newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కొత్త నేత‌ల ఆశ‌లు ఆవిరి చేసిన‌ బండి సంజ‌య్‌..!

04-08-202004-08-2020 08:51:53 IST
Updated On 04-08-2020 08:54:10 ISTUpdated On 04-08-20202020-08-04T03:21:53.314Z04-08-2020 2020-08-04T03:04:24.496Z - 2020-08-04T03:24:10.933Z - 04-08-2020

కొత్త నేత‌ల ఆశ‌లు ఆవిరి చేసిన‌ బండి సంజ‌య్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసే దిశ‌గా అడుగులు వేస్తున్న ఆ పార్టీ వివిధ పార్టీల నుంచి కొత్త వారిని చేర్చుకుంటోంది. అయితే, పార్టీలో కొత్త వారిని చేర్చుకుంటున్నా ప‌ద‌వుల విష‌యంలో మాత్రం ముందు నుంచీ బీజేపీలో ఉన్న వారికే పెద్ద పీట వేస్తోంది.

దీంతో ఇత‌ర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేత‌లు కొంత అసంతృప్తితో ఉన్నారు. అయితే, బీజేపీలో కింది స్థాయి నుంచి పార్టీ కోసం ప‌ని చేసిన వారికి గుర్తింపు ఉంటుంద‌నేది అధిష్టానం ఇప్పుడు మ‌రోసారి నిరూపించింది.

తెలంగాణ‌లో పార్టీని బ‌లోపేతం చేయాల‌ని భావించిన బీజేపీ పెద్ద‌లు కొత్త అధ్య‌క్షుడిని నియ‌మించాల‌నుకున్నారు. రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి కోసం డీకే అరుణ‌, ఏపీ జితేంద‌ర్ రెడ్డి వంటి ఇత‌ర పార్టీల నుంచి కొత్త‌గా బీజేపీలో చేరిన నాయ‌కులు చాలా పోటీ ప‌డ్డారు. కానీ, చివ‌ర‌కు ఆర్ఎస్ఎస్ నేప‌థ్యం ఉండి, పార్టీలో చిన్న కార్య‌క‌ర్త‌గా మొద‌లై ఎంపీగా ఎదిగిన బండి సంజ‌య్‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించారు. ఈ విష‌యంలో పార్టీ సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి, నిబ‌ద్ధ‌త‌తో ఉన్న నేత‌కే పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వ‌డంతో ఈ ప‌ద‌వి ఆశించిన కొత్త నేత‌లు కొంత అసంతృప్తికి గురయ్యారు.

ఇప్పుడు పార్టీ రాష్ట్ర క‌మిటీలోనూ ఇలానే జ‌రిగింది. బండి సంజ‌య్ త‌న కొత్త టీమ్‌ను ప్ర‌క‌టించారు. ఇందులో కొత్త‌గా పార్టీలో చేరి ప‌ద‌వులు ఆశించిన వారిని మొండిచేయి ల‌భించింది. ముందునుంచీ పార్టీలో ప‌ని చేస్తున్న వారికే ఎక్కువ‌గా ప‌ద‌వులు ద‌క్కాయి. ఎనిమిది మంది ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులను నియ‌మించ‌గా మాజీ మంత్రి విజ‌య‌రామారావు, బండ్రు శోభారాణి మిన‌హా మిగ‌తా వారంతా చాలా కాలంగా బీజేపీలో కొన‌సాగుతున్న వారే ఉన్నారు.

న‌లుగురు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల్లో అంద‌రూ ముందునుంచీ బీజేపీలో ప‌ని చేస్తున్న వారే. వీరిలో బీజేపీ మాజీ జాతీయ అధ్య‌క్షులు బంగారు ల‌క్ష్మ‌ణ్ కూతురు బంగారు శృతి కూడా ఉన్నారు. కొత్త క‌మిటీలోని ఎనిమిది మంది కార్య‌ద‌ర్శుల్లో ఇద్ద‌రు మిన‌హా మిగ‌తా వారంతా చాలా కాలంగా బీజేపీలో ఉంటున్న వారే. వివిధ మోర్చాల అధ్య‌క్షుల్లోనూ కొత్త వారికి ఛాన్స్ ద‌క్క‌లేదు.

రాష్ట్ర క‌మిటీ నియామ‌కం ద్వారా పార్టీ జెండా మోసిన వారికే ప‌దువులు ద‌క్కుతాయ‌ని, పారాష్యుట్‌తో కొత్తగా వ‌చ్చిన నేత‌లు ప‌ద‌వుల కోసం ఎదురు చూడాల్సిందేన‌ని బీజేపీ స్ప‌ష్ట‌త ఇచ్చిన‌ట్ల‌యింది.

నిజానికి ఇటీవ‌ల చాలా మంది టీడీపీ, కాంగ్రెస్ నేత‌లు బీజేపీలో చేరారు. పెద్దిరెడ్డి, పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి, బాబూమోహ‌న్‌, బొడిగె శోభ వంటి వారు చాలా మంది ఇత‌ర పార్టీల్లో కీలక ప‌ద‌వుల్లో, ప్ర‌జా ప్ర‌తినిధులుగా ప‌ని చేసి బీజేపీలో చేరారు. వీరికి పార్టీ రాష్ట్ర క‌మిటీలో చోటు ద‌క్క‌లేదు. పాత వారికి మాత్ర‌మే బండి సంజ‌య్ ఛాన్స్ ఇచ్చారు.

మ‌రోవైపు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌లపై న‌జ‌ర్ పెట్టిన బీజేపీ రాష్ట్ర క‌మిటీలోనూ గ్రేటర్ నేత‌ల‌కు పెద్దపీట వేసింది. అయితే, బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సిఫార్సు చేసిన వారికి మాత్రం ఒక్క‌రికి కూడా రాష్ట్ర క‌మిటీలో చోటు ద‌క్క‌లేద‌ని ఆయ‌న బాహాటంగానే అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.

 

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   4 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   5 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   an hour ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   8 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   8 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   24 minutes ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   10 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle