కోమటిరెడ్డి బ్రదర్స్ ధిక్కార స్వరం..కొత్త పార్టీవైపు అడుగులు?
07-03-202007-03-2020 09:42:56 IST
Updated On 07-03-2020 10:23:40 ISTUpdated On 07-03-20202020-03-07T04:12:56.956Z07-03-2020 2020-03-07T04:12:46.246Z - 2020-03-07T04:53:40.355Z - 07-03-2020

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు టీపీసీసీలో మార్పులు అప్పుడే కాదా? కోమటిరెడ్డి కల చెదిరిపోతోందా? కొత్త పార్టీ ఆలోచన ఎందుకొచ్చినట్టు? కాంగ్రెస్ ఈ ధిక్కారస్వరాన్ని చూస్తూ ఊరుకుంటుందా? టీపీసీసీ పీఠంపై ఆశలు వదులకున్నారా? తెలంగాణ కాంగ్రెస్ లో పరిణామాలు మారిపోతున్నాయి. టీపీసీసీ అధ్యక్ష పీఠంపై కన్నేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ తమ వైఖరి మార్చుకుంటున్నారు. కాంగ్రెస్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓసారి… తరువాత కూడా ఓసారి రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ళ క్రితమే కొత్త పార్టీ ఆలోచన వారి నోటినుంచి వచ్చింది. తాజాగా మళ్ళీ కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో బ్రదర్స్ ఇద్దరూ కాంగ్రెస్ లోనే కొనసాగుతారా కొత్త పార్టీ పెడతారా అనేది చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడు మరోసారి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు రాజగోపాల్. లోపం ఇక్కడే ఉందని గతంలో తాను చెప్పాననీ, అవి ఆవేదనతో చేసిన వ్యాఖ్యలే తప్ప పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి చేసినవి కాదన్నారు. ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నాననీ… సరైన సమయంలో సరైన నాయకత్వం అందించలేకపోవడం వల్లనే తెలంగాణలో పార్టీ ఈ స్థాయికి చేరిందన్నారు. నాయకత్వం విషయంలో అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుని, సరైన నాయకత్వాన్ని అందించాలని ఆయన అంటున్నారు. అంతేకాదు, ఆయన మరో అడుగు ముందుకేశారు. కేసీయార్ పతనమే లక్ష్యంగా ముందుకు సాగుతామని, అవసరమయితే సొంత పార్టీ పెట్టే ఆలోచన చేస్తాననీ… ఏ నిర్ణయానికైనా రెడీగా ఉన్నా అన్నారు రాజగోపాల్. కేసీఆర్ దోపిడీ ఆపాలంటే ఏదో ఒకటి చెయ్యక తప్పదన్నారు. సరైన సమయం వస్తుందనీ, అప్పుడు అన్ని విషయాలూ బయటపెడతానని రాజగోపాల్ బాంబు పేల్చారు. ఆదినుంచి పార్టీ అధిష్టానం పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో పొరపాట్లు చేస్తోందని కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారు. పీసీసీ నియామకంలో పొరపాట్ల వల్లనే రాష్ట్రంలో పార్టీ నష్టపోతోందన్నది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది. ఒకవేళ తాము అనుకున్నవారికి కాకుండా వేరేవ్యక్తులకు పీసీసీ పీఠం వస్తే తాము పార్టీని వీడడానికి కూడా వెనుకాడమని అధిష్టానం హెచ్చరిక జారీచేసినట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ వ్యాఖ్యలను హైకమాండ్ ఎలా తీసుకుంటుందో చూడాలి. టీపీసీసీ కొత్త సారథి నియామకం విషయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఏదో తేడా కొట్టడం వల్లే ఇలాంటి కామెంట్లు వస్తున్నాయని అంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ లో మరోసారి ఈ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అవుతోంది. అప్పటినుంచి పార్టీలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఒకప్పుడు అధికారం చలాయించిన పార్టీ కనీసం ప్రధాన ప్రతిపక్షం స్థాయిని కూడా నిలబెట్టుకోలేకపోయింది. పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు పార్టీకి షాకిచ్చారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా పూర్తికాలం కాంగ్రెస్ పార్టీతో వుంటారా అనేది అనుమానంగానే వుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ సారథి విషయంలో ఇంత తాత్సారం ఎందుకు చేస్తుందో చూడాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు రేవంత్ ఆశలు వదులుకున్నట్టే అనిపిస్తోంది.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
11 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
7 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
10 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
12 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
14 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
16 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
17 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
19 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
19 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
20 hours ago
ఇంకా