newssting
BITING NEWS :
తీవ్ర వివాదాల మధ్యనే పార్లమెంటులో ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు. ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లులు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇవి చట్టరూపం. ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయని, రైతులకు ఇవి మరణ శాసనాలని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసినా వెనక్కు తగ్గని కేంద్రం * రాజ్యసభలో కొనసాగుతున్న దుమారం. విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం. హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను హరివంశ్‌ తూట్లుపొడిచారాని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ విమర్శ * అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరపన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిలనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదల కోసం మరోసారి ప్రయత్నాలు. శశికళ విడుదల కోసం అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ ఢిల్లీకి పయనం. సుప్రీం కోర్టు న్యాయవాదులు, న్యాయనిపుణులతో చర్చలు * ఆరు నెలల తర్వాత సోమవారం ఉదయం సందర్శకుల కోసం తెరుచుకున్న ఆగ్రాలోని అంతర్జాతీయ చారిత్రక పర్యాటక కేంద్రం తాజ్‌మహల్‌. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ బారులు తీరిన సందర్శకులు. సోమవారం 160 మంది పర్యాటకులు ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు. రెండు షిఫ్తుల్లో రెండు వేలమందికి అనుమతులు * మహారాష్ట్రలోని భీవండి నగరంలో తీవ్ర విషాదం. మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలి పది మంది మృతి, మరో 20 మందికి గాయాలు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మర సహాయక చర్యలు * నేటి నుండి హైకోర్టులో అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి, మాజీ ఎంఎల్‌ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్‌లపై రోజువారీ విచారణ. నేడు ధర్మాసనం ముందు లిస్ట్ అయిన 93 పిటిషన్‌లు విచారణ. ఆన్‌లైన్ ద్వారా రాజధానికి సంబంధించిన కేసులను విచారించనున్న ధర్మాసనం * నేటి నుండి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాల పునరుద్ధరణ. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసుల కారణంగా దర్శనాలు నిలిపివేయగా నేటి నుండి తిరిగి దర్శనాలు ప్రారంభం. సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్‌ వాడుతూ క్యూలైన్‌లో దర్శనం. పిల్లలకు, వృద్ధులకు ఆలయంలోకి నో ఎంట్రీ * భారీ వర్షాలతో పోటెత్తిన కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదులకు వరద. పలు గ్రామాలు ముంపునకు గురవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు. పలు గ్రామాల్లో వరదలలో చిక్కుకున్న 48 మంది రైతులు, వ్యవసాయ కూలీలు, రక్షించిన ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు * కేంద్రం జారీ చేసిన కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాశాఖ ఉత్తర్వులు. నేటి నుంచి 50 శాతం మంది టీచర్లు బడులకు హాజరు. సోమవారం నుంచి విద్యార్థులు లేకుండానే కొనసాగనున్న పాఠశాలలు * ఈశాన్య బంగా‌ళా‌ఖాతంలో ఆది‌వారం ఉదయం ఏర్పడిన అల్ప‌పీ‌డనం. సోమ‌వారానికి మ‌రింత బలపడి అను‌బం‌ధంగా 3.1 కి.మీ. నుంచి 7.6 కి.‌మీ. ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కరోనా కలకలం

30-05-202030-05-2020 08:48:53 IST
Updated On 30-05-2020 11:17:26 ISTUpdated On 30-05-20202020-05-30T03:18:53.931Z30-05-2020 2020-05-30T03:18:44.040Z - 2020-05-30T05:47:26.573Z - 30-05-2020

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కరోనా కలకలం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ వ్యాప్తంగా రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నడూ నమోదుకాని రీతిలో శుక్రవారం ఏకంగా 169 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే నలుగురు చనిపోయారు. నమోదైన కేసుల్లో తెలంగాణకు చెందిన వారే 100 మంది ఉన్నారు. సౌదీఅరేబియా నుంచి వచ్చిన వారిలో మరో 64 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వలసదారులు ఐదుగురికి కరోనా సోకింది. 

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వైద్యురాలికి కరోనా సోకింది. వారం రోజుల కింద అదే ఆస్పత్రికి చెందిన వైద్యుడికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. కూకట్‌పల్లికి చెందిన ఓ కేన్సర్‌ రోగికి సర్జరీ చేసిన క్రమంలో వీరిద్దరికి కరోనా సోకిందని సమాచారం. తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 80 ఏళ్ళ రిటైర్డ్‌ డాక్టర్‌ కరోనా బారినపడ్డారు. ఇటు జిల్లాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. మొత్తం 169 కేసులు తెలంగాణలో నమోదు కావడంతో ఆందోళన మరింత తీవ్రతరం అవుతోంది. 

తాజా హెల్త్ బులిటిన్లో రంగారెడ్డి జిల్లాలో 14, మెదక్ 2, సంగారెడ్డిలో 2 కేసులు నమోదయ్యాయి, ఇటు ఖమ్మం జిల్లాలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో మండలంలో కలకలం రేగింది సదరు వ్యక్తికి ఐరన్ హార్డ్ వేర్ దుకాణం ఉంది ఈ దుకాణానికి సూర్యాపేట నుంచి పైపులు వస్తూ ఉంటాయి అలాగే వ్యాపార నిమిత్తం తనూ సూర్యాపేట కు వెళ్తూ ఉండేవాడు ఈ క్రమంలో గత కొద్ది రోజుల నుంచి జ్వరంతో బాధపడటంతో కుటుంబ సభ్యులు ఖమ్మం హాస్పిటల్ కు తీసికెళ్లారు.

అక్కడ కరోనా పరిక్షలు నిర్వహించిన వైద్యులు పాజిటివ్ గా నమోదు చేశారు ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మండల  ప్రజలు దీంతో ఆందోళనకు గురవుతున్నారు. కుటుంబ సభ్యులతో పాటు సదరు వ్యక్తితో సంబంధం ఉన్న 16 మందిని క్వారంటైన్ కు తరలించారు. మరికొంతమందిని గుర్తించి క్వారంటైన్ కు పంపే అవకాశం ఉంది.

పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు నేలకొండపల్లిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. శనివారం నుంచి పట్టణంలో దుకాణాలు మూసివేయాలని, ప్రజలు బయటకు రావద్దని కూసుమంచి సిఐ మురళి తెలిపారు.  నేలకొండపల్లి సర్పంచ్ రాయపూడి నవీన్ కుమార్ పట్టణంలో శానిటేషన్ పనులను చేపట్టారు. నేలకొండపల్లి తహసీల్దార్ వీరభద్రం, ఆర్ ఐ సిహెచ్ రమేష్, ఎఎస్ఐ రాఘవయ్య ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజలు మాస్కులు లేకుండా బయటకు రావద్దని నేలకొండపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు సూచనలిస్తున్నారు. 

 

 

బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు

బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు

   4 hours ago


ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

   4 hours ago


స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

   4 hours ago


భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

   5 hours ago


బీజేపీకి అండగా వైసీపీ.. ఎలాంటి మొహమాటల్లేవు!

బీజేపీకి అండగా వైసీపీ.. ఎలాంటి మొహమాటల్లేవు!

   7 hours ago


ఏపీ పోలీస్ సేవ.. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లనక్కర్లేదు

ఏపీ పోలీస్ సేవ.. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లనక్కర్లేదు

   8 hours ago


కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్.. తదుపరి వ్యూహమేంటి?

కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్.. తదుపరి వ్యూహమేంటి?

   9 hours ago


ప్రైవేటు ఏజెన్సీలకు ధీటుగా టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు

ప్రైవేటు ఏజెన్సీలకు ధీటుగా టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు

   9 hours ago


వైద్యులపై దాడి చేస్తే కఠిన శిక్షలు.. జరిమానాలు

వైద్యులపై దాడి చేస్తే కఠిన శిక్షలు.. జరిమానాలు

   20-09-2020


కేంద్రం తీరు కూటమి ధర్మానికి చేటు!

కేంద్రం తీరు కూటమి ధర్మానికి చేటు!

   20-09-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle