newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

క‌విత అలిగారా..? అంత అవ‌స‌ర‌మేంటి..?

08-01-202008-01-2020 12:24:49 IST
Updated On 08-01-2020 12:56:54 ISTUpdated On 08-01-20202020-01-08T06:54:49.174Z08-01-2020 2020-01-08T06:54:47.680Z - 2020-01-08T07:26:54.333Z - 08-01-2020

క‌విత అలిగారా..? అంత అవ‌స‌ర‌మేంటి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత గ‌త కొన్ని రోజులుగా రాష్ట్రంలో లేరు. ఆమె అమెరికాలో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఆమె త‌న తండ్రిపై అలిగి వెళ్లార‌నే వార్త చెక్క‌ర్లు కొడుతోంది. త‌న‌కు రాజ‌కీయంగా ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌నే బాధ‌తోనే ఆమె అమెరికా వెళ్లిపోయిన‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, ఆమెను రాజ్య‌స‌భ‌కు పంపించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ భావిస్తున్నార‌నే మ‌రో ప్ర‌చారం కూడా పార్టీలో సాగుతోంది.

తెలంగాణ ఉద్య‌మంలో, టీఆర్ఎస్ పార్టీ బ‌లోపేతంలో క‌ల్వ‌కుంట్ల క‌విత త‌న వంతు పాత్ర పోషించారు. తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి మ‌హిళ‌ల‌ను ఉద్య‌మం వైపు న‌డిపించారు. తెలంగాణ ఏర్ప‌డ్డాక కేసీఆర్ ఆమెకు బాగానే ప్రాధాన్య‌త క‌ల్పించారు. నిజామాబాద్ ఎంపీగా గెలిపించారు. ఈ స‌మ‌యంలో ఢిల్లీలో ఆమె పార్టీ త‌ర‌పున కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. కానీ, 2019 ఎన్నిక‌ల్లో ఆమె ఓట‌మిపాల‌య్యారు. ఓట‌మిని ఆమె జీర్ణించుకోలేక‌పోతున్నారు.

దీంతో అప్ప‌టి నుంచి ఆమె రాజ‌కీయంగా యాక్టీవ్ ఉండ‌టం లేదు. అటు నియోజ‌క‌వ‌ర్గంలో, ఇటు పార్టీలోనూ ఆమె క్రియాశీల‌కంగా లేరు. దీంతో ఆమెను మంత్రివ‌ర్గంలోకి తీసుకోబోతున్నార‌నే ప్ర‌చారం జ‌రిగినా తీసుకోలేదు.

దీంతో ఆమె ప్ర‌స్తుతానికి రాజ‌కీయంగా ఎటువంటి ప‌ద‌వి లేకుండా ఖాళీగానే ఉన్నారు. దీంతో ఏప్రిల్‌లో రెండు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ అవుతున్న నేప‌థ్యంలో ఆమెను రాజ్య‌స‌భ‌కు పంపించ‌డం ఖాయ‌మైంద‌ని పార్టీలో జోరుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి.

అయినా కూడా ఆమె మున్సిప‌ల్ ఎన్నిక‌ల ముందు అమెరికా వెళ్ల‌డానికి కార‌ణ‌మేంట‌ని ర‌క‌ర‌కాల ఊహాగానాలు వ‌స్తున్నాయి. త‌న‌కు ఏదైనా ప‌ద‌వి ఇస్తాన‌ని త‌న తండ్రి వ‌ద్ద నుంచి క‌చ్చితమైన హామీ రానందునే ఆమె అలిగి అమెరికా వెళ్లిపోయార‌ని కొంద‌రు అంటున్నారు. కానీ, ఇప్ప‌టికే ఆమెకు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఖాయ‌మైనందున అలిగి వెళ్లే అవ‌కాశ‌మే లేద‌ని మ‌రికొంద‌రు కొట్టి పారేస్తున్నారు.

కాగా, మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలోనే క‌విత అమెరికా వెళ్లార‌ని, అది కూడా కేసీఆర్ కావాల‌నే పంపించార‌నే మ‌రో ప్ర‌చారం జ‌రుగుతోంది. టీఆర్ఎస్ పార్టీలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల టిక్కెట్ల వ్య‌వ‌హారం పెద్ద చిక్కుముడిలా మారింది.

ఆశావ‌హుల నుంచి టిక్కెట్ల కోసం పెద్ద ఎత్తున పోటీ ఉంది. రాష్ట్ర‌మంత‌టా ఇదే ప‌రిస్థితి ఉంది. దీంతో స‌హ‌జంగానే ఉద్య‌మ స‌మ‌యం నుంచి ఉన్న ప‌రిచ‌యాల నేప‌థ్యంలో తెలంగాణ జాగృతిలో యాక్టీవ్‌గా ఉండే వారు కానీ, టీఆర్ఎస్‌లోని నాయ‌కులు కానీ క‌విత వ‌ద్ద‌కు టిక్కెట్ల కోసం క్యూ క‌ట్టే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టికే టిక్కెట్ల కేటాయింపు స‌మ‌స్య‌గా మార‌గా ఇక సిఫార్సులు కూడా మొద‌లైతే ఇది మ‌రింత జ‌ఠిలంగా మార‌నుంది. అందుకే కవిత‌ను కొన్ని రోజుల పాటు కుటుంబ‌స‌భ్యులే అమెరికాకు పంపించార‌ని తెలుస్తోంది. అయితే, నిజామాబాద్ పార్ల‌మెంటు ప‌రిధిలోనైనా ఆమె పార్టీ గెలుపు కోసం ప‌ని చేయాల్సి ఉంది. మ‌రి, టిక్కెట్ల కేటాయింపు త‌ర్వాత ఎన్నిక‌ల ప్ర‌చారానికి అయినా ఆమె తిరిగి వ‌స్తారా చూడాలి.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   6 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   7 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   8 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   9 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   9 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   10 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   11 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   12 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   12 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   13 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle