newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అసెంబ్లీలో క‌నిపించ‌రా..?

08-03-202008-03-2020 08:02:27 IST
2020-03-08T02:32:27.141Z08-03-2020 2020-03-08T02:28:58.897Z - - 31-05-2020

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అసెంబ్లీలో క‌నిపించ‌రా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోందా ? ఆయ‌న‌ను శాస‌న‌స‌భ‌లో మ‌ళ్లీ చూడొద్ద‌ని అనుకుంటోందా ? అంటే ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు అవున‌నే స‌మాధాన‌మే ఇస్తున్నాయి. ఆయ‌న‌ను శాస‌న‌స‌భ నుంచి స‌స్పెండ్ చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. గ‌త అసెంబ్లీలో అప్ప‌టి న‌ల్గొండ ఎమ్మెల్యే, రాజ‌గోపాల్ రెడ్డి సోద‌రుడు వెంక‌ట్‌రెడ్డి స‌స్పెండ్ అయిన‌ట్లే ఇప్పుడు త‌మ్ముడిపై కూడా స‌స్పెన్ష‌న్ క‌త్తి వేలాడుతోంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో దూకుడుగా వెళ్ల‌గ‌లిగిన‌, ప్ర‌జ‌ల్లో ఇమేజ్ ఉన్న నేత‌లు కోమ‌టిరెడ్డి సోద‌రులు. ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో వీరికి మంచి పట్టుంది. పైగా ఆర్థికంగా బ‌లంగా ఉన్నారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అంటున్నారు.

2009లో భువ‌న‌గిరి ఎంపీగా గెలిచిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి 2014లో ఓడిపోయారు. ఆ త‌ర్వాత టీఆర్ఎస్ హ‌వా న‌డుస్తున్న స‌మ‌యంలో స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్యేగా గెలుచుకొని షాక్ ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్ గాలిలో మునుగోడు నుంచి మంచి మెజారిటీతో ఆయ‌న విజ‌యం సాధించారు.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప‌ని చేసిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి 2018 ఎన్నిక‌ల్లో అసెంబ్లీకి ఓడిపోయారు. అయినా పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో భువ‌న‌గిరి నుంచి ఎంపీగా గెలిచారు. ఇలా టీఆర్ఎస్ హ‌వా ఎంత ఉన్నా ఈ ఇద్ద‌రు సోద‌రులు త‌ట్టుకొని నిలుస్తున్నారు. ఇటీవ‌లి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో రాష్ట్ర‌మంతా ఏక‌ప‌క్షంగా టీఆర్ఎస్ విజ‌యాలు న‌మోదు చేసుకోగా, కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం కాంగ్రెస్ మంచి ఫ‌లితాల‌నే సాధించింది.

టీఆర్ఎస్ పార్టీపై విమ‌ర్శ‌లు చేయ‌డంలోనూ వీరు ముందుంటున్నారు. ప్ర‌స్తుతం పీసీసీ చీఫ్ ప‌ద‌విపైన కోమ‌టిరెడ్డి సోద‌రులు క‌న్నేశారు. ఈ ప‌ద‌వి క‌నుక వ‌స్తే మ‌రింత దూకుడు పెంచుతారు. ఇదిలా ఉండ‌గా నిన్న అసెంబ్లీలో జ‌రిగిన ప‌రిణామాలు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదం తెలిపే తీర్మాణంపై రాజ‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.

టీఆర్ఎస్ పార్టీ వైఫ‌ల్యాలపై గ‌ట్టిగా మాట్లాడారు. మంత్రుల‌పైనా తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. రాజ‌గోపాల్ రెడ్డి ప్ర‌సంగం టీఆర్ఎస్‌కు, ముఖ్యంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఆగ్ర‌హం తెప్పించింది.

దీంతో ఎప్పుడూ విమ‌ర్శ‌ల‌కు పెద్ద‌గా బ‌దులివ్వ‌ని కేసీఆర్ అసెంబ్లీలో ఆ త‌ర్వాత సుమారు గంట సేపు కౌంట‌ర్ ఇచ్చారు. అన్ని శాఖ‌ల‌పై రాజ‌గోపాల్ రెడ్డి చేసిన విమ‌ర్శ‌ల‌ను కేసీఆర్ లెక్క‌ల‌తో స‌హా తిప్పికొట్టారు. రాజ‌గోపాల్‌రెడ్డివి అబద్దాల‌ని నిరూపించేలా ఆయ‌న లెక్క‌లు వివ‌రించారు.

కోమ‌టిరెడ్డి సోద‌రుల రాజ‌కీయాల‌పై కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. అసెంబ్లీలో అబ‌ద్ధాలు మాట్లాడిన రాజ‌గోపాల్ రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్పీక‌ర్‌ను కోరారు. రాజ‌గోపాల్ రెడ్డి లాంటి వారిని ఉపేక్షించ‌వ‌ద్ద‌ని ప‌దేప‌దే నొక్కి చెప్పారు. ఆ త‌ర్వాత న‌ల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి కూడా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిని స‌స్పెండ్ చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని మీడియాకు హింట్ ఇచ్చారు. అంతేకాదు మునుగోడుకు ఉప ఎన్నిక వ‌స్తే తామే గెలుస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు.

అయితే, శాస‌నస‌భ క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించార‌నే ఆరోప‌ణ‌పై రాజ‌గోపాల్‌రెడ్డిని స‌భ నుంచి స‌స్పెండ్ చేసే అవ‌కాశం ఉంది. కేవ‌లం బ‌డ్జెట్ స‌మావేశాల‌కే కాకుండా ఈ అసెంబ్లీ ట‌ర్మ్ మొత్తం ఆయ‌న‌ను స‌భ నుంచి బ‌హిష్క‌రించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

గ‌త అసెంబ్లీలోనూ మొద‌ట రేవంత్ రెడ్డిని, చివ‌ర్లో కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, సంప‌త్ కుమార్‌ను ఇలానే స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు రాజ‌గోపాల్ రెడ్డిని కూడా ఇదే విధంగా స‌స్పెండ్ చేయ‌వ‌చ్చ‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, స‌భ నుంచి స‌స్పెండ్ చేసినా ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వి మాత్రం కొన‌సాగుతుంది. ఉప ఎన్నిక వ‌చ్చే అవ‌కాశం ఉండ‌దు.

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   3 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   8 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   11 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   11 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   12 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   14 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   14 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   14 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   15 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle