newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

కొత్త సచివాలయం అవసరమా? హైకోర్టు కీలక ప్రశ్నలు

03-01-202003-01-2020 08:39:18 IST
2020-01-03T03:09:18.440Z03-01-2020 2020-01-03T03:02:13.400Z - - 21-02-2020

కొత్త సచివాలయం అవసరమా? హైకోర్టు కీలక ప్రశ్నలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మాణానికి కేసీయార్ ప్రభుత్వం అడుగులు వేస్తున్న వేళ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని పత్రికల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో కోట్లు ఖర్చు చేసి కొత్త సచివా లయం నిర్మించాలా? ప్రజాహితం కోసమే కావచ్చు. కొత్తగా నిర్మాణం చేస్తే కనీసం అయిదారేళ్లు సమయం పడుతుంది. ఇందుకు వ్యయం చేశాక ఆదాయం ఏమీ రాదు. ఇలాంటప్పుడు కొత్తగా నిర్మాణం చేయాలా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. 

నగరంలోని వేర్వేరు చోట్లకు సచివాలయ కార్యాలయాన్ని తరలించేస్తే, అధికారిక రహస్య ఫైళ్ల పరిస్థితి ఏమిటి? ఆ ఫైళ్లు తరలించే దారిలో అవి కనిపించకుండా పోతే? ఆ ఫైళ్లు తారుమారయ్యే అవకాశం లేదా? వేర్వేరు చోట్ల సచివాలయ కార్యాలయాలు ఉంటే కీలకఫైళ్లను ఎలా భద్రపరుస్తారని హైకోర్టు ప్రశ్నించడంతో కొత్త ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

కొత్త సచివాలయం కోసం రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు కూడా సరిగా లేవని హైకోర్టు అభిప్రాయపడింది. 2019 ఫిబ్రవరి 18న తీసుకున్న నిర్ణయం గందరగోళంగా ఉందని కోర్టు పేర్కొంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్థాయికి తగినట్లుగా అన్ని హంగులతో భావితరాలకు సరిపడేలా ఉన్నతస్థాయి నిర్మాణం చేస్తామని ఒక చోట, పాత సచివాలయానికే మార్పులు చేర్పులు చేసి ఆధునీకరించి వినియోగించుకోవాలని మరోచోట ఉంది. పరస్పర విరుద్ధంగా అంతా అయోమయంగా కేబినెట్‌ నిర్ణయం ఉందని దేనిని పరిగణనలోకి తీసుకున్నారని ప్రశ్నించింది. 

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను గురువారం విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలుస్తోంది. కొత్త సచివాలయాన్ని నిర్మాణం ఎప్పటిలోగా పూర్తిచేస్తారో చెప్పాలని ఆదేశించింది. సచివాలయం నిర్మాణానికి మూడేళ్ళ సమయం పడుతుందని, వివిధ శాఖల మధ్య సమన్వయం ఎలా సాధ్యపడుతుందని కోర్టు పేర్కొంది. 

హైకోర్టు ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలిచ్చింది. సచివాలయాన్ని 70 శాతం వరకూ బూర్గుల భవనంలోకి, మిగిలిన 30 శాతాన్ని నగరంలోని వేరువేరు ప్రభుత్వ భవనాల్లోకి తరలించామని తెలిపారు. చాలా వరకూ మంత్రులు, ఆయా శాఖాధిపతులు ఒకేచోట ఉంటున్నారని చెప్పుకొచ్చింది.

మంత్రివర్గ నిర్ణయాల్లో న్యాయ స్థానాలు జోక్యం చేసుకోడానికి వీల్లేదని చెప్పగానే, నిర్ణయం సహేతుకం కానప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చునని ధర్మాసనం బదులిచ్చింది. సచివాలయం  నిర్మాణం, వ్యయం, సమయం వంటి ఇతర వివరాలతో సాంకేతిక కమిటీ నివేదికను రోడ్డు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 7వ తేదీకి వాయిదా వేసింది.  

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   5 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   6 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   8 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   9 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   9 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   10 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   13 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   14 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   14 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   15 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle