్రాంతాలకి వెళ్లిపోవచ్చంటూ కొన్ని నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ లు జారీ చేశారు. అయితే వాటిని తెలంగాణ పోలీసులు అనుమతించారు కానీ ఏపీ పోలీసులు మాత్రం వారిని బోర్డర్ లోనే ఆపేశారు. 

అంతకుముందు బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్ లో వేలాదిమంది విద్యార్ధులు పోలీస్ స్టేషన్లకు వచ్చారు. హాస్టళ్ళలో ఉండలేం.. తిండిలేదు, బయట తిరిగితే పోలీసుల ఆంక్షలు.. ఈ కష్టాలు మేం పడలేం. మా రాష్ట్రానికి మేం వెళ్లిపోతాం. అనుమతించండని అభ్యర్ధించారు. దానితో కరుణించిన హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనుమతి పత్రాలిచ్చారు.  దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లు.. అక్కడ ఏపీ సర్కారు వారిని రానీయకుండా అడ్డుకుంది. అటు.. ఆంధ్రా నుంచి తిరిగి తెలంగాణకు వెళదామనుకుని, సరిహద్దుల వరకూ వెళ్లిన తెలంగాణ వాసులదీ అదే పరిస్థితి. ఫలితం.. అటు సొంత రాష్ట్రానికీ వెళ్లలేక, ఇటు తిరిగి వెనక్కీ వెళ్లలేక తర్జన భర్జన పడ్డారు. 

కరోనా వైరస్ కారణంగా వచ్చే నెల 15వ తేదీ వరకూ కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో, హైదరాబాద్ లోని అన్ని కంపెనీలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించాయి. ఐటి కంపెనీలు కూడా, ఉద్యోగులకు ఇంటి నుంచే  పనిచేసుకునే వెసులుబాటు కల్పించాయి. దీనితో ఒక్కరే బిక్కుబిక్కుమని కూర్చున్న ఏపీ వాసులు, తమ రాష్ట్రానికి వెళ్లిపోవాలని భావించారు. అయితే, రాష్ట్ర సరిహద్దులు మూసివేయడం, కర్ఫ్యూ కారణంగా స్థానికంగా తిరిగే అవకాశం లేకపోవడంతో.. వారంతా పోలీసులను ఆశ్రయించారు. దీనితో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజన్‌కుమార్, మానవత్వంతో స్పందించారు. ఏపీకి వెళ్లాలనుకున్న వారికి అనుమతి పత్రాలు ఇవ్వాలని ఆదేశించారు. ఫలితంగా సంజీవరెడ్డినగర్, మాదాపూర్, దుండిగల్, పంజాగుట్ట పోలీసుస్టేషన్ల వద్దకు ఏపీ వాసులు వందల సంఖ్యలో వచ్చి, అనుమతి పత్రాలు తీసుకున్నారు. పోలీసులు కూడా ఓపికగా వారికి అనుమతిపత్రాలు ఇచ్చి, వారిని గమ్యాలకు చేర్చేందుకు సాయపడ్డారు. 

అసలు కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. అనుమతి పత్రాలయితే వచ్చాయి గానీ, ఏపీ వరకూ వెళ్లాలంటే కావలసిన వాహనాలు అందుబాటులో లేవు. అయినా, ఏదోలా తంటాలు పడి, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఉన్న, తెలంగాణ ఆఖరి చెక్‌పోస్టు వరకూ చేరుకోగలిగారు. మరికొద్దిసేపయితే, తమ రాష్ట్రంలో అడుగుపెడతామని ఆనందించిన వారి ఆశలను, ఆంధ్రా సర్కారు ఆవిరి చేసింది. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని, అక్కడున్న కృష్ణా జిల్లా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే తమవద్ద తెలంగాణ సర్కారు ఇచ్చిన అనుమతిపత్రాలు ఉన్నాయని వాదించి, వాటిని చూపించినా ఆంధ్రా పోలీసుల వైఖరిలోమార్పు లేదు. 

జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అక్కడికి చేరుకోగా, పరిస్థితిని ఆయనకు వివరించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రానంతవర కూ తామేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు. మహిళల పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ సమీపంలో మరుగుదొడ్లు కూడా లేకపోవడం, గ్రామాల నుంచి వెళదామనుకుంటే, అక్కడ గ్రామస్తులు కూడా కంచెలు వేయడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ వచ్చేందుకు వారికి వాహనాలు కూడా లేవు.

ఈ సమస్యను పరిష్కరించాల్సిన ఏపీ సర్కారు.. హైదరాబాద్‌లో హాస్టళ్లను యజమానులు ఖాళీ చేయిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు, ఏపీ సీఎస్ తెలంగాణ సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. దానికి స్పందించిన కేటీఆర్.. హాస్టళ్ల యజమానులతో మాట్లాడాలని మేయర్, అధికారులను ఆదేశించారు. వారంతా ఆంధ్రాకు వస్తే ప్రమాదమన్న తరహాలో మంత్రి బొత్స తెలంగాణ సర్కారుకు చెప్పడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆంధ్రా సరిహద్దులో ఉన్న తెలంగాణ వాసులను కూడా హైదరాబాద్ వైపు వెళ్లనీయకుండా ఆపిన పరిస్థితి నెలకొంది. 

తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళుతున్న వారికి తెలంగాణ పోలీసులు అనుమతించినా, ఏపీ సర్కారు స్పందించకపోవడం ఏమిటని బీజేపీ తెలంగాణ నేతలు మండిపడ్డారు. బీజేపీ వైస్ ప్రెసిడెంట్ సంకినేని వెంకటేశ్వరావు ఏపీ బీజేనీ నేతలతో మాట్లాడారు. జగ్గయ్యపేట సరిహద్దు వద్ద ఉన్న వారి సమస్యలు తెలుసుకునేందుకు, ఏపీ ప్రభుత్వం ప్రయత్నించకపోవడం విచారకరమన్నారు. ఆంధ్రా-తెలంగాణ వారిని వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆయన ఏపీ బీజేపీ నేతలతో ఫోన్‌లో మాట్లాడి, సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లారు. 

అనేక గంటల తర్జనభర్జనల అనంతరం జగ్గయ్యపేట వద్ద హైదరాబాద్‌ నుంచి వచ్చి వేచిచూస్తున్న వారికి రాష్ట్రంలోకి అనుమతి ఇచ్చారు.హెల్త్‌ప్రోటో కాల్‌ కోసం వారిని అందరినీ ప్రత్యేక బస్సుల ద్వారా క్వారెంటైన్ లకి అధికారులు తరలించారు. వారిని వైద్య పరీక్షలకోసం క్వారంటైన్‌ చేస్తున్నట్టు చెబుతున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వారిని నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి తరలించారు  అధికారులు, ఈస్ట్‌ గోదావరి వారిని రాజమండ్రి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. వెస్ట్‌గోదావరి జిల్లాల వారిని తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం క్వారంటైన్లకు తరలిస్తున్నారు అధికారులు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఫలితాల ఆధారంగా స్వస్థలాలకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇలా క్వారెంటైన్ కి వెళ్ళడం ఇష్టం లేని కొందరు అక్కడి నుండి వెనుతిరిగి హైదరాబాద్ వచ్చేసినట్టు తెలుస్తోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle