newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డుతోన్న తెలంగాణ‌

30-04-202030-04-2020 07:53:49 IST
Updated On 30-04-2020 08:42:23 ISTUpdated On 30-04-20202020-04-30T02:23:49.871Z30-04-2020 2020-04-30T02:22:31.095Z - 2020-04-30T03:12:23.860Z - 30-04-2020

క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డుతోన్న తెలంగాణ‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే క‌రోనా పాజిటీవ్ కేసులు ఉండ‌వ‌ని ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు నిజ‌మ‌య్యేలా కనిపిస్తున్నాయి. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే త్వ‌ర‌లోనే క‌రోనా ఫ్రీ తెలంగాణ సాధ్య‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. త‌గ్గిపోతున్న కొత్త పాజిటీవ్ కేసులు, పెరుగుతున్న డిశ్చార్జ్ అవుతున్న క‌రోనా బాధితుల సంఖ్య‌, క‌రోనా ఫ్రీ జిల్లాల సంఖ్య త‌గ్గుతుండ‌టం, అన్ని వ‌య‌స్సుల వారూ క‌రోనాను జ‌యిస్తుండ‌టంతో తెలంగాణ‌లో క‌రోనా ప్ర‌భావ‌తం త్వ‌ర‌లోనే త‌గ్గిపోయే అవ‌కాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

క‌రోనా వైర‌స్‌ను మొద‌ట తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొంత తేలిగ్గా తీసుకున్న‌ట్లు క‌నిపించింది. అయితే, రాష్ట్రంలో క‌రోనా పాజిటీవ్ కేసులు న‌మోదు కావ‌డం ప్రారంభ‌మ‌య్యాక ఆయ‌న పూర్తిగా అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. అధికార యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేశారు. వ‌రుస స‌మీక్ష‌లు నిర్వ‌హించారు.

క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్నారు. కేంద్రం నిర్ణ‌యాల కంటే ముందే కేసీఆర్ తెలంగాణ‌లో ఆంక్ష‌లు విధించారు. జ‌న‌తా క‌ర్ఫూకు ముందే మార్చ్ 31 వ‌ర‌కు తెలంగాణ‌లో ఆంక్ష‌లు పెట్టారు. కేంద్రం కంటే ముందే తెలంగాణ‌లో లాక్‌డౌన్ విధించారు. రెండోసారి లాక్‌డౌన్‌ను మే 7 వ‌ర‌కు పొడిగించారు. లాక్‌డౌన్‌ను క‌ఠినంగా అమ‌లు చేయించారు.

క‌రోనా వైర‌స్ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం చాలా అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. వైర‌స్ వ్యాప్తి ఎక్కువ కాక‌ముందే కావాల్సిన వెంటిలేట‌ర్ల‌ను, ఐసీయూ బెడ్ల‌ను, పీపీఈ కిట్ల‌ను అందుబాటులోకి తెచ్చారు. గాంధీ ఆసుప‌త్రిలో చికిత్స‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. క‌రోనా వైర‌స్ సోకిన వారి కాంటాక్ట్‌ల‌ను గుర్తించ‌డంలో అధికార యంత్రాంగం పూర్తిగా స‌ఫ‌ల‌మైంది. దీంతో ఏప్రిల్ 7 నాటికే తెలంగాణ క‌రోనా ఫ్రీ స్టేట్‌గా మారుతుంద‌ని కేసీఆర్ ధీమాగా చెప్పారు. కానీ, ఢిల్లీ మ‌ర్క‌జ్ ద్వారా రాష్ట్రంలోనూ క‌రోనా వ్యాపించినందున ఆయ‌న ఆశించింది జ‌ర‌గ‌లేదు.

ఢిల్లీలో జ‌రిగిన ప్రార్థ‌న‌ల ద్వారా క‌రోనా వైర‌స్ సోకింద‌ని మొద‌ట గుర్తించి దేశాన్ని అప్ర‌మ‌త్తం చేసింది కూడా తెలంగాణ‌నే. ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన వారిని గుర్తించ‌డంలో, వారిని క్వారంటైన్‌కు త‌ర‌లించ‌డంలో చాలా రాష్ట్రాలు స‌మ‌స్య‌లు ఎదుర్కున్నాయి. కానీ, తెలంగాణ ప్ర‌భుత్వం సంప్ర‌దింపులు, అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా వారిని గుర్తించి, ధైర్యం నింపి క్వారంటైన్‌కు త‌ర‌లించారు. పాజిటీవ్ వ‌చ్చిన వారి కాంటాక్ట్‌ల‌ను ప‌ట్టుకొని క్వారంటైన్‌లో పెట్టారు. ఇలా మొత్తంగా రాష్ట్రంలో సుమారు 25 వేలకు పైగా ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వం క్వారంటైన్‌లో పెట్టింది.

చికిత్స కూడా తెలంగాణ‌లో బాగా జ‌రుగుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా బాధితుల్లో 7 శాతం మ‌ర‌ణాలు సంభ‌విస్తుండ‌గా దేశంలో 3.2 శాతం మ‌ర‌ణిస్తున్నారు. తెలంగాణ‌లో మాత్రం ఇది 2.5 శాతంగానే ఉంది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1,016 క‌రోనా పాజిటీవ్ కేసులు న‌మోదు కాగా, యాక్టీవ్ కేసుల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం కేవ‌లం 582 యాక్టీవ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి.

409 మంది క‌రోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కొత్త‌గా న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య కూడా క్ర‌మంగా త‌గ్గుతోంది. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో కేసులు త‌క్కువ‌గా ఉంటోంది. 2, 6, 7, ఇలా సింగిల్ డిజిట్‌లోనే కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి.

చిన్నారుల‌కు క‌రోనా వ‌ల్ల ఎక్కువ ప్రాణాపాయం ఉంటుంది. కానీ తెలంగాణ‌లో క‌రోనా సోకిన చిన్నారులు కూడా క్ర‌మంగా కోలుకుంటున్నారు. నిన్న ఒక్క రోజే 13 మంది చిన్నారులు డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో 25 రోజుల‌కే క‌రోనా బారిన ప‌డ్డ చిన్నారి కూడా ఉన్నాడు. మ‌రోవైపు క‌రోనా ఫ్రీ జిల్లాల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్ర‌స్తుతం 11 జిల్లాల్లో ఒక్క క‌రోనా పాజిటీవ్ కేసు కూడా లేదు.

ఒక్క జీహెచ్ఎంసీలోనే కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. క‌రోనా కేసులు న‌మోదైన మిగ‌తా జిల్లాలు కూడా ఇప్పుడు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. దీంతో మే 8 నాటికి తెలంగాణ‌లో క‌రోనా ఉండ‌ద‌ని ప్ర‌భుత్వం ధీమాగా ఉంది. అనుకోనిది ఏదైనా జ‌రిగితే త‌ప్ప తెలంగాణ త్వ‌రాలోనే క‌రోనా ఫ్రీ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే, టెస్టులు త‌క్కువ చేస్తున్నార‌నే ఓ ఆరోప‌ణ ప్ర‌భుత్వంపై ఉంది. కానీ, ప్ర‌భుత్వం మాత్రం కేంద్రం, ఐసీఎంఆర్ నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే టెస్టులు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేస్తోంది.

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   30 minutes ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   11 minutes ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   5 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   6 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   2 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   8 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   9 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   an hour ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   3 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   9 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle