ఖజానా నింపే ప్లాన్.. టీ సర్కార్ ఉద్యోగుల జీతాల కోత!
04-04-202004-04-2020 08:12:20 IST
Updated On 04-04-2020 10:07:49 ISTUpdated On 04-04-20202020-04-04T02:42:20.446Z04-04-2020 2020-04-04T02:42:18.639Z - 2020-04-04T04:37:49.625Z - 04-04-2020

కరోనా కారణంగా అన్ని రంగాలు విలవిల్లాడుతున్నాయి. ఇది ప్రపంచ స్థాయి నుండి మన తెలంగాణ వరకు అంతా తెలిసిందే. జనజీవనం ఎక్కడిక్కడ స్తంభించడంతో పాటు కరోనా మహమ్మారి నుండి తప్పించుకునేందుకు మానవాళి మొత్తం బ్రతుకు పోరాటం చేస్తున్నారు. దీంతో ఏ రంగంలో కూడా కనీస ఆదాయం మార్గమన్నది కనిపించడంలేదు. మరి మన ప్రభుత్వాలు ఎలాంటి పరిస్థితిలను ఎదుర్కొంటున్నాయో మనం ఊహించుకోగలం. ఒకపక్క పడిపోయిన ఆదాయం.. మరోవైవు కరోనా నివారణ చర్యలలో భారీగా చేస్తున్న ఖర్చులు కలిపి ప్రభుత్వాలకు తడిసి మోపెడవుతుంది. ఈ క్రమంలోనే ఈ సమస్యకు ఉపశమనం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపేలా సీఎం కేసీఆర్ ఒక డేరింగ్ నిర్ణయం తీసుకున్నారు. అదే ఉద్యోగుల జీతాల నుండి కోత పెట్టి ఆ నగదును ప్రభుత్వ ఖజానాకు మళ్లించడం. నిన్నటికి నిన్న మీడియా ముందుకొచ్చిన సీఎం కేసీఆర్ కరోనా సమస్యపై మాట్లాడుతూ.. ఉద్యోగులకు జీతాలు ఇస్తామా.. ఇస్తే ఎంతిస్తామో..ఒకపక్క రాష్ట్రానికి ఆదాయం లేదు.. మరోవైపు ఖర్చులు పెరిగిపోయాయి.. ఇవన్నీ చూడాలే.. చేయాలే అన్నారు. అయితే రోజు మారేలోగా ఉద్యోగుల జీతాల నుండి కోత ఖరారైంది. అది కూడా చిన్న చితకా కాదు ఏకంగా యాభై శాతం నుండి డెబ్భై ఐదు శాతం వరకు కోతలు పడ్డాయి. సీఎం నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల వరకు ప్రభుత్వ జీతాలు వచ్చే ప్రతి ప్రజా ప్రతినిధి జీతాల నుండి డెబ్భై ఐదు శాతం కోత విధించారు. ఇక అఖిలభారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధించగా మిగతా అన్ని కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో యాభై శాతం కోత విధించారు. ఇక నాలుగో తరగతి ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ ఉద్యోగుల వేతనాలలో కూడా పది శాతం కోత పెట్టారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగులే కాదు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఆధారిత స్వతంత్ర సంస్థల ఉద్యోగుల జీతాలలో కూడా కోత పెట్టారు. రిటైర్డ్ ఉద్యోగులను కూడా వదలని కేసీఆర్ వారి పెన్షన్లలో కూడా యాభై శాతం కోత విధించారు. మొత్తం మీద ఈ నెల ఉద్యోగుల జీతం నుండి సుమారు పదిహేడు వందల కోట్ల రూపాయలు తిరిగి మళ్ళీ రాష్ట్ర ఖజానాకు జమ కానుంది. రాష్ట్ర ఉద్యోగులు, ప్రభుత్వ అనుబంధ రంగ సంస్థల ఉద్యోగుల జీతాల కోత విధించడంలో పెద్ద వ్యతిరేకత ఉండదు. కానీ వారిలో ఇప్పుడు కరోనా బీభత్సంలో సేవలు అందించే వారు కూడా ఉన్నారు. కోత పెట్టిన వారిలో వైద్యులు, పోలీసులు, ఆయా రంగాలలో పనిచేసే ఇతర సిబ్బంది కూడా ఉన్నారు . అందరితో పాటు వారికి కూడా కోత విధించడం కాస్త అసంతృప్తిగా మారింది. అయితే, ఎలాంటి విపత్కర పరిస్థితులను కూడా చాలా సులభంగా డీల్ చేసే సీఎం కేసీఆర్ ఈ అసంతృప్తిని కూడా చాలా సింపుల్ గానే హ్యాండిల్ చేస్తారని ఆయా వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అన్నట్లు ఇప్పటికే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని కూడా సీఎం నిధికి విరాళంగా ఇచ్చారు. మరి ప్రభుత్వం రెండూ కలిపి జమ చేసుకుంటుందా? లేక ఒక్కరోజు విరాళాన్ని వెనక్కు ఇస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
44 minutes ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
14 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
10 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
12 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
17 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
21 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
a day ago
ఇంకా