newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కోదండ‌రాంను రాజ‌కీయాల నుంచి పంపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా ..?

08-09-202008-09-2020 07:15:21 IST
Updated On 08-09-2020 07:38:00 ISTUpdated On 08-09-20202020-09-08T01:45:21.230Z08-09-2020 2020-09-08T01:44:50.255Z - 2020-09-08T02:08:00.405Z - 08-09-2020

కోదండ‌రాంను రాజ‌కీయాల నుంచి పంపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా ..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ జేఏసీ ఛైర్మ‌న్‌గా ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మాన్ని ముందుండి న‌డిపించిన ప్రొ.కోదండ‌రాంకు రాజ‌కీయాలు అంత‌గా క‌లిసి రాలేదు. ఉద్య‌మంలో అన్ని పార్టీల‌ను ఏక‌తాటిపైకి న‌డిపించిన ఆయ‌న ఇప్పుడు స్వంత పార్టీని న‌డిపించ‌డంలో ఇబ్బంది ప‌డుతున్నారు. ఒకానొక స‌మ‌యంలో కేసీఆర్‌కు ధీటుగా ఆయ‌న నిల‌బ‌డరాని తెలంగాణ స‌మాజం అంచ‌నా వేసింది. టీఆర్ఎస్‌కు బ‌ల‌మైన ప్ర‌త్యామ్నాయం కావాల‌ని ఆశ‌ప‌డ్డ‌వారు కోదండ‌రాం వైపు చూశారు. కానీ, ఆయ‌న ఈ అంచ‌నాల‌ను, ఆశ‌ల‌ను అందుకోలేక‌పోయారు.

విద్యార్థుల‌కు పొలిటిక‌ల్ సైన్స్ పాఠాలు చెప్పిన ప్రొ.కోదండ‌రాం మూడేళ్ల క్రితం తెలంగాణ జ‌న స‌మితి అనే రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్య‌మ నేత‌గా ప్ర‌జ‌ల్లో ప్రొ.కోదండ‌రాంకు మంచి గుర్తింపు ఉంది. ఎటువంటి ఆరోప‌ణలు లేని క్లీన్ ఇమేజ్ ఉన్న నేత ఆయ‌న‌. తెలంగాణ ప‌రిస్థితుల‌పైన కేసీఆర్‌కు స‌మానంగా స‌మ‌గ్ర అవ‌గాహ‌న ఉన్న అతి కొద్ది మందిలో కోదండ‌రాం ఒక‌రు. కాబ‌ట్టి, కోదండ‌రాంను రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని, త‌మ పార్టీలో చేర్చుకోవాల‌ని కాంగ్రెస్‌, భార‌తీయ జ‌న‌తా పార్టీలు చాలా ప్ర‌య‌త్నించాయి. ఈ రెండు పార్టీల్లో ఏదైనా పార్టీలో కోదండ‌రాం చేరితే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి అవుతార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది.

ముఖ్యంగా కోదండ‌రాం స్వంత పార్టీ పెట్టుకోవ‌డం కాంగ్రెస్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును కోదండ‌రాం చీలుస్తార‌ని, అది త‌మ‌కే ఇబ్బంది అని కాంగ్రెస్ భావించింది. అయితే, కోదండ‌రాం మాత్రం అనేక స‌మాలోచ‌న‌ల త‌ర్వాత పార్టీని స్థాపించారు. అయితే, ఈ జ‌మానాలో రాజ‌కీయ పార్టీని న‌డిపించ‌డానికి అవ‌స‌ర‌మైన అంగ‌, అర్థ‌, మీడియా బ‌లం కోదండ‌రాంకు లేవు. దీంతో ఆయ‌న త‌న పార్టీని బ‌లోపేతం చేయ‌లేక‌పోయారు. మూడేళ్లు అవుతున్నా పార్టీకి క్యాడ‌ర్ నిర్మాణం జ‌ర‌గ‌లేదు.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో క‌లిసి పోటీ చేయ‌డం ఆ పార్టీకి పెద్ద దెబ్బ అయ్యింది. పొత్తులో టీజేఎస్‌కు కేవ‌లం మూడు అసెంబ్లీ స్థానాలే ద‌క్కాయి. దీంతో స్వ‌యంగా కోదండ‌రాం పోటీ చేయ‌లేక‌పోయారు. ఆ ఎన్నిక‌ల్లో కూట‌మి ఓడిపోయింది. దీంతో టీజేఎస్ మ‌రింత న‌ష్ట‌పోయి ఇప్పుడు నామ‌మాత్రంగా త‌యారైంది. అయితే, తెలంగాణ స‌మ‌స్య‌ల‌పైన‌, ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పైన మిగ‌తా పార్టీల కంటే వేగంగా, విష‌య ప‌రిజ్ఞానంతో కోదండ‌రాం స్పందిస్తున్నారు. కానీ, ఆయ‌న‌కు, టీజేఎస్‌కు రావాల్సినంత గుర్తింపు రావ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో చ‌ట్ట‌స‌భ‌లో టీజేఎస్ వాణి వినింపించాల‌ని కోదండ‌రాం డిసైడ్ అయ్యారు. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో న‌ల్గొండ - వ‌రంగ‌ల్ - ఖ‌మ్మం స్థానం నుంచి పోటీ చేయాల‌ని కోదండ‌రాం భావిస్తున్నారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మ‌హబూబ్‌న‌గ‌ర్ స్థానంలోనూ పోటీ పెట్టాల‌ని టీజేఎస్ నిర్ణ‌యించింది. ఇది కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింది. కోదండ‌రాంకు ప‌ట్ట‌భ‌ద్రుల్లో గుర్తింపు ఉంది. ఆయ‌న పోటీ చేస్తే ప్ర‌ధాన పోటీదారు అవుతారు. ఇది కాంగ్రెస్ విజ‌యావ‌కాశాల‌ను దెబ్బ‌తీసే అవ‌కాశం ఉంది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌కు కోదండ‌రాం రాజ‌కీయంతో స‌మ‌స్య వ‌చ్చింది.

ఈ స‌మ‌యంలో తెలంగాణ పీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డి.. కోదండ‌రాంకు ఒక సూచ‌న చేశారు. రాజ‌కీయ పార్టీ కోదండ‌రాంకు స‌రిప‌డ‌ద‌ని రేవంత్ అంటున్నారు. తెలంగాణ‌లో రాజ‌కీయాల‌కు అతీతంగా ఒక వేదిక ఏర్పాటు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఈ వేదిక కోదండ‌రాం నేతృత్వంలోనే ఏర్పడాల‌ని రేవంత్ రెడ్డి ఒక ప్ర‌తిపాద‌న తీసుకొచ్చారు. అయితే, ఈ వేదిక ఎలా ఉండాలి, ఎలా పని చేయాలి అనే అంశాల‌పై ఇంకా ఎటువంటి చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. కానీ, ప్రొ.కోదండ‌రాం రాజకీయాల‌ను వ‌దిలి త‌ట‌స్థ వేదిక మీద ప‌ని చేయాల‌ని కాంగ్రెస్ కోరుకుంటోంది. మ‌రి, కోదండ‌రాం ఈ ప్ర‌తిపాద‌న‌ను ఎలా తీసుకుంటారో చూడాలి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle