కోలుకున్నా కనికరించని కుటుంబీకులు
02-07-202002-07-2020 19:03:00 IST
Updated On 03-07-2020 10:36:11 ISTUpdated On 03-07-20202020-07-02T13:33:00.278Z02-07-2020 2020-07-02T13:29:54.536Z - 2020-07-03T05:06:11.108Z - 03-07-2020

ప్రపంచం మొత్తం బిక్కుబిక్కుమంటుంటే ఈ మాయదారి వైరస్ నుంచి కోలుకున్నా వారిని ఇంటికి తీసుకెళ్లేందుకు సొంత వారే నిరాకరిస్తున్నారు. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తు హైదరాబాద్ లో ఈ సంఘటన నెలకొంది. ఇటీవల కరోనా బారిన పడి గాంధీ ఆసుపత్రికి వచ్చినవారిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నా అనేకమందిని కుటుంబసభ్యులు తీసుకెళ్లకుండ ముఖం చాటేస్తున్నారు. గత రెండువారాలుగా 30 మంది వరకు ఆసుపత్రిలోనే ఉండిపోయారు. వారిలో కొందరు వృద్ధులు కాగా మరికొందరు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉండగా మరికొందరు పక్షవాతంతో బాధపడేవారు, మానసిక సమస్యలు ఉన్నవారున్నారు. మీకు కరోనా తగ్గిపోయింది.. వైరస్ లేదు. ఇక ఇంటికి వెళ్లవచ్చని వైద్యులు చెప్పడంతో ఎంతో ఆనందించారు. హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చని, తమవారు వచ్చి అక్కున చేర్చుకుంటారని ఆశించారు... కానీ రోజులు గడిచినా వారి ఆశ తీరలేదు. అప్పుడే ఇంటికి వద్దంటూ అయినవారు విముఖత చూపుతుండటంతో తల్లడిల్లుతున్నారు. ఇప్పటికే పలుమార్లు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన రకరకాల కారణాలు చూపి తీసుకెళ్లేందుకు నిరాకరిస్తున్నారు’ అని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. దీనితో వేరేదారి లేక ఆసుపత్రిలోనే ఉంచి వారికి సిబ్బంది సపర్యలు చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా గాంధీ దవాఖానకు కరోనా రోగుల తాకిడి పెరుగుతోంది. వారికి సేవలు అందించడానికే ఉన్న సిబ్బంది సరిపోవడం లేదని ఆస్పత్రి సుపరిండెంట్ తెలిపారు. ఇక కోలుకున్నవారిని సైతం ఇక్కడే పెట్టుకోవడం ప్రమాదమని వైద్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికే వారంతా కరోనా లేకపోయినా వివిధ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మళ్లీ వైరస్ సోకే ప్రమాదం ఉందని, తక్షణం ఇళ్లకు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నవారిని తీసుకెళ్లే విషయంలో వారి కుటుంబసభ్యులు ఒక్కొక్కరు ఒక్కో కారణాన్ని చూపిస్తున్నారు. తమ ఇంట్లో ఒకే గది ఉందని.. చిన్న పిల్లలు ఉన్నారని, వైరస్ తమకు కూడా సోకే ప్రమాదం ఉందంటూ పేర్కొంటున్నారు. మరికొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండటం వల్ల వారి ఆరోగ్యానికి భరోసాగా ఉంటుందని ఇంకొందరు భావిస్తున్నారు. లాక్డౌన్ ప్రభావం వల్ల చాలామందికి ఉపాధి కరవైంది. కుటుంబ పోషణే భారంగా మారుతోందని వారి కుటుంబ సభ్యులు అంటున్నారు. అద్దెలు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులెవరైనా అనారోగ్యం పాలైతే పట్టించుకునే దిక్కు ఉండటం లేదు. వైరస్ సోకితే మరింత కుంగిపోతున్నారు. కొన్నిసార్లు కడ చూపునకు కూడా నోచుకోలేని స్థితిలో చాలామంది మృతదేహాలను జీహెచ్ఎంసీ సిబ్బందే దహనం చేస్తున్నారు.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
6 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
9 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
12 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
13 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
13 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
11 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
a day ago

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా