newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు *ఈసారి భక్తులు లేకుండానే భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు *కరోనా వ్యాక్సిన్ తయారీకి సన్నాహాలు-కేంద్ర ఆరోగ్య శాఖ* అమెరికాలో సమ్మర్ ఇంటర్న్ షిప్ లు రద్దు ... భారతీయ విద్యార్థులకు భారీ నష్టం *కరోనా కేసులకు ప్రాంతాలుగా 10 హాట్ స్పాట్ లు... ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, యూపీలోని 10 ప్రాంతాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదు అయినట్టు గుర్తింపు-కేంద్రం *తెలంగాణలో నిన్న 30 మందికి కరోనా నిర్ధారణ, ముగ్గురు మృతి, రాష్ట్రంలో తొమ్మిదికి చేరిన కరోనా మృతుల సంఖ్య*తెలంగాణలో 127 , ఆంధ్రప్రదేశ్ లో 111 కరోనా పాజిటివ్ కేసులు*భారత్ లో క్రమంగా పెరుగుతోన్న కరోనా.. నిన్న ఒకేరోజు 437 కొత్త కేసులు నమోదు, దేశంలో 1834 కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య*ఏపీలో 111 కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు... నిన్న ఒక్కరోజే 67 కొత్త కేసులు నమోదు

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

13-11-201913-11-2019 19:05:53 IST
2019-11-13T13:35:53.532Z13-11-2019 2019-11-13T13:35:51.834Z - - 02-04-2020

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత 40 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు ఇప్పట్లో పరిష్కారం లభించే సూచనలు కనిపించడంలేదు. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికై ముగ్గురు మాజీ సుప్రీంకోర్టు జడ్జిలతో కమిటీ వేయాలన్న హైకోర్టు సూచనకు కేసీఆర్ సర్కార్ నో చెప్పింది. ఆర్టీసీ అంశం లేబర్ కోర్టులో ఉండటం వల్ల కమిటీ అవసరలేదని పేర్కొంది. ఈ మేరకు సీఎష్ ఎస్.కే.జోషి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసారు.

ఈ విషయంపై లేబర్ కమీషనర్ కు అప్పగించాలని కేసీఆర్ సర్కార్ హైకోర్టును కోరింది. ఆర్టీసీ సమ్మెపై చట్ట ప్రకారం లేబర్‌ కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. 1947 పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టం ప్రకారం కార్మికులంతా కంపెనీ చట్టాలను లోబడి ఉండాలని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీసీ కార్మికులు ఎవరి ఆదేశాలను పట్టించుకోవడం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌ ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని తెలిపారు. ఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సమ్మె చట్టవిరుద్ధమని మీరెలా చెప్తారని కోర్టు ఏజీని ప్రశ్నించింది. సమ్మె పరిష్కారానికి హైపవర్‌ కమిటీ వేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది రాపోలు ఆనంద భాస్కర్‌ వాదనలు వినిపించారు.

హైపవర్‌ కమిటీని వేసి సమస్యను పరిష్కరించాలని రాపోలు ఆనంద భాస్కర్‌ కోర్టును అభ్యర్థించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను గురువారానికి వాయిదా వేసింది. కార్మికుల సమ్మెపై విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. 

టీఎస్ ఆర్టీసీ ఏర్పాటుకు రాష్ట్రానికి అధికారాలు ఉన్నా కేంద్రం అనుమతి అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఆర్టీసీ చట్టం కేంద్ర చట్టంలో భాగమేనని, దీనికి కేంద్రం అనుమతి అవసరమని కోర్టు పేర్కొంది. మరోవైపు ఆర్టీసీలో బలిదానాలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం తీరుని విపక్షాలు తప్పుపడుతున్నాయి.

కార్మికులు గుండెపోటుకి గురైనా, ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టైనా లేకపోవడం దారుణమని సీపీఐ మండిపడింది. తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం లేదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు కనిపించడంలేదన్నారు. 

 

అప్సుడు జీన్స్ హబ్... ఇప్పుడు మాస్క్‌ల తయారీ అడ్డా!

అప్సుడు జీన్స్ హబ్... ఇప్పుడు మాస్క్‌ల తయారీ అడ్డా!

   3 hours ago


తెలుగు రాష్టాలలో నిఘా వ్యవస్థ నిద్రలోకి జారుకుందా?

తెలుగు రాష్టాలలో నిఘా వ్యవస్థ నిద్రలోకి జారుకుందా?

   3 hours ago


కాలుజారి మరణిస్తే వైద్యులపై రోగి బంధువుల దాడి.. గాంధీలో విధ్వంసం

కాలుజారి మరణిస్తే వైద్యులపై రోగి బంధువుల దాడి.. గాంధీలో విధ్వంసం

   4 hours ago


జగన్‌కు మీడియా ఫోబియా.. రికార్డెడ్ ప్రెస్‌మీట్లు షురూ!

జగన్‌కు మీడియా ఫోబియా.. రికార్డెడ్ ప్రెస్‌మీట్లు షురూ!

   5 hours ago


గోవులపై కరోనా ఎఫెక్ట్ .. దాణా కరువై ఆకలి అరుపులు

గోవులపై కరోనా ఎఫెక్ట్ .. దాణా కరువై ఆకలి అరుపులు

   6 hours ago


ప్రధాని మోడీ, అమిత్ షాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

ప్రధాని మోడీ, అమిత్ షాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

   7 hours ago


శంషాబాద్ నుంచి జర్మనీకి 38మంది తరలింపు

శంషాబాద్ నుంచి జర్మనీకి 38మంది తరలింపు

   8 hours ago


సింగరేణి  గనులలో లే ఆఫ్.. ఎమర్జెన్సీ ఉద్యోగులకు మినహాయింపు

సింగరేణి గనులలో లే ఆఫ్.. ఎమర్జెన్సీ ఉద్యోగులకు మినహాయింపు

   9 hours ago


గ్రామ వలంటీర్లకు జైహో.. ఒక్కరోజులో 93 శాతం మందికి ఫించన్లు

గ్రామ వలంటీర్లకు జైహో.. ఒక్కరోజులో 93 శాతం మందికి ఫించన్లు

   10 hours ago


ఒంటిమిట్టపై ఎందుకీ వివక్ష... చంద్రబాబు ఆవేదన

ఒంటిమిట్టపై ఎందుకీ వివక్ష... చంద్రబాబు ఆవేదన

   10 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle