newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కొత్తరెవెన్యూ చట్టం బిల్లు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. ప్రయోజనాలివే

09-09-202009-09-2020 15:20:09 IST
Updated On 09-09-2020 15:38:48 ISTUpdated On 09-09-20202020-09-09T09:50:09.237Z09-09-2020 2020-09-09T09:50:07.362Z - 2020-09-09T10:08:48.698Z - 09-09-2020

కొత్తరెవెన్యూ చట్టం బిల్లు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. ప్రయోజనాలివే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ సీఎం కేసీఆర్ అనుకున్నంత పనీ చేశారు. నిజానికి రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను గతేడాదే రద్దు చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు తొలిరోజు అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్..వరుసగా మూడోరోజు అసెంబ్లీ సమావేశాల్లో వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. బుధవారం ఉదయం ప్రారంభమైన మూడోరోజు అసెంబ్లీ సెషన్స్ లో సీఎం కేసీఆర్ వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లుతో పాటు, కొత్త రెవెన్యూ చట్టం బిల్లులను ప్రవేశపెట్టారు. ఆ వెంటనే మంత్రికేటీఆర్ మున్సిపల్ సవరణ బిల్లు, మంత్రి ఎర్రబెల్లి పంచాయతీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.

కొత్త రెవెన్యూ చట్టం బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన అనంతరం కేసీఆర్ ఆ చట్టం వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం వల్ల వీఆర్వోలకు ఎలాంటి నష్టం ఉండబోదన్నారు. వీఆర్వోలను వేరే విభాగాలకు కేటాయించడంతో పాటు వారి జీతాలను కూడా పెంచనున్నట్లు వెల్లడించారు. ఇటీవల కాలంలో వీఆర్వోలపై ప్రజలు తిరగబడటం, ఒకానొక సందర్భంలో వీఆర్వోపై హత్యా ప్రయత్నం, అలాగే ప్రజల నుంచి వీఆర్వోలు లంచాలు తీసుకుంటూ పట్టుబడటం వంటి ఘటనల గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కొత్త రెవెన్యూ చట్టం వల్ల ప్రజలకు భద్రతతో పాటు రాష్ట్రంలో అవినీతి కూడా తగ్గుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే రాష్ట్రంలో రెవెన్యూ కోర్టులను తీసివేసి దాని స్థానంలో ట్రిబ్యునల్ పోర్టల్ ను ఆవిష్కరిస్తామన్నారు. ధరణి పేరుతో ఆవిష్కరించే పోర్టల్ లో రెండు విభాగాలుంటాయని తెలిపారు. ఒకటి అగ్రికల్చర్, రెండు నాన్ అగ్రికల్చర్. ఈ పోర్టల్ ద్వారా తప్పుడు భూములకు రిజిస్ట్రేషన్లు చేసే అవకాశాలుండవని, తద్వారా రాష్ట్రంలో భూ కబ్జాలను కూడా నివారించవచ్చని సీఎం కేసీఆర్ వివరించారు. అలాగే ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో పంచాయ‌తీ, పురపాలిక‌, న‌గ‌ర‌పాలిక‌, జీహెచ్ఎంసీ ఆస్తుల వివ‌రాలు ఉంటాయని, ఎవరెక్కడున్నా ఉన్నచోటి నుంచే ఆస్తుల వివరాలను పోర్టల్ లో చూసుకోవచ్చన్నారు.

వీఆర్వోలకు జాయింట్ రిజిస్ర్టార్లుగా ప్రమోషన్

వీఆర్వోల వ్యవస్థ రద్దుతో తెలంగాణలో వీఆర్వోల స్థానాలకు చెక్ పెట్టినట్లయింది. అయితే ఇప్పటి వరకూ వీఆర్వోలుగా ఉన్నవారు ఇకపై జాయింట్ రిజిస్ట్రార్లుగా ఉంటారని, వారికి వ్యవసాయ భూములు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేసే హక్కుంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రమే జరిగేలా చర్యలు చేపట్టామన్నారు.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   11 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   13 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   20 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle