newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

కోవిడ్ 19 వ్యాక్సిన్ తయారీకి భారతీయ కంపెనీల పోటీ?

21-04-202021-04-2020 17:35:25 IST
Updated On 22-04-2020 14:13:26 ISTUpdated On 22-04-20202020-04-21T12:05:25.354Z21-04-2020 2020-04-21T12:04:52.679Z - 2020-04-22T08:43:26.208Z - 22-04-2020

కోవిడ్ 19 వ్యాక్సిన్ తయారీకి భారతీయ కంపెనీల పోటీ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు అన్ని దేశాలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్‌-19 నివారణ కోసం అన్ని దేశాల కంటే ముందు వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు ఆరు భారతీయ కంపెనీలు జైడస్‌ క్యాడిలా, భారత్‌ బయోటెక్‌, ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌ లిమిటెడ్‌, బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, మిన్వాక్స్‌ పోటీపడుతున్నట్టు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ ఆరు కంపెనీలలో మూడు కంపెనీలు హైదరాబాద్‌కు చెందినవే. వీటికి కేంద్రం తగిన విధంగా సాయపడుతోంది. ప్రపంచంలో వ్యాక్సిన్ల తయారీకి భారత్‌ కేంద్ర బిందువుగా ఉందని అమితాబ్ కాంత్ ట్వీట్‌చేశారు. ఈ ట్వీట్‌పై రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్‌-19కు వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు పోటీపడుతున్న ఆరు భారతీయ కంపెనీల్లో మూడు కంపెనీలు హైదరాబాద్‌కు చెందినవే కావడం తమకెంతో గర్వకారణమన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో మూడింట ఒక వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి.

https://www.photojoiner.net/image/VGnC5Euu

హైదరాబాద్ చుట్టుపక్కల ఫార్మా కంపెనీలు నాణ్యమయిన, అత్యంత విశ్వసనీయమయిన మందుల్ని తయారుచేస్తున్నాయి. ఇందులో కరోనా వైరస్ పై యుద్ధానికి అవసరమయిన డయాగ్నాస్టిక్స్, థెరపాటిక్స్, ఇతరత్రా సదుపాయాలను తయారుచేసేందుకు వచ్చిన 13 ప్రతిపాదనలకు డీబీటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది.

దీనికి కేంద్రం నిధులు అందించనుంది. ఇన్ యాక్టివేటెడ్ రేబిస్ వెక్టార్ ప్లాట్ ఫాం కింద కోవిడ్ 19 వ్యాక్సిన్ సిద్ధం చేయనుంది. డీఎన్ఏ వ్యాక్సిన్ తయారీకి కేడిలా హెల్త్ కేర్, బీసీజీ వ్యాక్సిన్ ను రసాయనిక ప్రిక్రియలో మళ్లీ కలపడానికి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు భారత ప్రభుత్వం సహాయసహకారాలు అందించనుంది. 

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   5 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   7 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   10 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   11 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   12 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   12 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   13 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   13 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   14 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle