కోవిడ్ టెస్టుల జోరు.. ప్రైవేట్ ల్యాబులకు అనుమతిచ్చిన కేంద్రం!
29-04-202029-04-2020 14:56:45 IST
Updated On 29-04-2020 15:52:24 ISTUpdated On 29-04-20202020-04-29T09:26:45.567Z29-04-2020 2020-04-29T09:26:43.466Z - 2020-04-29T10:22:24.164Z - 29-04-2020

దేశంలో కరోనాను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ అమలు ఎంతముఖ్యమో ప్రజలలో వైరస్ సోకిన వారిని గుర్తించి ఐసోలేషన్ చేయడం కూడా అంతే ముఖ్యం. వైరస్ సోకిన వారిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత సులభంగా వైరస్ ను కట్టడి చేసేందుకు వీలుకలుగుతుంది. అందుకే కేంద్రం ఇకపై దేశవ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో ల్యాబులకు కూడా కరోనా టెస్టింగ్ అనుమతులను మంజూరు చేసింది.
ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ ప్రైవేట్ ఆసుపత్రులలో టెస్టింగ్ సదుపాయంతో పాటు ఎక్కడా కరోనా వైద్యం అందించే అనుమతి కూడా ఇవ్వలేదు. పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ, ప్రభుత్వ ఆసుపత్రులు లేదా ప్రభుత్వాలు కొత్తగా కరోనా కోసం ఏర్పాటు చేసుకున్న ఆసుపత్రులలో మాత్రమే ఈ సదుపాయాలు ఉన్నాయి. కాగా తొలిసారి ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులకు టెస్టింగ్ అనుమతులు ఇచ్చింది.
దేశంలో వివిధ రాష్టాలలో మొత్తం 90 ఆసుపత్రులలో ల్యాబులకు కేంద్రం కొత్తగా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వం కేంద్రాలు, కోవిడ్ ఆసుపత్రులలో టెస్టులతో పాటు ఈ ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా ఇకపై కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగనున్నాయి. దీంతో పెద్దఎత్తున పరీక్షలు జరిగే అవకాశం ఉంటుందని కేంద్రం ఆలోచనగా తెలుస్తుంది.
దేశవ్యాప్తంగా మొత్తం 16 రాష్ట్రాలలో మాత్రమే ఈ ల్యాబ్స్ కి అనుమతులు ఇవ్వగా తెలంగాణలో 11 ల్యాబ్స్ కు అనుమతులు ఇచ్చింది. మరో తెలుగు రాష్ట్రం ఏపీలో ఎక్కడా ప్రైవేట్ ల్యాబ్స్ కు అనుమతి ఇవ్వనేలేదు. కాగా కరోనా ఉదృతిగా ఉన్న మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడులో కూడా కొన్ని ల్యాబ్స్ కు అనుమతులు ఇవ్వగా ఏపీకి మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు.
ప్రభుత్వ ల్యాబులతో పాటు ఇకపై ఈ ప్రైవేట్ ల్యాబులలో కూడా కరోనా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయనున్నారు. కాగా, కేంద్రం అనుమతులు విడుదల చేసిన జాబితాలో తెలంగాణలో 11 ల్యాబులు ఉండగా.. ఢిల్లీలో 11, గుజరాత్లో 5, హర్యానా 7, జార్ఖండ్ 1, కర్ణాటక 7, కేరళ 2, మధ్యప్రదేశ్ 2, మహారాష్ట్ర 19, ఒడిశా 1, పంజాబ్ 2, రాజస్థాన్ 2, తమిళనాడు 11, ఉత్తరప్రదేశ్ 2, ఉత్తరాఖండ్ 1, బెంగాల్ 6 ల్యాబులు ఉన్నాయి.
ఇక తెలంగాణలో అనుమతి ఇచ్చిన 11 ల్యాబులలో
- ల్యాబొరేటరీ సర్వీసెస్, అపోలో హాస్పిటల్స్, 6వ అంతస్థు, హెల్త్ స్ట్రీట్ బిల్డింగ్, జూబ్లీహిల్స్, హైదరాబాద్
- విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్, వీధి నెంబర్ 19, హిమాయత్ నగర్, హైదరాబాద్
- విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్, ప్లాట్ నంబర్ 142, ఫేజ్ 2, IDA చెర్లపల్లి, హైదరాబాద్
- అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్, డయాగ్నోస్టిక్ లాబొరేటరీ, బోయినపల్లి, సికింద్రాబాద్
- డాక్టర్. రెమెడీస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, A3, టైటస్ ప్లాజా, శర్మ కమర్షియల్ కాంప్లెక్స్, పంజాగుట్ట, హైదరాబాద్.
- పాత్‌కేర్ ల్యాబ్స్ ప్రై.లిమిటెడ్, మేడ్చల్, హైదరాబాద్
- అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సైన్సెస్ ప్రై.లిమిటెడ్, సిటిజన్స్ హాస్పిటల్, శేరిలింగంపల్లి, హైదరాబాద్
- మెడ్సిస్ పాత్‌ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నంబర్ 16 & 17, స్వాతి ప్లాజా, ఆనంద్ నగర్, న్యూ బోయినపల్లి, సికింద్రాబాద్
- డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాబ్ మెడిసిన్, యశోదా హాస్పిటల్, 9వ ఫ్లోర్, 1-1-156 & 157, అలెగ్జాండర్ రోడ్, సికింద్రాబాద్
- బయోగ్నోసిస్ టెక్నాలజీస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, మేడ్చల్, మల్కాజిగిరి
- టెనెట్ డయాగ్నోస్టిక్స్, ప్లాట్ నంబర్ 51, కైనెటా టవర్స్, జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నంబర్ 3, బంజారాహిల్స్, హైదరాబాద్ ఉన్నాయి.

ఏపీలో స్కూల్స్ బంద్
an hour ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
an hour ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
5 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
7 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
2 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
9 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
9 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
2 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
4 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
10 hours ago
ఇంకా