newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

కొడంగ‌ల్‌పై ఆశ‌లు వ‌దిలేసుకోవాల్సిందేనా..?

31-01-202031-01-2020 08:07:53 IST
Updated On 31-01-2020 13:30:37 ISTUpdated On 31-01-20202020-01-31T02:37:53.049Z31-01-2020 2020-01-31T02:36:24.384Z - 2020-01-31T08:00:37.264Z - 31-01-2020

కొడంగ‌ల్‌పై ఆశ‌లు వ‌దిలేసుకోవాల్సిందేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాజ‌కీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా ముద్ర ప‌డ్డ రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. ఇటీవ‌లి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డికి గ‌ట్టి షాక్ ఇచ్చింది టీఆర్ఎస్‌. ఆయ‌న ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించి ప్ర‌చారం చేసిన అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో కాంగ్రెస్ పార్టీ ఓట‌మి పాల‌య్యింది. అన్నింటి కంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్వంత నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్‌లోని రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కొడంగ‌ల్‌లో రేవంత్ రెడ్డి ప‌ట్టు స‌డ‌లుతుంద‌ని చెప్ప‌డానికి ఈ ఫ‌లితాలు ఉదాహ‌ర‌ణ‌గా క‌నిపిస్తున్నాయి.

స్వంత నియోజ‌క‌వ‌ర్గం కాక‌పోయినా కొడంగ‌ల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప‌నిచేసిన రేవంత్ ఇదే నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గంగా మార్చుకున్నారు. 2009, 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ త‌ర‌పున గెలిచిన రేవంత్ కొడంగ‌ల్‌ను త‌న అడ్డాగా మార్చుకున్నారు. రేవంత్‌ను దెబ్బ కొట్టేందుకు గానూ కొడంగ‌ల్‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన టీఆర్ఎస్ 2018 ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను ఓడించింది. త‌న‌కు ఎదురేలేద‌నుకున్న కొడంగ‌ల్‌లో రేవంత్ ఓట‌మిని ఎవ‌రూ ఊహించ‌లేదు.

రేవంత్‌పై విజ‌యం సాధించిన టీఆర్ఎస్ అభ్య‌ర్థి ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డి ఇప్పుడు కొడంగ‌ల్‌లో ప‌ట్టు పెంచుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ఓడిన త‌ర్వాత మ‌ల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన రేవంత్ గ‌తంలో మాదిరి కొడంగ‌ల్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్ట‌లేక‌పోతున్నారు. దేశంలోనే పెద్ద నియోజ‌క‌వ‌ర్గ‌మైన మ‌ల్కాజ్‌గిరికి ఎంపీ కావ‌డంతో ఆయ‌న పూర్తి స‌మ‌యం ఇక్క‌డే పెట్టాల్సి వ‌స్తోంది. దీంతో కొడంగ‌ల్ కాంగ్రెస్ క్యాడ‌ర్‌లో కొంత నైరాశ్యం నెల‌కొంది.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రేవంత్‌రెడ్డిని ఓడించిన టీఆర్ఎస్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మ‌రో దెబ్బ కొట్టింది. నియోజ‌క‌వ‌ర్గంలోని ఐదు మండ‌లాల్లో నాలుగు జెడ్పీటీసీల‌ను టీఆర్ఎస్ గెలుచుకుంది. మెజారిటీ ఎంపీటీసీలు గెలుచుకొని అన్ని ఎంపీపీల‌ను టీఆర్ఎస్ కైవ‌ల‌సం చేసుకుంది. ఈ ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డి ప్ర‌చారం చేసినా ఆయ‌న‌కు చేదు ఫ‌లితాలే వ‌చ్చాయి. తాజాగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ ఇవే ఫ‌లితాలు పున‌రావృత‌మ‌య్యాయి.

కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని రెండు మున్సిపాలిటీల‌ను టీఆర్ఎస్ కైవ‌సం చేసుకుంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ రేవంత్ వెళ్లి ప్ర‌చారం చేసినా లాభం లేకుండా పోయింది. క్ర‌మంగా నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ మ‌రింత బ‌ల‌ప‌డుతుండ‌టంతో రేవంత్ రెడ్డి కొడంగ‌ల్‌లో బ‌ల‌హీన‌ప‌డుతున్నారు. దీంతో ఆయ‌న కొడంగ‌ల్‌ను పూర్తిగా వదిలేస్తారు అనే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. వాస్త‌వానికి మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంటు సీటుపై రేవంత్‌కు ఆస‌క్తి ఉంది.

2014లోనే టీడీపీ త‌ర‌పున ఈ సీటు కావాల‌ని ఆయ‌న కోర‌గా అప్పుడు పార్టీ మ‌ల్లారెడ్డికి ఇచ్చింది. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు అనూహ్యంగా అవ‌కాశం రావ‌డంతో ఎంపీగా గెలిచారు. మ‌ల్కాజ్‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఆయ‌న చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

దీంతో ఆయ‌న ఈ పార్ల‌మెంటు ప‌రిధిలోనే ఏదైనా ఒక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకునే అవ‌కాశాలు కూడా లేక‌పోలేదు. ముఖ్యంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో రేవంత్‌కు మెజారిటీ ఇచ్చిన ఉప్ప‌ల్‌, ఎల్బీన‌గ‌ర్‌లో కాంగ్రెస్ పార్టీకి స‌రైన నాయ‌క‌త్వం లేదు.

కొడంగ‌ల్‌ను వ‌దిలేస్తే ఈ రెండింటిలో ఏదైనా నియోజ‌క‌వ‌ర్గాన్ని రేవంత్ ఎంపిక చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. ఏదేమైనా కొడంగ‌ల్ మాత్రం రేవంత్ రెడ్డికి అంత సేఫ్ సీట్ కాద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతుంది.

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   6 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   7 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   9 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   10 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   10 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   11 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   14 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   14 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   15 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   16 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle