newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

క‌రోనా దెబ్బ తెలంగాణ రాజ‌కీయాల‌ను కుదిపేస్తోందా?

02-04-202002-04-2020 08:35:23 IST
Updated On 02-04-2020 12:06:10 ISTUpdated On 02-04-20202020-04-02T03:05:23.149Z02-04-2020 2020-04-02T03:05:09.286Z - 2020-04-02T06:36:10.856Z - 02-04-2020

క‌రోనా దెబ్బ తెలంగాణ రాజ‌కీయాల‌ను కుదిపేస్తోందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్‌ అన్ని రంగాలు, ప్ర‌జ‌ల‌తో పాటు రాజ‌కీయాల‌పైనా ప‌డింది. తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గా సాగుతుంటాయి. రెండు రాష్ట్రాల్లో ప‌ట్టు ద‌క్కించుకునేందుకు విప‌క్షాలు, బ‌లం కాపాడుకునేందుకు అధికార పక్షాల న‌డుమ నిత్యం యుద్ధం న‌డుస్తోంది. దారిదాపుల్లో ఎన్నిక‌లు లేక‌పోయినా రాజ‌కీయాలు మాత్రం వేడిగానే ఉంటాయి. ప్ర‌త్యేకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు ప్ర‌జ‌లు ఈస‌డించుకునే స్థాయిలో ఉంటాయి.

ఇప్పుడు క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కార‌ణంగా రెండు రాష్ట్రాల్లోనూ రాజ‌కీయాలు చ‌ల్ల‌బ‌డ్డాయి. ఎప్పుడూ ప్రెస్ మీట్లు, మాట‌ల యుద్ధాల్లో క‌నిపించే నేత‌లు ఇప్పుడు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావానికి ముందు స్థానిక సంస్థల ఎన్నిక‌ల వేడి ఉండేది. ఒకేసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయితీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపింది. దీంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు నేత‌లంతా బీజీగా మారిపోయారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ స్థానిక ఎన్నిక‌ల‌ను వాయిదా వేశారు.

కొంత‌కాలం ఈ నిర్ణ‌యంపై ర‌గ‌డ న‌డిచినా త‌ర్వాత క్ర‌మంగా ప‌రిస్థితి మారిపోయింది. లాక్‌డౌన్ కార‌ణంగా నేత‌లంతా ఇళ్ల‌కే ప‌రిమితం అవుతున్నారు. అధికార ప‌క్షం మొత్తం క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నివారించే ప‌నిలో బిజీగా మారిపోయారు. ముఖ్య‌మంత్రి, మంత్రులు వ‌రుస స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. మ‌రోవైపు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు హైద‌రాబాద్‌లో ఉండిపోయారు. అడ‌పాద‌డ‌పా ప్ర‌తిప‌క్ష నేత‌లు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నా నేత‌ల‌తో పాటు ప్ర‌జ‌లు కూడా ఈ స‌మ‌యంలో ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో లేరు.

ఇక‌, రాష్ట్రంలో కొత్త‌గా కుదిరిన జ‌న‌సేన - బీజేపీ పొత్తును క్షేత్ర‌స్థాయిలోకి తీసుకుపోవాల‌ని రెండు పార్టీలు భావించాయి. కానీ, ఈ ప్ర‌య‌త్నాలకు కూడా క‌రోనా బ్రేకులు వేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీకి కొత్త అధ్య‌క్షుడి ఎంపిక ప్ర‌క్రియ కూడా చివ‌ర‌కు వ‌చ్చి ఆగిపోయింది. ఇక, తెలంగాణ‌లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌ని భావిస్తున్న బీజేపీ కొత్త అధ్య‌క్షుడిగా క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్‌ను నియ‌మించింది. ఆయ‌న రాక‌తో రాష్ట్రంలో బీజేపీకి కొత్త ఉత్సాహం వ‌స్తుంద‌ని, వ‌రుస కార్య‌క్ర‌మాల‌తో పార్టీని ప‌రుగులు పెట్టిస్తార‌ని పార్టీ నేత‌లు అంచ‌నా వేశారు.

కానీ, క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా ఇవేవీ జ‌ర‌గ‌లేదు. అధ్య‌క్షుడిగా నియ‌మితులై మొద‌టిసారి హైద‌రాబాద్‌కు వ‌చ్చే బండి సంజ‌య్‌కు పెద్ద ఎత్తున స్వాగ‌తం ప‌ల‌కాల‌ని బీజేపీ శ్రేణులు భావించాయి. కానీ, క‌రోనా కార‌ణంగా ఈ కార్య‌క్ర‌మం కూడా ర‌ద్దైంది. మ‌రో వైపు తెలంగాణ పీసీసీకి కూడా కొత్త అధ్య‌క్షుడిని నియ‌మించాల‌ని అధిష్ఠానం ఆలోచిస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని క‌లిసిన భువ‌న‌గిరి ఎంపీ కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి వారంలో కొత్త అధ్య‌క్షుడి నియామ‌కం ఉంటుంద‌ని చెప్పారు. కానీ, కొత్త అధ్య‌క్షుడి నియామ‌క ప్ర‌క్రియ ఆగిపోయింది. మొత్తంగా రాజ‌కీయాలు ఎక్క‌డివి అక్క‌డే ఆగిపోయింది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle