newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఖాకీలను కలవరపెడుతున్న కరోనా.. గాంధీలో టెన్షన్

12-06-202012-06-2020 12:12:05 IST
2020-06-12T06:42:05.374Z12-06-2020 2020-06-12T06:41:30.173Z - - 17-04-2021

ఖాకీలను కలవరపెడుతున్న కరోనా.. గాంధీలో టెన్షన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 209 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం తెలంగాణలో కేసుల సంఖ్య 4320 కి చేరింది.  ఈరోజు కరోనా కారణంగా 9 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 165కి చేరింది. ప్రస్తుతం 2162 యాక్టివ్ కేసులు ఉండగా, 1993 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసి పరిధిలో అత్యధికంగా 175 కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 7, మహబూబ్ నగర్ లో 3, మేడ్చల్ లో 10,  కరీంనగర్ 3, సిద్దిపేట్, ఆసిఫాబాద్ లో 2, ములుగు, కామా రెడ్డి, సిరిసిల్ల వరంగల్ రూరల్ లలో ఒక్కో కేసు నమోదయ్యాయి.  

కరోనా వైరస్ డాక్టర్లనే కాదు, ఖాకీలను, జర్నలిస్టుల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. కరోనా రోగులకు సేవలు చేస్తూ, వైద్యం అందిస్తూ డాక్టర్లు కరోనా బారిన పడుతున్నారు. ఇటు విధి నిర్వహణలో పోలీసులు, పాత్రికేయులను కూడా కరోనా మహమ్మారి కాటేస్తోంది. ఇప్పటికే 16 మంది పాత్రికేయులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఒక యువ పాత్రికేయుడు కరోనా కారణంగా ప్రాణాలు వదిలాడు. 

ఇటు కరోనా వైరస్ తో ముందుండి పోరాడుతున్న వారిలో పోలీసుల పాత్ర చాలా కీలకం.  నేరస్తుల పాలిట సింహస్వప్నంగా వుండే పోలీసులను కరోనా షేక్ చేస్తోంది. హైదరాబాద్ లో ఇప్పటికే పెద్ద సంఖ్యలో పోలీసులు  కరోనా బారిన పడ్డారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏడుగురు పోలీసులకి కరోనా పాజిటివ్ గా తేలడం ఆందోళనను మరింత పెంచింది. ఈ ఘటన పోలీసు శాఖకు దిగ్భ్రాంతి కలిగించింది. 

గాంధీ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్ద ఆందోళన కొనసాగుతూనే వుంది. గాంధీ ఆస్పత్రిపై కరోనా భారాన్ని తగ్గించాలని జూడాలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు డ్యూటీలకు వెళ్లేది లేదంటున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ జూడాలను కలిసి చర్చలు జరిపారు. ప్రభుత్వంతో ఇవాళ జూడాలు మరోసారి చర్చలు జరపనున్నారు. ఒకవైపు జూడాలు ఆందోళనకు దిగితే.. గాంధీ ఆసుపత్రిలో మరో దారుణం చోటు చేసుకుంది. గాంధీ ఆసుపత్రి మార్చురీ నుంచి ఒక మృతదేహం అదృశ్యమైంది. కరోనాతో మృతిచెందిన రషీద్ ఆలీ మృతదేహం తీసుకువెళ్లేందుకు ఆసుపత్రికి వచ్చిన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. 

అక్కడ మృతదేహం కనిపించకపోవడంతో ఆసుపత్రి వర్గాలు విచారణ ప్రారంభించాయి. ఒకరి మృతదేహానికి బదులు అలీ మృతదేహాన్ని మరొకరికి అప్పగించినట్లు గుర్తించారు. 12 గంటల తర్వాత రషీద్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఉదయం నుంచి గాంధీ మార్చురీ వద్ద ఆందోళనకి దిగారు కుటుంబ సభ్యులు. రషీద్ ఆలీ మృతదేహం అప్పగించడంతో అంత్యక్రియలకు తీసుకువెళ్లారు. 

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   9 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   14 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   11 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   15 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   13 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   17 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   19 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle