newssting
BITING NEWS :
* సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య సుదీర్ఘ చర్చలు. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల రాత్రి 9 గంటల వరకు ఆరవ విడత చర్చలు. * మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు, మహిళలు అధికం. * బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకు సమాజ్‌వాదీ పార్టీ మద్ధతు. సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా సోమవారం రాత్రి ప్రకటన. * ముంబై నగరంతోపాటు పలు పరిసర నగరాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరికలు. ముంబై, థానే, రాయగడ్, పూణే, సతార, సిందూర్గ్ ప్రాంతాల్లో మంగళవారం ఉరుముులు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంబై వాతావరణ శాఖ హెచ్చరికలు. రష్యా దేశంలో భారీ భూకంపం. రష్యాలోని ఇర్కుట్సు రీజియన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యన్ ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడి. భూకపంపంతో ప్రజలు భయాందోళనలు. విగత జీవిగా దొరికిన సరూర్ నగర్ తపోవన్‌కాలనీ వద్ద ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన నవీన్‌కుమార్‌. * కేంద్రంలో తెచ్చిన వ్యవసాయ బిల్లులతో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య సాగుతున్న విమర్శ, ప్రతి విమర్శలు. * కేంద్ర బిల్లులతో రైతులకు మేలని బీజేపీ వర్గాలు, కొత్తగా తెచ్చిన బిల్లులతో రైతులను తీవ్ర నష్టమని టీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు. 280వ రోజుకు చేరుకున్న రాజధాని అమరావతి రైతుల ఉద్యమం. కొనసాగుతున్న శిబిరాల్లో రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం. నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ జరిగే అవకాశం. బుధవారం తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సి ఉన్నా మంగళవారం ఆకస్మిక ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం గమనార్హం. రాష్ట్రంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ, షాలతో చర్చకు అవకాశం. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం.

గజ్వేల్ వాసులకు పండగే.. కేసీయార్ వరాల జల్లు

11-12-201911-12-2019 15:31:33 IST
2019-12-11T10:01:33.421Z11-12-2019 2019-12-11T10:01:27.119Z - - 22-09-2020

గజ్వేల్ వాసులకు పండగే.. కేసీయార్ వరాల జల్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గజ్వేల్ అంటే తెలంగాణ సీఎం కేసీయార్ కు వల్లమాలిన అభిమానం. తాజాగా కేసీఆర్ గజ్వేల్ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. 2020 జనవరి నెలాఖరుకు గజ్వేల్ కు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వస్తాయని, ఈ ప్రాంతం మరింతగా సస్యశ్యామలం అవుతుందన్నారు. త్వరలో గజ్వేల్ నుంచే హెల్త్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుడతామన్నారు.

పేదలందరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని,  గజ్వేల్ లో ఇళ్లు లేని నిరుపేదలు ఉండరన్నారు. తన పర్యటనలో భాగంగా కేసీయార్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గజ్వేల్ లో ఒక రోజు ఉండి అందరితో మాట్లాడతానన్నారు. 

జనవరిలో గోదావరి జలాల పండగ రాబోతోందన్నారు.  ప్రతీ ఇల్లు పాడిపరిశ్రమలతో కళకళలాడాలని కేసీయార్ ఆకాంక్షించారు. హరితహారంతో దేశానికే గజ్వేల్ ఆదర్శంగా ఉంటోందన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో మహతి తరహా ఆడిటోరియంలు నిర్మిస్తామన్నారు. తెలంగాణ సాహితీ సౌరభం ఈ మహతి ఆడిటోరియం. మహతి ఆడిటోరియం నుంచి నలు దిశలా వెలుగులు ప్రసారించాలని తన కోరిక.

ఈ హాల్‌కు మహతి అనే పేరు నేనే పెట్టాను అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రజలందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రజల వైద్య పరీక్షలకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి. గజ్వేల్‌ నియోజకవర్గ ఆరోగ్య సూచిక వెంటనే రూపొందించాలి. ప్రతి కుటుంబ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు.

ప్రజల మధ్య ఉండే ఏ రాజకీయ నాయకుడూ రిలాక్స్‌ కావొద్దు. ఇతరులు గజ్వేల్‌ను చూసి నేర్చుకోవాలి. ఏ గ్రామంలో ఏ పని లేకుండా ఉన్నవాళ్లెవరు.. వాళ్లకేం పనివ్వాలో ఆలోచించాలి అని సీఎం కేసీఆర్‌ అన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle