newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

కోమటిరెడ్డి రైతుబంధు పాయింట్ భేష్.. ఆచరణ సాధ్యమేనా?

15-03-202015-03-2020 11:39:20 IST
2020-03-15T06:09:20.275Z15-03-2020 2020-03-15T06:09:15.553Z - - 31-05-2020

కోమటిరెడ్డి రైతుబంధు పాయింట్ భేష్.. ఆచరణ సాధ్యమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ తాజాగా అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం మీద ఒక పాయింట్ లేవనెత్తారు. రాష్ట్రంలో ఆర్ధికంగా స్థిరపడిన వాళ్ళు, వందల ఎకరాలు భూములు ఉన్నవాళ్లు లక్షమందికిపైగా ఉన్నారని.. వారందరికీ కూడా రైతుబంధు పథకం అవసరమా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

ఆ లక్షమంది పేరుకు రైతులే కానీ వాళ్ళు వ్యవసాయం చేయరని.. అందరూ కౌలుకి ఇచ్చి ఎక్కడో సిటీలో సెటిల్ అయ్యారని.. కానీ వాళ్ళకి ఒకపక్క కౌలుతో పాటు రైతుబంధు కూడా ఇవ్వడం మంచిదేనా? అని ప్రశ్నించారు. అదే సమయంలో పొలం కష్టపడి పనిచేస్తున్న కౌలురైతుకి ఆసరా అందడం లేదని రాజగోపాల్ అసెంబ్లీలో వెల్లడించారు.

తననే ఉదాహరణగా తీసుకుంటే.. తనకు మూడు లక్షల రూపాయలు రైతుబంధు డబ్బులు వచ్చాయని.. నాకు రైతుబంధు అవసరమా అని ప్రశ్నించారు. తనకి వచ్చిన డబ్బును పేదరైతులకు పంచిపెట్టానని అయితే.. ఇలా రాష్ట్రంలో మిగతా లక్షమంది చేస్తున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లోతుగా పరిశీలిస్తే రాజగోపాల్ ప్రశ్న సమంజసమేనని చెప్పుకోవాలి.

రైతుబంధు పథకం మొదలుపెట్టిన సమయం నుండే దీనిపై వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలో భూస్వాములు.. ఇతర దేశాల్లో.. దేశంలో పెద్ద పెద్ద నగరాలలో వ్యాపారాలు చేసుకుంటున్నా వాళ్ళకి రైతుబంధు నిధులు జమ అవుతుండగా.. రాష్ట్రలో ఆ భూములను సేద్యంచేసి పండించే కౌలు రైతులకు మాత్రం నిండిసున్నా చూపిస్తుంది ప్రభుత్వం.

రైతుబంధు దేశంలో మరెక్కడా లేని పథకం. ఇది పూర్తిగా సీఎం కేసీఆర్ క్రెడిట్. ఎకరానికి ఒక మొత్తాన్ని నిర్ణయించి డైరెక్టుగా రైతు బ్యాంకు ఖాతాకు జమ చేయడం అన్నది మంచిదే. మిగతా రాష్ట్రాలన్నీ తలకి ఇంతని లెక్కకడుతుంటే తెలంగాణ మాత్రం ఎకరానికి ఇంతలెక్కన జమ చేస్తుంది. అయితే అదే సమయంలో ఈ పథకంపై విమర్శలకు తక్కువేం కాదు.

టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో.. రైతుబంధు పథకం మొదలుపెట్టిన కొత్తలో ఉన్న డేటా ప్రకారమే ఇప్పటికీ నిధుల జమ జరుగుతుంది. కొత్తగా పట్టాదారు పాసుబుక్స్ తీసుకున్నవారు.. కొత్తగా భూములు కొనుకున్న వారు.. వారసత్వంగా బదిలీ చేసుకున్న వారు ఇప్పటికీ దరఖాస్తులు ఇస్తున్నా లబ్దిదారులు కాలేకపోతూ వాపోతున్నారు.

ఇక అదే సమయంలో బడా బడా భూస్వాముల విషయంలో కూడా అంతే. ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లకి కాస్త ఆలస్యంగానైనా లక్షలలో ప్రభుత్వ సొమ్ము చేరుతుంది. ఇదంతా పెద్దవాళ్ళకి.. కౌలు రైతులకి చెందాల్సింది. ఇది ఘోరమైన తప్పిదంగానే చెప్పుకోవాలి. ముఖ్యంగా కౌలురైతులకు ఏదొక రీతిన న్యాయం చేయాల్సి ఉంది.

అయితే, కేసీఆర్ ప్రభుత్వానికి మంచి అప్లాజ్ తెచ్చిన పథకాలలో రైతుబంధు కూడా ముఖ్యమైనది. అందుకే కేసీఆర్ ఎన్ని విమర్శలు వచ్చినా ఈ పథకంలో మార్పు ఉండదన్నారు. అదే సమయంలో కౌలు రైతులకు కూడా మరొక మార్గంలో న్యాయం చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి నష్టం తెచ్చే అంశం కనుక ఇందులో ఆచరణ ఎంతవరకన్నది ప్రశ్న.

ఇక, ఎప్పుడూ కుమ్ములాటలు.. ఆధిపత్య పోరాటానికి పరిమితమయ్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ మొత్తానికి శనివారం రైతుల మీద ఒక మంచి పాయింట్ లేవనెత్తడం మంచి పరిణామమే. అయితే.. మరోపక్క ఎంపీ రేవంత్ విషయంలో అదే శనివారం రోజున 'సిల్లీ' వ్యాఖ్యలు చేయడం కూడా విశేషం. ఇదే పోరాటం కలిసిచేస్తే ప్రజలకు ఇంకా మంచి జరుగుతుందేమో.. జస్ట్ థింక్ ప్లీజ్!!

 

 

 

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   2 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   7 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   10 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   10 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   11 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   13 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   13 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   13 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   14 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle