newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క‌లెక్ట‌ర్ బ‌దిలీ వెనుక పవర్ పాలిటిక్స్

25-12-201925-12-2019 08:18:19 IST
2019-12-25T02:48:19.186Z25-12-2019 2019-12-25T02:46:20.501Z - - 10-04-2021

క‌లెక్ట‌ర్ బ‌దిలీ వెనుక పవర్ పాలిటిక్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ‌కీయ శ‌క్తుల ఆధిప‌త్యానికి అడ్డుప‌డితే, వారికి అనుకూలంగా, చెప్పిన‌ట్లు ప‌నిచేయ‌క‌పోతే ఏ ప్ర‌భుత్వ అధికారికి అయినా ఇబ్బందులు త‌ప్ప‌వా ? క్ష‌ణాల్లో బ‌దిలీ కావాల్సి వ‌స్తుందా ? నిజాయితీగా ప‌ని చేస్తే వేటు త‌ప్ప‌దా ? అంటే ములుగు క‌లెక్ట‌ర్ ఆక‌స్మిక బ‌దిలీ వ్య‌వ‌హారం అవున‌నే స‌మాదాన‌మే ఇస్తోంది.

ములుగు జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఉన్న సి.నారాయ‌ణ‌రెడ్డిని ఆక‌స్మికంగా బ‌దిలీ చేయ‌డం చ‌ర్చనీయాంశ‌మైంది. రాజ‌కీయ శ‌క్తులు చెప్పిన‌ట్లు విన‌క‌పోవ‌డ‌మే ఈ బ‌దిలీకి కార‌ణ‌మ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

న‌ల్గొండ జిల్లాకు జాయింట్ క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేసి నిజాయితీప‌రుడిగా పేరు తెచ్చుకున్నారు సి.నారాయ‌ణ‌రెడ్డి. ములుగు జిల్లాగా ఏర్ప‌డిన త‌ర్వాత ఈ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రీలోనే ఆయ‌న‌ను క‌లెక్ట‌ర్‌గా నియ‌మించింది ప్ర‌భుత్వం. వెనుక‌బ‌డిన‌, గిరిజ‌న ప్రాంత జిల్లా అయినా ములుగుకు క‌లెక్ట‌ర్‌గా వెళ్లిన నారాయ‌ణ‌రెడ్డి త‌న మార్క్ చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌జ‌ల‌కు మౌళిక స‌ధుపాయాల‌ను మెరుగు ప‌రిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే పేరు తెచ్చుకున్నారు.

ఇక‌, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్ర‌ధాన జాత‌ర‌ల్లో ఒక‌టి మేడారం స‌మ్మ‌క్క - సార‌ల‌మ్మ జాతర‌. ఈ జాత‌ర ఫిబ్ర‌వ‌రి 5 నుంచి 8 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. రెండేళ్ల‌కు ఒక‌సారి జ‌రిగే ఈ జాతర‌కు తెలంగాణ‌తో పాటు చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల నుంచి ల‌క్షలాధి మంది భ‌క్తులు త‌ర‌లివ‌స్తారు. భ‌క్తుల‌కు స‌ధుపాయాలు క‌ల్పించేందుకు ప్రభుత్వం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తుంటుంది. ప్ర‌తీ జాత‌ర‌కు ప్ర‌త్యేకంగా నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులతో రోడ్లు, మ‌రుగుదొడ్ల నిర్మాణం, మంచినీటి సౌక‌ర్యం క‌ల్పించ‌డం వంటి ప‌నులు చేస్తుంటారు.

ఈ వ్య‌వ‌హార‌మంతా ఒక పెద్ద ప్ర‌వ‌స‌నంగా ఉంటుంది. ఈ ప‌నుల‌న్నీ స్థానిక రాజ‌కీయ నేత‌లే నామినేష‌న్ ప‌ద్ధ‌తుల్లో ద‌క్కించుకుంటారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేత‌ల‌కే ప‌నులు ద‌క్కుతుంటాయి.

ఈ ప‌నుల్లో ఏ మాత్రం నాణ్య‌త ఉండ‌దు. అందుకే ప్ర‌తీ రెండేళ్ల‌కు గ‌తంలో జ‌రిపిన అభివృద్ది పనులు ఏ మాత్రం ఉప‌యోగ‌ప‌డ‌కుండా ఉంటాయి. దీంతో మ‌ళ్లీ నిధులు కేటాయించి చేసిన ప‌నులే చేయాల్సి వ‌స్తోంది. ఏళ్లుగా ఇదే తంతు ఉంటుంది.

అయితే, ఈసారి నారాయ‌ణ‌రెడ్డి మాత్రం ఈ వ్య‌వ‌హారంపై సీరియ‌స్‌గా ఉన్నారు. నామినేష‌న్ ప‌ద్ధ‌తిలో ప‌నుల కేటాయింపుకు స‌సేమిరా అన్నారు. కొంద‌రు రాజ‌కీయ నేత‌ల ఒత్తిళ్ల‌కు ఆయ‌న త‌లొగ్గ‌లేద‌ని తెలుస్తోంది. అంతేకాదు, ప‌నుల్లో నాణ్య‌త‌ను ప‌రిశీలించేందుకు ప్ర‌త్యేకంగా ఓ మానిట‌రింగ్ క‌మిటీని కూడా ఆయ‌న నియ‌మించారు. ప‌నులు పూర్తి చేసేందుకు డెడ్‌లైన్ పెట్టారు. నిర్ల‌క్ష్యం వ‌హించే కాంట్రాక్ట‌ర్ల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

క‌లెక్ట‌ర్ వైఖ‌రి స్థానిక రాజ‌కీయ నేత‌ల‌కు మింగుడు ప‌డ‌లేద‌ని తెలుస్తోంది. దీంతో వారంతా క‌లిసి ఓ మంత్రిని ఆశ్ర‌యించార‌ని తెలుస్తోంది. ఇంత‌లో క‌లెక్ట‌ర్ నారాయ‌ణ‌రెడ్డిని ఆక‌స్మికంగా బ‌దిలీ చేసి ఇంఛార్జి క‌లెక్ట‌ర్‌గా భూపాల‌ప‌ల్లి క‌లెక్ట‌ర్ వాసం వెంక‌టేశ్వ‌ర్లును నియ‌మించింది ప్ర‌భుత్వం.

ఈ బ‌దిలీ వెనుక నారాయ‌ణ‌రెడ్డి నిక్క‌చ్చి వైఖ‌రితో త‌మ ప‌ప్పులు ఉడ‌క‌లేద‌ని భావించిన రాజ‌కీయ శ‌క్తులు ఉన్నాయ‌నే ప్ర‌చారం జిల్లాలో పెద్ద ఎత్తున న‌డుస్తోంది. వాస్త‌వానికి, ప్ర‌తిష్టాత్మ‌క‌ జాత‌ర‌కు నెల రోజుల ముందు క‌లెక్ట‌ర్‌ను బ‌దిలీ చేయ‌డం సాధార‌ణంగా జ‌ర‌గ‌దు. కానీ, నారాయ‌ణ‌రెడ్డిని ఆక‌స్మికంగా బ‌దిలీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. అదీ ఆయ‌న బాధ్య‌త‌లు తీసుకొని ఏడాది కాక‌ముందే బ‌దిలీ చేయ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది.

ఇప్పుడే కాదు గ‌త జాతర ముందు కూడా నిజాయితీ అధికారిగా పేరున్న ఆకునూరి ముర‌ళి అనూహ్యంగా బ‌దిలీ అయ్యారు.ఈ రెండు ఉదాహ‌ర‌ణ‌లు చూస్తుంటే రాజ‌కీయ శ‌క్తులు త‌లుచుకుంటే ఏమైనా చేయ‌గ‌ల‌వ‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   5 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   an hour ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   8 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle