కొత్త చట్టం వల్లనే 'కోటి' బేరం బెడిసికొట్టిందా?
10-09-202010-09-2020 10:24:56 IST
Updated On 10-09-2020 12:16:42 ISTUpdated On 10-09-20202020-09-10T04:54:56.785Z10-09-2020 2020-09-10T04:54:47.450Z - 2020-09-10T06:46:42.448Z - 10-09-2020

రెవెన్యూ విభాగంలో వేళ్లూనుకున్న అవినీతిని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతోపాటు నూతన రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టింది. అయితే ఇదే రోజు మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (ఏసీ) నగేశ్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం.. లంచావతారమెత్తిన సదరు అధికారి భారీ డీల్ వెలుగులోకి రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అవినీతి బాగోతంలో ఏసీతోపాటు నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ సత్తార్, సర్వేల్యాండ్ జూనియర్ అసిస్టెంట్ వాసిం అహ్మద్‌ను రాత్రి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112.21 ఎకరాల వ్యవసాయ భూమికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ) కో సం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన లింగమూర్తి ఇటీవల అడిషనల్ కలెక్టర్ (ఏసీ) నగేశ్‌ను ఆశ్రయించాడు. ఎకరాకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.1.12 కోట్లు ఇవ్వాలని ఏసీ డిమాండ్ చేశారు. ఈ మేరకు వివిధ దశల్లో ఇప్పటివరకు రూ.40 లక్షలు ముట్టినవి. మిగిలిన రూ.72 లక్షలకు బదులుగా ఐదెకరాల భూమి ఇచ్చేందుకు అంగీకరించినా పని ముందుకు కదలకపోవడంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ దర్యాప్తులో అడిషనల్ కలెక్టర్ మొదలు వీఆర్వో స్థాయి వరకూ ఈ కేసులో సంబంధం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం 12ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఆడియో టేప్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆడియోలో బాధితుడిని నగేష్ లంచం డిమాండ్ చేయడమే కాకుండా ఎంత అడిగానో తనకు క్లారిటీ ఉందని చెప్పడం గమనార్హం. మరోవైపు ఆర్డీవో అరుణారెడ్డి నివాసంలోనూ ఏసీబీ సోదాలు ముగిశాయి. ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున నగలు, నగదును అధికారులు గుర్తించారు. పెద్ద చేపలు ఎలా దొరికాయంటే.. 112 ఎకరాల వ్యవసాయ పొలం.. ఎన్వోసీ ఎకరానికి లక్ష చొప్పున మొత్తం రూ.1.12 కోట్ల బేరం కుదిరింది. అడిషనల్ కలెక్టర్ నగేశ్ నుంచి వీఆర్ఏ దాకా అంతా అనుకూలంగా పనిచేసేందుకు రూ.40 లక్షల నగదు, మరో రూ.72 లక్షల విలువ చేసే స్థలం అడిషనల్ కలెక్టర్‌కు అదనపు బహుమతి.. అంతా బానే ఉంది. వాస్తవానికి ఈ డీల్ దాదాపుగా పూర్తికావొచ్చింది. కానీ, ఆఖరు నిమిషంలో ఏదో తేడా వచ్చింది. అధికారులపై ఫిర్యాదుదారుడికి ఎందుకు అనుమానమొచ్చింది అందరి మదిలోనూ ఇదే ప్రశ్న. విశ్వసనీయవర్గాల ప్రకారం.. ఈ మొత్తం డీల్ రద్దవడానికి, రద్దయిన డీల్ వ్యవహారం అవినీతి నిరోధకశాఖ దాకా వెళ్లడానికి అసలైన కారణం కొత్త చట్టమే అని సమాచారం. కొత్తచట్టంలో అధికారాలకు కోత పెడుతున్నారన్న ప్రచారమే రెవెన్యూ అధికారులను ఏసీబీకి పట్టించిందని సమాచారం. బాధితుడు తన పనికోసం అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నా.. వారు పని నెమ్మదిగా చేయసాగారు. ఈలోపు అసెంబ్లీ సమావేశాలు ఖరారు కావడం, తొలిరోజే కేబినెట్ సమావేశంలో రెవెన్యూ చట్టానికి ఆమోదం తెలపడంతో బాధితుల్లో అధికారుల తీరుపై అనుమానాలు చెలరేగాయి. అధికారులు ఈ పని చేసినా.. చెల్లుబాటు అవుతుందా అన్న అనుమానాలు రోజురోజుకూ పెరిగిపోయాయి. కానీ, ఈ వ్యవహారంతో సంబంధమున్న అధికారులు మాత్రం పనిపై ధీమాగానే ఉన్నారు. అయితే, మంగళవారం వీఆర్వో వ్యవస్థ రద్దు కావడం, భూరికార్డులు స్వాధీనం చేసుకోవడంతో బాధితులకు ఈ పని కాదని తేలిపోయింది. అందుకే, తాను అధికారులతో మాట్లాడిన ఆడియోటేపులు, చెక్కులు, డాక్యుమెంట్లు తీసుకుని నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించాడని సమాచారం. కీసర ఎమ్మార్వో సామాన్యుడు కాదు..

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
an hour ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
2 hours ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
2 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
3 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
4 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
4 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
21 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
a day ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
22-04-2021
ఇంకా