newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

క‌రోనా వ్యాప్తికి కార‌ణ‌మైన త‌బ్లీగి జ‌మాత్ సంస్థ చ‌రిత్ర ఇది..!

02-04-202002-04-2020 08:28:25 IST
Updated On 02-04-2020 12:07:20 ISTUpdated On 02-04-20202020-04-02T02:58:25.377Z02-04-2020 2020-04-02T02:58:20.250Z - 2020-04-02T06:37:20.949Z - 02-04-2020

క‌రోనా వ్యాప్తికి కార‌ణ‌మైన త‌బ్లీగి జ‌మాత్ సంస్థ చ‌రిత్ర ఇది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ముంద‌స్తు అప్ర‌మ‌త్త‌త, లాక్‌డౌన్ కార‌ణంగా భార‌త్‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌క్కువ‌గానే ఉంటోంద‌నే ఒక ఆశ‌ను వ‌మ్ము చేసింది ఢిల్లీ ఘ‌ట‌న‌. మార్చ్ 13 నుంచి 15 వ‌ర‌కు ఢిల్లీలోని నిజాముద్దిన్ ప్రాంతంలోని అలామీ మ‌ర్కాజ్ బంగ్లావాలి మ‌స్జీద్‌లో జ‌రిగిన మ‌త‌పర‌మైన కార్య‌క్ర‌మం ఇప్పుడు దేశానికే విప‌త్తులా మారింది. ఈ కార్య‌క్ర‌మానికి వెళ్లిన వారిలో చాలా మందికి క‌రోనా వైర‌స్ వ్యాపించిన విష‌యం ఆల‌స్యంగా బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో క‌ల‌క‌లం రేగింది. క‌రోనా పాజిటీవ్ కేసులు అన్ని రాష్ట్రాల్లో పెరిగిపోతున్నాయి.

మ‌న దేశంలోనే కాదు ఈ కార్య‌క్ర‌మం వ‌ల్ల మ‌రిన్ని దేశాల్లోనూ క‌రోనా విజృంభించే ప్ర‌మాదం ఉంది. త‌బ్లీగి జ‌మాత్ అనే సంస్థ నిర్వ‌హించిన‌ ఈ కార్య‌క్ర‌మంలో మ‌న దేశం నుంచి అన్ని రాష్ట్రాల‌కు చెందిన వారితో పాటు విదేశాల‌కు చెందిన వారు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భార‌త్‌లో ఇప్ప‌టికే ఈ కార్య‌క్ర‌మానికి వెళ్లిన వారిలో 100 మందికి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు తేలింది. ఇన్ని రోజులుగా క‌రోనా వ్యాప్తిని అడ్డుకోవ‌డంలో ముంద‌డుగు వేస్తున్నాయ‌ని భావించిన తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. రెండు రాష్ట్రాల నుంచి సుమారు మూడు వేల మంది ఈ ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్నార‌ని ప్ర‌భుత్వాలు గుర్తించాయి.

అయితే, ఈ ప‌రిస్థితికి కార‌ణ‌మైన త‌బ్లీగి జ‌మాత్‌కు పెద్ద చ‌రిత్ర‌నే ఉంది. త‌బ్లీగి జ‌మాత్ అంటే వివ్వాసాన్ని పంచే సంస్థ అని అర్థం. భార‌త్ కేంద్రంగా ప‌ని చేసే సున్నీ ఇస్లామిక్ మిష‌న‌రీ సంస్థ ఇది. 1927లో మ‌హ‌మ్మ‌ద్ ఇలియాస్ అల్ కంఢ్లావి అనే వ్య‌క్తి ఈ సంస్థ‌ను స్థాపించారు.

ముస్లింల‌లో సున్నీ విశ్వాసాల‌ను పెంచ‌డం, ఆచారాలు, విధానాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త బోధ‌న‌ల‌ను ప్ర‌చారం చేయ‌డం ఈ సంస్థ ల‌క్ష్యంగా చెబుతారు. అయితే, హిందూ సంస్థ‌ల నుంచి ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డం అప్ప‌టి ఇస్లామిక్ విద్యా సంస్థ‌ల‌కు సాధ్యం కాద‌నే ఉద్దేశ్యంతో ఈ సంస్థ‌ను స్థాపించిన‌ట్లు కూడా చెబుతారు.

ఈ సంస్థ స్థాపించిన నాటి నుంచి 40 ఏళ్ల వ‌ర‌కు కేవ‌లం భార‌త్‌కే ప‌రిమితం అయ్యింది. ఆ త‌ర్వాత ఆసియా దేశాల‌తో పాటు, మిడిల్ ఈస్ట్‌, ఉత్త‌ర ఆఫ్రికా దేశాల‌కు కూడా విస్త‌రించింది. ఆ దేశాల్లోనూ ఈ సంస్థ‌కు పెద్ద ఎత్తున స‌భ్యులు ఉన్నారు. పాకిస్తాన్‌కు చెందిన సింగ‌ర్ జునైద్ జంషెడ్‌, క్రికెట‌ర్లు షాహిద్ ఆఫ్రిది, స‌యీద్ అన్వ‌ర్‌, ఇంజ‌మాముల్ హ‌ల్‌, ముస్తాక్ అహ్మ‌ద్‌, స‌క్లైన్ ముష్తాఖ్‌, యూస‌ఫ్ యూహానా, పాక్ ఐఎస్ఐ మాజీ చీఫ్ జావెద్ న‌సీర్ వంటి వారు కూడా ఈ సంస్థ‌లో స‌భ్యులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే, త‌బ్లీగి జ‌మాత్‌పై ముస్లిం సంస్థ‌ల‌లోనే ప‌లు బేదాభిప్రాయాలు ఉన్నాయి. సౌదీ ఆరేబియాకు చెందిన సున్నీ వ‌హ‌బ్బీ ఉలేమా అనే సంస్థ త‌బ్లీగిల‌కు వ్య‌తిరేకంగా ఫ‌త్వా జారీ చేసింది. త‌బ్లీగి కార్య‌క‌లాపాల్లో పాల్గొన‌వ‌ద్ద‌ని, దేశంలో ఆ సంస్థకు చెందిన సాహిత్యాన్ని నిషేధించాల‌ని ఈ సంస్థ కోరిన‌ట్లు తెలుస్తోంది. త‌బ్లీగి జ‌మాత్‌కు తీవ్ర‌వాదంతో ఎటువంటి సంబంధాలు లేకున్నా 9/11 ఉగ్ర‌వాద దాడుల త‌ర్వాత ఈ సంస్థ‌పైన అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ, బ్రిటీష్ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది.

త‌బ్లీగి జ‌మాత్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న వారిలో కొంద‌రు ఉగ్ర కార్యక‌లాపాల్లో పాల్గొన్నార‌నే అనుమానాలు ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం. ఇప్పుడు క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా త‌బ్లీగి జ‌మాత్‌పై అనేక ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అయితే, తాము పూర్తిగా ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఈ కార్య‌క్ర‌మం జ‌రిపామ‌ని ఈ సంస్థ వివ‌ర‌ణ ఇస్తోంది. అయితే, అటు ఢిల్లీ ప్ర‌భుత్వం, ఇటు కేంద్రం ఈ వ్య‌వ‌హారంపై సీరియ‌స్‌గా ఉంది. ఇప్ప‌టికే విచార‌ణ కూడా ప్రారంభ‌మైంది.

 

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   2 hours ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   2 hours ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   2 hours ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   2 hours ago


లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

   3 hours ago


కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

   3 hours ago


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

   3 hours ago


హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

   5 hours ago


తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

   5 hours ago


ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   18 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle