కొవిడ్ చికిత్సా కేంద్రాల్లో కొత్త సవాళ్ళు
26-07-202026-07-2020 10:24:30 IST
2020-07-26T04:54:30.207Z26-07-2020 2020-07-26T04:54:02.234Z - - 15-04-2021

తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు బయటపడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొవిడ్ చికిత్సా కేంద్రాల్లో రానురాను కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. కరోనా వార్డుల్లో పని చేసే వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది నెమ్మదిగా వైరస్ బారిన పడుతున్నారు. వీరంతా హోం ఐసోలేషన్లలోకి వెళ్లిపోతుండడంతో ఇప్పటికే కరోనా వార్డుల్లో పని చేసేందుకు మానవ వనరుల కొరత ఏర్పడుతోంది. వార్డుల్లో పని చేసేందుకు కొత్తవారిని తీసుకుందామంటే, మహమ్మారి భయంతో ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం మరో ఆలోచన చేసింది. మనుషులతో అవసరం లేకుండా ఆ పనులు చేసేందుకు యంత్ర సామగ్రి సమకూర్చుకోవాలని భావిస్తోంది.ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ విషయాన్ని శనివారం స్పష్టం చేశారు. కొవిడ్ వార్డుల్లో నేల, గోడలు, మరుగుదొడ్లు శుభ్రం (శానిటైజ్) చేయడం వంటి పనులకు యంత్రాలను సమకూర్చుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన యంత్రాలను ప్రభుత్వం కొనుగోలు చేసే పనిలో ఉందని, వీటిని అన్ని కొవిడ్ ఆస్పత్రులకు అందజేస్తామని మంత్రి ఈటల వెల్లడించారు. వీటిలో బయోమెడికల్ వ్యర్థాలను నాశనం చేసే యంత్రాలు కూడా ఉండనున్నట్లు మంత్రి తెలిపారు. కొవిడ్ వార్డుల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది అనారోగ్యం బారిన పడడం.. ఆ స్థానాల్లో కొత్తవారు పని చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతోనే యంత్ర సామగ్రి వైపు మొగ్గు చూపుతున్నట్లు మంత్రి వివరించారు. అంతేకాక, రోగులకు అందించే ఆహారం విషయంలోనూ విమానాల్లో అందించే మాదిరిగా హాట్ప్యాక్ క్యారియర్స్ను సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు.మరోవైపు, మంత్రి ఈటలను తెలంగాణ రిజిస్టర్డ్ ఆర్ఎంపీ, ప్రైవేటు ప్రాక్టీషనర్ల సంఘం కలిసింది. కొవిడ్ చికిత్సలో తమను కూడా భాగస్వామ్యం చేయాలని వారు మంత్రికి వినతి పత్రం అందించారు. క్షేత్రస్థాయిలో ఎవరైనా కరోనా లక్షణాలతో కనిపిస్తే వారిని దగ్గర్లోని కొవిడ్ ఆస్పత్రికి పంపాలని ఆర్ఎంపీలకు మంత్రి సూచించారు. వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే ఎన్నో మరణాలను అడ్డుకోవచ్చని చెప్పారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
13 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
13 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
13 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
17 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
18 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
17 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
19 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
20 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
15 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
21 hours ago
ఇంకా