newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కొత్త ఇంట్లో సీఎం కేసీఆర్ సంక్రాంతి సంబురాలు!

17-01-202017-01-2020 09:00:42 IST
2020-01-17T03:30:42.169Z17-01-2020 2020-01-17T03:30:38.770Z - - 20-04-2021

కొత్త ఇంట్లో సీఎం కేసీఆర్ సంక్రాంతి సంబురాలు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఎం కేసీఆర్ కొత్త ఇంట్లో ఈ ఏడాది సంక్రాంతి సంబురాలు చేసుకున్నారు. అదేంటి అయనకి ఇప్పటికే బంగ్లాలాంటి ఇల్లు ఉంది.. పైగా రాష్ట్రం వచ్చాక ప్రగతి భవన్ కట్టుకున్నారు. అందులో ఉండే సెంటిమెంట్ ప్రకారమే ఆయన మరోసారి సీఎం అయ్యారని నమ్ముతారు కదా ఇప్పుడు కొత్తఇల్లు ఏంటి అనుకుంటున్నారా?!. అదంతా నిజమే కానీ అయనకి ఎర్రవల్లి ఫామ్ హౌస్ మీద ఉన్న ప్రేమ వీటి వేటి మీద ఉండదంటారు.

అవును, సీఎం కేసీఆర్ అక్కడకి చేరితే పూర్తిగా మారిపోతారు. నెత్తి మీద రౌండ్ కాప్ ధరించిన దృశ్యాలన్నీ ఎక్కువగా అక్కడ నుండి వచ్చినవే. అక్కడ ఇప్పటికే వ్యవసాయ క్షేత్రం ఉన్నా ఈ మధ్యనే సీఎం అక్కడ అయనకి నచ్చిన రీతిలో.. అయన ఆసక్తికి తగిన విధంగా ఒక బంగ్లాను అక్కడ కట్టించుకున్నారు. అందులో అది ఉంది.. ఇది లేదు అని లేకుండా సకల హంగులను ఏర్పాటు చేసుకున్నారు.

ఇక్కడ విశాలమైన ఇంటితో పాటు లిఫ్ట్, అందులోనే మీటింగ్ హాల్స్, డైనింగ్ హాల్, ముఖ్యమైన అతిథులు ఎవరైనా వస్తే బస చేసేందుకు వీలుగా గెస్ట్ హౌజ్‌ ఇలా సకల సదుపాయాలతో సర్వంగా సుందరంగా ఈ కొత్త ఇంటి నిర్మాణం చేసినట్లు తెలుస్తోంది. ఇది కేసీఆర్ కొంతకాలంగా దగ్గర ఉండి.. అయన పర్యవేక్షణలోనే పక్క వాస్తులూ.. సౌకర్యాలలో కాంప్రమైజ్ కాకుండా నిర్మించారట.

ఇందులో డిసెంబర్ నెలలోనే గృహప్రవేశం చేసి హోమం కూడా నిర్వహించారు. డిసెంబర్ 15 తర్వాత అనుకున్నంత శుభదినాలు లేవని పండితులు చెప్పడంతో అప్పుడే శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసిన సీఎం అక్కడే ఒక రాత్రి బస చేసి వచ్చారు. అయితే అప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు పూర్తికాలేదు. కొంతమేర పనులు చేయించి హోమాలు నిర్వహించారు.

ఇక ఇప్పుడు ఆ ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి కావడంతో సీఎం సంక్రాంతి సంబురాలు అక్కడే జరుపుకున్నారు. జనవరి 12 తర్వాత శుభఘడియలని పండితుల సలహా మేరకు సీఎం కేసీఆర్ గత మూడు రోజులుగా అక్కడే గడిపారు. గురువారంతో మూడు రాత్రులు అక్కడే గడిపి శుక్రవారం ఉదయం హైదరాబాద్ తిరిగి వచ్చారు. త్వరలోనే అక్కడ భారీ స్థాయిలో హోమం నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది.

కాగా, డిసెంబర్ నెలలో గృహప్రవేశానికి కూడా అతి కొద్ది మందికే ఆహ్వానం అందగా ఈసారి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే అక్కడకి ప్రవేశం ఇచ్చారు. కాగా త్వరలో జరిపించనున్న హోమానికి ముఖ్య అతిధులకు ఆహ్వానం అందనుండగా మరోసారి అక్కడ కుటుంబంతో సీఎం కేసీఆర్ కొన్ని రోజుల పాటు ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

 

 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   13 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   13 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   17 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   14 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   21 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   21 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   15 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle