newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

క‌లెక్ట‌ర్ల‌పై అంత కోపం ఎందుకొచ్చింది..?

13-02-202013-02-2020 07:38:13 IST
2020-02-13T02:08:13.551Z13-02-2020 2020-02-13T02:07:33.676Z - - 25-02-2020

క‌లెక్ట‌ర్ల‌పై అంత కోపం ఎందుకొచ్చింది..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఐఏఎస్ అధికారుల‌పై అసంతృప్తిగా ఉన్నారా ? క‌లెక్ట‌ర్ల ప‌నితీరుపై ఆయ‌న ఆగ్ర‌హంగా ఉన్నారా ? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. మంగ‌ళ‌వారం జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌లెక్ట‌ర్ల‌పై త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కారు. క‌లెక్ట‌ర్లు స్వంత అజెండాను వీడి  ప్ర‌భుత్వ విధానాల‌ను అమ‌లు చేయ‌డంపై దృష్టి పెట్టాల‌ని సున్నితంగా హెచ్చ‌రించారు. ఎప్పుడూ లేని విధంగా కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ఇటీవ‌ల రాష్ట్రంలో 50 మంది ఐఏఎస్ అధికారుల‌ను ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. మొత్తం 33 జిల్లాల్లో 21 జిల్లాల‌కు క‌లెక్ట‌ర్ల‌ను మార్చారు. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారం చేప‌ట్టాక ఇంత భారీ ఎత్తున బదిలీలు చేయ‌డం ఇదే మొద‌టిసారి.

అయితే, అన్ని ఎన్నిక‌లు అయిపోయినందున ప్ర‌క్షాళన చేయాల‌నే ఉద్దేశ్యంతో పెద్ద ఎత్తున బ‌దిలీలు జ‌రిపార‌ని అంతా భావించారు. కానీ, ఈ బ‌దిలీల వెనుక క‌లెక్ట‌ర్ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసంతృప్తి కూడా ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తాజా వ్యాఖ్య‌ల‌తో తెలుస్తోంది.

గ‌తంలో 10 జిల్లాల తెలంగాణ‌గా ఉన్న స‌మ‌యంలో క‌లెక్ట‌ర్ల ప‌రిధి పెద్దది కావ‌డంతో వారు తీరిక లేకుండా గ‌డిపేవారు. ప‌నిభారం ఎక్కువ‌గా ఉండేది. క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లు కూడా ఎక్కువ‌గా చేయ‌లేక‌పోయే వారు. ఇక‌, స్వంతంగా కార్య‌క్ర‌మాల‌ను రూపొందించి, అమ‌లు చేయ‌డం అరుదు.

ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు చూసుకోవ‌డం, ప‌థ‌కాల అమలు, జిల్లా పాల‌నా వ్య‌వ‌హారాలు చూసుకోవ‌డ‌మే వారికి స‌రిపోయేది. ఇప్పుడు జిల్లాల విభ‌జ‌న త‌ర్వాత ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. 10 జిల్లాల‌కు 33 జిల్లాలు ఏర్పాడ్డాయి.

క‌లెక్ట‌ర్ల ప‌రిధిలో చాలా త‌గ్గిపోయింది. కొన్ని జిల్లాల్లో కేవ‌లం ఒక్క రెవెన్యూ డివిజ‌న్ మాత్ర‌మే ఉన్నాయి. అంటే జిల్లాలు ఎంత చిన్న‌వో అర్థం చేసుకోవ‌చ్చు. ప‌రిపాల‌న‌ను మ‌రింత స‌మ‌ర్థంగా అందించేందుకు, పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాల‌నే ఉద్దేశ్యంతో ప్ర‌భుత్వం కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేసింది.

అయితే, ప‌రిధి త‌క్కువ కావ‌డంతో క‌లెక్ట‌ర్లకు ప‌నిభారం కూడా చాలా వ‌ర‌కు త‌గ్గింది. దీంతో త‌మ జిల్లాల్లో కొత్త కొత్త కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నారు. వైవిద్య కార్య‌క్ర‌మాల‌ను రూపొందిస్తున్నారు.

ఇవి క‌లెక్ట‌ర్లు వ్య‌క్తిగ‌తంగా రూపొందించి అమ‌లు చేస్తున్నారు. వీటి ప‌ట్ల కొంత‌కాలం పాటు తెలంగాణ ప్ర‌భుత్వం చూసీచూడ‌న‌ట్లే వ‌దిలేసింది. కొంద‌రిని ప్రోత్స‌హించింది కూడా. అయితే, ప్ర‌భుత్వం అప్ప‌గించిన ప‌నుల కంటే స్వంత కార్య‌క్ర‌మాల అమ‌లుపై క‌లెక్ట‌ర్లు ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నార‌ని ముఖ్య‌మంత్రి భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అందుకే క‌లెక్ట‌ర్లు స్వంత అజెండాతో ప‌ని చేయ‌డం మానుకొని ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు ప‌ని చేయాని కేసీఆర్ క‌లెక్ట‌ర్లకు సున్నితంగా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ముఖ్య‌మంత్రి హెచ్చ‌రిక‌తో క‌లెక్ట‌ర్లు సైలెంట్ అయిపోయారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle