కోవిడ్ కలవరం... అప్రమత్తమయిన తెలంగాణ సర్కార్
04-03-202004-03-2020 08:46:28 IST
Updated On 04-03-2020 12:52:12 ISTUpdated On 04-03-20202020-03-04T03:16:28.544Z04-03-2020 2020-03-04T03:16:16.638Z - 2020-03-04T07:22:12.342Z - 04-03-2020

కోవిడ్ 19 ప్రపంచాన్ని కలవరపెడుతున్న వైరస్. తాజాగా తెలంగాణలో ఒక బాధితుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తెలంగాణ తొలి కోవిడ్ బాధితుడు ఇతడే కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బస్సులో వచ్చినప్పుడు ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నారు. అక్కడి నుంచి వచ్చాకే జ్వరం ప్రారంభమైందని...తన కుటుంబంలో 13 మంది సభ్యులతో అతడు కలిసే ఉన్నాడని తెలుస్తోంది. బాధితుడు బెంగళూరులోని గ్లోబల్ టెక్నాలజీ పార్క్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడని తేలింది. హైదరాబాద్‌లోని మహేంద్రహిల్స్‌లో అతడి కుటుంబం నివాసం ఉంటోంది. ఆ యువకుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. వారితోపాటు అపోలో ఆస్పత్రిలో అతడు కాంటాక్ట్ అయిన 50 మంది వైద్య సిబ్బందిని కూడా గుర్తించారు. మొత్తమ్మీద కుటుంబ సభ్యులతో కలిపి 88 మందిని అతడు కలుసుకున్నట్టు నిర్ధారణకు వచ్చారు. వారిలో 45 మందిని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు అతడితో కలిసి ఉన్నవారిలో 36 మందికి కోవిడ్ అనుమానిత లక్షణాలు కనిపించాయని అంటున్నారు. ఇదిలా వుంటే మంత్రి కేటీయార్ కోవిడ్ వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇతర వైరస్‌లతో పోలిస్తే ఈ వైరస్‌తో మరణాల రేటు అతి తక్కువగా ఉందని, కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కోవిడ్‌పై మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం భేటీ జరిగింది. మంత్రులు ఎర్రబెల్లి, ఈటల ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవిడ్‌పై ఏం చేయాలి, ఏం కావాలో చెప్పాలని అధికారులను కేటీఆర్ కోరారు. అత్యవసర ఆరోగ్య పరిస్థితి వచ్చే అవకాశం ఉండటంతో హైదరాబాద్ పరిధిలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలనూ ఐసోలేషన్ కోసం వాడుకోవాలని కేటీఆర్ సూచించారు. ప్రస్తుత పరిస్థితిని మెడికల్ ఎమర్జెన్సీ కింద హ్యాండిల్ చేయాలని ఆదేశించారు. మాస్కుల వల్ల ఉపయోగం ఉండదన్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రూ.100 కోట్లు కేటాయించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రులు, కంటోన్మెంట్‌లోని మిలిటరీ ఆస్పత్రితోపాటు వికారాబాద్‌లోని టీబీ ఆస్పత్రిలోనూ ప్రత్యేక వార్డులను సిద్ధం చేశామని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. వైరస్ కట్టడికి కేంద్రం మార్గదర్శకాలు పాటిస్తున్నామన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, కార్యదర్శి ప్రీతి సుడాన్‌తో తాను ఫోన్లో మాట్లాడానని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కొరత ఉన్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి 50 వేలు మాస్కులు పంపించాలని అడిగామని చెప్పారు. వైరస్ భయం పోయేదాకా ప్రజలు షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేయాలని సూచించారు. ఆప్తులకూ నమస్కారమే చేయాలన్నారు. కోవిడ్ వైరస్ సోకిన వాళ్లు మాస్క్‌లు ధరిస్తే సరిపోతుందని, అందరూ ధరించాల్సిన అవసరం లేదని ఈటల సూచించారు. కానీ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కర్చీఫ్ లేదా చెయ్యి అడ్డం పెట్టుకోవాలన్నారు.తరచూ చేతులను హ్యాండ్ వాష్ తో శుభ్రం చేసుకోవాలని సూచించారు.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
11 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
7 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
9 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
11 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
14 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
15 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
17 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
18 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
18 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
19 hours ago
ఇంకా