newssting
BITING NEWS :
*రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు-కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ *ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ. 5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ మీటింగ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్. పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ *కొత్తకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డివైడర్ ఢీ కొట్టి తుఫాన్ వాహనం బోల్తా. ఇద్దరు మృతి. 14 మందికి తీవ్రగాయాలు, హాస్పిటల్ కు తరలింపు * ఇవాళ కెసిఆర్ బర్త్ డే. కెసిఆర్ పుట్టినరోజును మొక్కల పండుగగా జరపాలని తెరాస పిలుపు. రేపు ఉదయం నుంచి మొక్కలు నాటడం... రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు *జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం. పనిచేసే కార్యకర్తలకే జనసేన పార్టీలో ప్రాధాన్యత. కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకున్నా-పవన్ *రాజధాని మార్పు, పీఏఏల రద్దు తొందరపాటు నిర్ణయాలు, పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి, శాసనమండలి రద్దు నిర్ణయం సరైంది కాదు-దగ్గుబాటి పురంధేశ్వరి*ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... మూడోసారి సీఎంగా ప్రమాణం

ఖాళీ ఖజానా.. అధికారుల హైరానా!

16-12-201916-12-2019 12:50:18 IST
2019-12-16T07:20:18.993Z16-12-2019 2019-12-16T07:20:07.881Z - - 17-02-2020

ఖాళీ ఖజానా.. అధికారుల హైరానా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలంగాణలో ఏం జరుగుతోంది?

పథకాల అమలులో దేశానికే ఆదర్శం

అభివృద్ధి పనులకు నిధుల లేమి

కొత్త పనులు వద్దంటూ అధికారులకు ఆదేశాలు

అత్యవసర, ప్రభుత్వ ప్రాధాన్య పనులకు అంగీకారం

పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖలకు మౌఖిక ఆదేశాలు

ఖజానా ఖాళీతో చేతులెత్తేస్తున్న ఆర్థికశాఖ అధికారులు

చేసిన పనులకూ బిల్లులు రాక కాంట్రాక్టర్ల ఇబ్బందులు

వివిధ శాఖల్లో పేరుకుపోతున్న బకాయిలు

రూ.2వేల కోట్లకు పెరిగిన పెండింగ్ బిల్లులు

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. సంక్షేమ, అభివృద్ధి పథకాలకు నిధులు అందడం లేదు. చిన్న చిన్న పనులకే అధికారులు బిల్లులు చెల్లించడంలేదు. గ్రామాల్లో చిన్న చిన్న రహదారుల నిర్మాణం, మరమ్మతులకే అవకాశం ఉండడం లేదు. ఐదేళ్ళలో తెలంగాణ ఏర్పడ్డాక ఐదున్నర సంవత్సరాల్లోనూ ఎన్నడూ లేని విధంగా అధికారులు ఆర్థిక వ్యవస్థ బాగాలేదనే మౌఖిక ఆదేశాలిచ్చారు. 

పరిస్థితి ఇలాగే ఉంటే.. అభివృద్ధి పనులు ఇక ముందుకు సాగవంటున్నారు. నీటి పారుదల శాఖ, ప్రభుత్వ ప్రాధాన్య పథకాల పనులు మినహా.. ఇతర అన్ని ఇంజనీరింగ్‌ పనులూ నిలిచిపోతున్నాయి. వివిధ విభాగాల ద్వారా మంజూరు చేసే పనులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ నియోజక వర్గాల అభివృద్ధి నిధుల కోటాతో, స్పెషల్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌తో చేపట్టే పనులను కూడా నిలిపి వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలోనే స్వయాన కేసీయార్ వివిధ విభాగాలకు ఆదేశాలిచ్చారు. మూడు, నాలుగు రోజుల్లోనే ప్రధాన శాఖల్లో పనులు నిలిచిపోయాయి.

ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే వేతనం మాత్రం కేంద్రం అందిస్తుంది కాబట్టి వాటికి ఇబ్బందులు లేవు. ప్రతి ఏటా మార్చి 31 నాటికి ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనే రాబడి, ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా కొత్తగా ఒక్క పనిని కూడా చేపట్టవద్దని ఆదేశించారు.

 

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పనులకు ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ రోడ్ల పనులకు సంబంధించి రూ.2 వేల కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది.

అభివృద్ధి పనుల కొనసాగింపు, కొత్త వాటిని ప్రారంభించడంపై విధించిన అనధికార స్టేటస్‌ కో ఎప్పటి వరకూ కొనసాగుతుందన్న అంశం అధికారులే చెప్పడంలేదు. ఆర్థిక పరిస్థితి, చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోవడంతో అధికారులు హైరానా పడుతున్నారు.  నిధులు విడుదల కాకపోతే తాము చేయడానికి ఏం పని ఉండదని అధికారులు అంటున్నారు. 

 

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

   an hour ago


మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

   an hour ago


మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

   3 hours ago


కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

   3 hours ago


అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

   5 hours ago


రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

   5 hours ago


కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

   7 hours ago


కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

   7 hours ago


అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

   8 hours ago


‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

   9 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle