newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కొత్త సచివాలయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

29-06-202029-06-2020 11:53:09 IST
Updated On 29-06-2020 12:20:32 ISTUpdated On 29-06-20202020-06-29T06:23:09.066Z29-06-2020 2020-06-29T06:21:08.172Z - 2020-06-29T06:50:32.765Z - 29-06-2020

 కొత్త సచివాలయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మాణానికి అన్ని అవరోధాలు తొలగిపోయాయి. పాత సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, సచివాలయం కూల్చివేతపై వేసిన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు, ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ఈ కేసుకి సంబంధించి హైకోర్టులో సుధీర్ఘంగా కొనసాగాయి వాదనలు. మంత్రిమండలి నిర్ణయాన్ని తప్పుబట్టలేమని కోర్టు తెలిపింది. దీంతో కొత్త సచివాలయం నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది.

ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్‌ను కూల్చివేసి కొత్తది కట్టుకోవడానికి అనుమతి మంజూరు చేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన కోర్టు కూల్చివేతకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను కొట్టివేసింది. త్వరలో అత్యాధునిక హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించనుంది. గతంలో సచివాలయ కూల్చివేతకు వ్యతిరేకంగా పది పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ప్రస్తుతం ఉన్న సచివాలయం అవసరాలకు సరిపోవడం లేదని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.

భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని కోర్టుకు తెలిపింది. సచివాలయ నిర్మాణం అనేది విధాన పరమైన నిర్ణయమని, అందులో కోర్టు జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వం వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మంత్రిమండలి నిర్ణయాన్ని తప్పుబట్టలేమని పిటిషన్లను కొట్టివేసింది. దీంతో త్వరలో కొత్త సచివాలయ నిర్మాణానికి మార్గం సుగమం అయింది. 

 

 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle