newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

కోమటిరెడ్డి కోరిక నెరవేరుతుందా? ఆ పీఠం దక్కుతుందా?

04-03-202004-03-2020 08:31:12 IST
Updated On 04-03-2020 12:54:25 ISTUpdated On 04-03-20202020-03-04T03:01:12.114Z04-03-2020 2020-03-04T02:59:47.961Z - 2020-03-04T07:24:25.199Z - 04-03-2020

కోమటిరెడ్డి కోరిక నెరవేరుతుందా?  ఆ పీఠం దక్కుతుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్ పార్టీలో కేరాఫ్ కాంట్రవర్శీ  కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అధికార పార్టీ పైనే కాదు..సొంత పార్టీ నేతలపైనా విరుచుకుపడటం ఆయన నైజం. అంతర్గత ప్రజాస్వామయ్యం అధికంగా ఉన్న ఆపార్టీలో ఆ స్వాతంత్య్రాన్ని ఆసాంతం వాడుకునేది ఆయనొక్కడే అని టాక్.  ఎమ్మెల్యేగా ప్రజలు తిరస్కరించినా ఎంపీగా ఓటర్లు ఆదరించడంతో మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. పెద్దగా  గాంధీ భవన్ మెట్లు ఎక్కకున్నా గాంధీ భవన్ కుర్చీపై కన్నేశారు. ఆయన కోరిక నెరవేరుతుందా?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ పీఠంపై కూర్చునేందుకు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో తాను మాత్రమే సీనియర్ అంటూ కామెంట్స్ చేయడం.... ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి సిద్ధమని చెప్పుకొస్తున్నారు. 2018 శాసనసభ ఎన్నికల్లో నల్లగొండ నుండి 5వ సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడంతో రాజకీయంగా తొలిసారిఎదురుదెబ్బ తగిలింది. ఆ వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  భువనగిరి యంపీగా పోటీచేసి భారీ మెజారీటితో విజయం సాధించి పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల తగిలిన ఎదురుదెబ్బో... లేక ఢిల్లీ గాలో గాని యంపీగా గెలిచిన తర్వాత నుంచి రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలకు ఉత్తమ్ బాధ్యత వహించాలని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ మార్క్ రాజకీయాలను మరోసారి రుచి చూపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు  సీనియర్ నేతలపైగా సందర్భం వచ్చిన ప్రతీసారి ఎదురుదాడి చేయడం కోమటిరెడ్డి బ్రదర్స్ కు మాత్రమే సాధ్యమైంది.

ఎన్నివివాదాలకు కారణమైనా కోమటిరెడ్డి బ్రదర్స్ పై అధిష్టానం చర్యలు తీసుకొకపొవడం.. ఏదిచేసినా పార్టీకోసమే అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పుకురావడం కామన్ అయిపోయింది. ఇదంతా సొంత పార్టీ వ్యవహారం.సొంత పార్టీకి చెందిన సీనియర్ నేతలపై తీవ్రస్దాయిలో విరుచుకుపడే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికార పార్టీపై కూడా ఆయన విమర్శల పరంపర, దూషణల పర్వం ఆగలేదు తగ్గలేదు. ఏకంగా టీఆర్ఎస్ అధినేతే లక్ష్యంగా విమర్శల దాడి తీవ్రతరం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుండి పార్లమెంట్ కు ఎన్నికై ఢిల్లీ కేంద్రంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర, జిల్లా సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రుల కార్యాలయాల గడపలు తొక్కుతూ  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంభిస్తుండటంతో వివిధ సమస్యలపై అధికార పార్టీ నుండి ప్రశ్నించేవారు కరువయ్యారు.

ఈ అంశాన్ని కోమటిరెడ్డి వెకంట్ రెడ్డి అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. అధికార పార్టీ చేయాల్సీన పనిని, విపక్ష పార్టీలు చేయాల్సిన పనులను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిల్లీ కేంద్రంగా భుజానవేసుకొవడం... ఢిల్లీ కేంద్రంగా అధికార టీఆర్ఎస్ వైఖరిని ఎండగడుతుండటంతో కొంత మైలేజ్ సంపాదించడంలో సక్సెస్ అయ్యారు. ఇదే అదునుగా అధిష్టానం  దృష్టిలో పడేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాపై ఘటుగా స్పందిస్తూనే. తాను మాత్రమే పోరాటం చేయగలను... చేస్తున్నా అన్న సంకేతాలు అదిష్టానానికి ఇస్తున్నారు.

మొత్తానికి  పీసీసీ పీఠం దక్కితే రాష్ట్రం మొత్తం తిరగడానికి అవకాశం ఉంటుందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి అవకాశం ఉంటుందని అయన ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. పీసీసీ మార్పు ఉంటుందా... ఉంటే పీసీసీ ఎంపికలో మరి సీనియర్లు ఏమేరకు సహకరిస్తారొన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం. ఏది ఏమైనా పీసీసీ పీఠం దక్కుతుందా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. 

 

సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో  కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

   9 minutes ago


ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

   4 hours ago


60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

   4 hours ago


ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   6 hours ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   8 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   8 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   8 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   9 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   9 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   9 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle