newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క్వారంటైన్ , ఐసోలేషన్.. కరోనా ముట్టడికి సొల్యూషన్

21-03-202021-03-2020 09:20:16 IST
2020-03-21T03:50:16.544Z21-03-2020 2020-03-21T03:49:58.221Z - - 16-04-2021

క్వారంటైన్ , ఐసోలేషన్.. కరోనా ముట్టడికి సొల్యూషన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న మాటలు ఐసోలేషన్, క్వారంటైన్ . ఏ ఛానెల్ చూసినా, ఏ పేపర్ వెతికినా ఇవే మాటలు. తరచూ వినిపిస్తున్న పదాలు. తెలంగాణలో కరోనా పాజిటివ్‌ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నారు. శుక్రవారం ఒక్క రోజే తెలంగాణలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

దీంతో తెలంగాణలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 19కి చేరినట్లయిందికరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఇవి తప్పనిసరి పాటించాలని అందరూ చెబుతున్నారు. గతంలో మనం ఏదైనా అత్యవసరం అయితే ఎక్కువగా ఐసీయూ, ఐసీసీయూ వాడేవాళ్ళం. ఇప్పుడు కరోనా దెబ్బకు ఐసోలేషన్ అనే పదం బాగా వ్యాప్తిలోనికి వచ్చింది. అసలు  వీటి అర్థం ఏంటి. మనం ఎందుకు పాటించాలి. కరోనానుంచి విముక్తి పొందడానికి మనం చేయాల్సిన ఇతర పనులు ఏమిటి? 

మన దేశంలో కూడా క్రమంగా కరోనా విజృంభిస్తోంది. డాక్టర్లు చెబుతున్న పరిష్కారాలు రెండే రెండు.. క్వారంటైన్‌, ఐసొలేషన్‌.. క్వారంటైన్‌ అంటే దూరంగా ఉండటం.. ఐసొలేషన్‌ అంటే ఒంటరిగా ఉంచడం. వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే వీటిని పాటించాల్సిందేనని అన్ని దేశాలూ చెబుతున్నాయి. ఇంతకీ క్వారంటైన్‌, ఐసొలేషన్‌ అంటే ఏమిటి? ఈ రెండూ ఒకటేనా? వేరువేరా? వైరస్‌  వ్యాపించిన ప్రాంతాన్ని సందర్శించిన వ్యక్తి ద్వారా అది మరింతమందికి సోకే ప్రమాదం ఉంది. 

అలాగే ఒక వ్యాధిగ్రస్తుడికి దగ్గరగా మసలుకున్న వ్యక్తులు ఆ వైరస్‌కు ప్రభావితమై ఉంటారు. అందువల్ల అలాంటి వారిని బలవంతంగా దిగ్బంధంలో ఉంచడం,  లేదా స్వీయ దిగ్బంధం విధించుకోవడమే క్వారంటైన్‌.  కరోనా సోకిన వారు, లేదా దాని వల్ల ప్రభావితులైన వారు సమాజంలో తిరగకుండా వారి కదలికల్ని నియంత్రించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఫ్లూ లక్షణాలు కనిపించినపుడు కనీసం 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యాధికారులు సూచిస్తారు.

వైరస్‌ నిర్ధారణ అయిన వారిని, అలాగే ఆ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న వారిని ఒక గదిలో వేరుగా ఉంచడమే ఐసొలేషన్‌. వైరస్‌ సోకిన వ్యక్తి దాన్నుంచి కోలుకునేదాకా వారి నుంచి ఇతరులకు వ్యాధిని వ్యాపింపజేయకుండా నివారించడమే ఐసొలేషన్‌ ముఖ్యోద్దేశం. ఈరెండూ విధిగా పాటించడం, అనుసరించడం ఇప్పుడు అత్యంత అవసరం. అప్పుడే కరోనా మహమ్మరిని మనమంతా సమర్థంగా నియంత్రించగలుగుతాం. సామాజిక దూరం అనేది కూడా కరోనాపై పోరాటానికి ఉపయోగపడే మార్గం. కరోనా ఒకరి నుంచి మరొెకరికి వ్యాపించకుండా కాపాడుకోవాలి. 

క్వారంటైన్లో ఎమ్మెల్యే కోనప్ప

Image result for konappa mla

అమెరికాలో ఇటీవల పర్యటించి వచ్చిన సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులను క్వారం టైన్‌లో ఉంచాలని ఉన్నతాధికారులు జిల్లా వైద్యా దికారిని ఆదేశించారు. అక్కడికి వెళ్లి వచ్చిన ఆయన క్వారంటైన్‌లో ఉండటం మంచిదని సూచించారు. ఆయన్ను క్వారంటైన్‌లో ఉంచాల్సిందిగా ఉన్నతాధికారులు స్థానిక డీఎంహెచ్‌వోను ఆదేశించారు.

ఎమ్యెల్యే కోనప్ప కదలికలపై విపక్షాలు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి. ఆసిఫాబాద్‌ డీఎంహెచ్‌వో ఎమ్మెల్యే కోనప్పకు ప్రభుత్వం తరపున లేఖ కూడా పంపారు. 14 రోజులపాటు ఇంట్లోనే ఉండాలని, ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనద్దని, ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు. లేఖ ప్రతుల్ని జిల్లా ఎస్పీకి కూడా పంపి, అవసరమైన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. ఇటు కరీంనగర్లో కరోనా ఆందోళన కలిగిస్తోంది. 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle