కయ్యానికి సై.. ఇక తాడో పేడో తేల్చేస్తారట..!
23-08-202023-08-2020 08:26:06 IST
2020-08-23T02:56:06.267Z23-08-2020 2020-08-23T02:55:58.268Z - - 12-04-2021

తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి స్వంత పార్టీ కాంగ్రెస్‌లోనే చాలా మంది వ్యతిరేకులు ఉన్నారు. రేవంత్ రెడ్డి వైఖరిపై వి.హనుమంతరావు, జగ్గారెడ్డి నేతలు బాహాటంగానే అసంతృప్తిని వెల్లగక్కుతుంటారు. ఇంకా చాలా మంది నేతలు లోలోన రేవంత్ రెడ్డి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం ఇంత కాలం వారి పట్ల కొంత సంయమనం పాటిస్తూ వస్తున్నారు. ఇక మీదట మాత్రం ఊరుకునేది లేదని ఆయన ఒక నిర్ణయానికి వచ్చేశారట. తన వ్యతిరేకుల పట్ల తాను కూడా కఠినంగానే ఉండాలని ఆయన భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో, రాజకీయాల్లో రేవంత్ రెడ్డి జూనియర్. కానీ, వాక్చాతుర్యం, దూకుడు స్వభావంతో ఆయన వేగంగా ఎదుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కంటే చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. వీరిలో చాలా మంది విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నారు. వీరి ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌లో మంచి ప్రాధాన్యత కోసం ఎదురుచూస్తున్నారు. పలువురు పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ, టీడీపీ నుంచి మూడేళ్ల క్రితమే కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి తమ కంటే ముందే పార్టీలో ఎదుగుతున్నారు. ఇప్పుడు ఏకంగా పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఇది కొందరు ముందునుంచీ కాంగ్రెస్‌లో ఉన్న నేతలకు రుచించడం లేదు. తాము ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పని చేస్తుంటే రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చి తమకంటే ముందుకు వెళ్లడం వారికి నచ్చడం లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్వంత అజెండాతో ముందుకుపోతారని, తన స్వంత గుర్తింపు కోసమే ఎక్కువగా ప్రయత్నిస్తారనేది వారి కంప్లైంట్. ఇక, సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి వర్గీయుల వైఖరి కూడా కాంగ్రెస్ సీనియర్లలో ఆగ్రహానికి కారణం అవుతుంది. రేవంత్ రెడ్డికి మద్దతుగా, సీనియర్ కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రేవంత్ అనుచరులు పోస్టులు పెడుతుంటారు. ఇవి ఆ నేతల దృష్టికి వస్తుంటాయి. ఇది వారికి రేవంత్ పట్ల మరింత అసంతృప్తికి కారణమవుతుంది. ఆ మధ్య సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇదే విషయంలో రేవంత్ రెడ్డి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా అనేకసార్లు రేవంత్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే, రేవంత్ రెడ్డి మాత్రం వారి పట్ల ఆచితూచి వ్యవహరించారు. అవతలి వారు విమర్శలు చేసినా తాను మాత్రం బయటకు సంయమనంతో మాట్లాడేవారు. తామంతా ఒక్కటే అని చెబుతూ, మీడియా ముందు వారిని అన్నా అంటూ సంబోధించేవారు. కానీ, ఇప్పుడు మాత్రం ఇటువంటి వారి పట్ల తాను కూడా సీరియస్‌గానే ఉండాలని, గట్టిగానే బదులివ్వాలని రేవంత్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇటీవల రేవంత్‌కు వ్యతిరేకంగా, ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి దక్కకుండా కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు జట్టు కట్టారని ప్రచారం జరుగుతోంది. కీసర తహశీల్దార్ అవినీతి వ్యవహారంలో బ్రోకర్ వద్ద రేవంత్ రెడ్డి లెటర్హెడ్లు దొరకడాన్ని ఆ నేతలు ఉపయోగించుకోవాలని భావించారట. ఈ విషయం పట్ల రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేని విధంగా వారిని తిట్టిపోశారు. తాను చూస్తూ ఊరుకుంటుంటే ఆ నేతలు తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని, ఇక నుంచి సహించవద్దని, కయ్యానికి సై అని రేవంత్ ఒక నిర్ణయానికి వచ్చారు. మరి, రేవంత్‌కు ఆయన వ్యతిరేకులు ఎలాంటి కౌంటర్లు ఇస్తారో చూడాలి.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
10 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
13 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
16 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
6 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
16 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
14 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
16 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
17 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
11 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
20 hours ago
ఇంకా