newssting
BITING NEWS :
*ప్రధాని నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ.. లాక్ డౌన్ పై చర్చ *మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహరంలో తుది తీర్పు .. వెంటనే విధులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం *కొండపోచమ్మ జలాశయం ప్రారంభం. సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభం.. ఇదో ఉజ్వల ఘట్టం అన్నకేసీయార్ *కరోన ఇప్పుడే పోయేది కాదు..సౌదీ అరేబియా నుండి వందలాది మంది వస్తున్నారు..కరోన అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదు..ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు..ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలి : ఈటల *ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే 50కి పైగా కేసులలో చుక్కెదురైనా పద్ధతి మార్చుకోవడం లేదు..రమేష్ ని మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం : సీఎం రమేష్ - ఎంపీ *ఏపీలో కొత్తగా 85 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి.3330 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.కరోనాతో 60 మంది మృతి * చోటా కె.నాయుడు సోదరుడు అరెస్ట్..ఎస్.ఆర్.నగర్‌లో శ్యామ్ కె. నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు..ఆర్టిస్ట్ సుధను పెళ్లిపేరుతో మోసం చేశాడని ఆరోపణ..సుధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు*భారత్ లో విజృంభిస్తున్న కరోనా. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త కరోనా కేసులు. 175 మంది మృతి. దేశవ్యాప్తంగా 1,65,799 కి చేరిన కరోనా కేసులు. 89,987 యాక్టివ్ కేసులుండగా, 71,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో మొత్తం 4,706 కరోనా మరణాలు

కోవిడ్ కేసు నమోదుతో నిద్రపట్టడం లేదు.. జాగ్రత్తలు చెప్పిన ఈటల

04-03-202004-03-2020 11:05:46 IST
Updated On 04-03-2020 11:30:54 ISTUpdated On 04-03-20202020-03-04T05:35:46.764Z04-03-2020 2020-03-04T05:35:44.912Z - 2020-03-04T06:00:54.998Z - 04-03-2020

కోవిడ్ కేసు నమోదుతో నిద్రపట్టడం లేదు.. జాగ్రత్తలు చెప్పిన ఈటల
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ప్రవేశించిన కోవిడ్ మహమ్మారి ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తుండగా వ్యాధి విస్తరణను అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కోవిడ్‌ కేసు తెలంగాణలో నమోదు కావడంతో తనకు నిద్ర కూడా పట్టడంలేదని మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. సోమవారం రాత్రి 12 గంటలకు నిద్రపోయానని, మళ్లీ ఉదయం 4 గంటలకే మెలకువ వచ్చిందన్నారు. అంతా ప్రశాంతంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. 88 మంది అనుమానితుల్లో ఎవరికీ పాజిటివ్‌ రాకూడదని దేవుడిని ప్రార్ధించానన్నారు. నిద్రాహారాలు మాని కోవిడ్‌ వైరస్‌ రాకుండా అందరూ పనిచేస్తున్నారన్నారు.

కాగా,  వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు రూ.100 కోట్లు కేటాయించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్, చెస్ట్‌ ఆస్పత్రులు, కంటోన్మెంట్‌లోని మిలిటరీ ఆస్పత్రితోపాటు వికారాబాద్‌లోని టీబీ ఆస్పత్రిలోనూ ప్రత్యేక వార్డులను సిద్ధం చేసినట్లు చెప్పారు. 

అలాగే హైదరాబాద్‌ చుట్టు పక్కల ఉన్న ప్రైవేటు మెడికల్‌ అనుబంధ ఆసుపత్రుల్లో 3 వేల పడకలను అందుబాటులో ఉంచాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. వాటిలో కొన్నింటిని సాధారణ ఐసొలేషన్‌ కోసం, కొన్నింటిని ప్రత్యేక చికిత్స కోసం ముందు జాగ్రత్తగా తీసుకున్నట్లు వివరించారు.

మంత్రి ఈటల నేతృత్వంలోని ఆరోగ్య మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం కోవిడ్‌పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ యోగితా రాణా, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు, పలు శాఖల ఉన్నతాధికారులు, ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.

వైరస్‌ వ్యాపించకుండా ఏయే శాఖలు ఏయే చర్యలు తీసుకోవాలో మంత్రులు దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రి ఈటల మీడియాతో మాట్లాడారు. కోవిడ్‌ విస్తరించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైరస్‌ సోకిన బాధితుని పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నాడని తెలిపారు. కోవిడ్‌కు ఇవ్వాల్సిన చికిత్సపై అధ్యయనం చేసేందుకు 15 మంది డాక్టర్లు, జిల్లా వైద్యాధికారుల బృందాన్ని కేరళకు పంపిస్తున్నామని చెప్పారు. 

వైరస్‌ కట్టడికి కేంద్రం మార్గదర్శకాలు పాటిస్తున్నామన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్, కార్యదర్శి ప్రీతి సుడాన్‌తో తాను ఫోన్‌లో మాట్లాడానని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కొరత ఉన్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి 50 వేలు మాస్కులు పంపించాలని అడిగామని చెప్పారు.

షేక్‌ హ్యాండ్‌ వద్దు.. నమస్కారమే ముద్దు

వైరస్‌ భయం పోయేదాకా ప్రజలు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం మానేయాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. ఆప్తులకూ నమస్కారమే చేయాలన్నారు. కోవిడ్‌ వైరస్‌ సోకిన వాళ్లు మాస్క్‌లు ధరిస్తే సరిపోతుందని, అందరూ ధరించాల్సిన అవసరం లేదని ఈటల సూచించారు. కానీ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కర్చీఫ్‌ లేదా చెయ్యి అడ్డం పెట్టుకోవాలన్నారు. శానిటైజర్లు వినియోగించాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

కోవిడ్‌ వైరస్‌ గాలి ద్వారా వ్యాపించదని, అయితే రోగి దగ్గినా, తుమ్మినా తుంపర్లు గాలిలో 12 గంటల పాటు ఉంటాయని, వాటి ద్వారా వైరస్‌ వ్యాపించే ప్రమాదముందని ఈటల తెలిపారు. హోటళ్లు, థియేటర్లు, స్కూళ్లు, కాలేజీల వంటి జన సమ్మర్థ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తున్నవారు కూడా జాగ్రత్తలు వహించాలన్నారు. జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. 

ఈ చర్యలన్నీ వైరస్‌ వ్యాపించకుండా ముందు జాగ్రత్తలో భాగమేనని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మన దగ్గర అధిక ఉష్ణోగ్రతలు, తేమ శాతం తక్కువగా ఉంటుందని, ఇలాంటి ప్రాంతాల్లో వైరస్‌ విస్తరించే అవకాశం తక్కువని మంత్రి చెప్పారు.

రోగుల ట్రావెల్‌ హిస్టరీ అడగాలని, బయటి దేశాలకు వెళ్లొచ్చిన వారితో సన్నిహితంగా మెలిగారేమో కనుక్కోవాలని ప్రైవేటు ఆసుపత్రులకు ఈటల విజ్ఞప్తి చేశారు. ట్రావెల్‌ హిస్టరీ, విదేశాలకు వెళ్లొచ్చిన వాళ్లతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు వస్తే వెంటనే వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం ఇవ్వాలన్నారు. 

ఇది చదవండి : కోవిడ్ కలవరం... అప్రమత్తమయిన తెలంగాణ సర్కార్

కొని తెచ్చుకున్న వివాదాలతో జగన్ రాజకీయ పోరాటం!

కొని తెచ్చుకున్న వివాదాలతో జగన్ రాజకీయ పోరాటం!

   18 minutes ago


తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

   14 hours ago


 కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

   14 hours ago


కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

   19 hours ago


నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి..  జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి.. జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

   19 hours ago


శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

   21 hours ago


జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

   a day ago


కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

   a day ago


కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

   a day ago


కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle