కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్
29-05-202029-05-2020 08:31:36 IST
Updated On 29-05-2020 09:33:25 ISTUpdated On 29-05-20202020-05-29T03:01:36.084Z29-05-2020 2020-05-29T03:00:00.303Z - 2020-05-29T04:03:25.786Z - 29-05-2020

తెలంగాణ కల సిద్ధించాక సాగునీటి ప్రాజెక్టులపై తన ఫోకస్ పెట్టారు సీఎం కేసీయార్. కాళేశ్వరం తర్వాత తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభం కానుంది కొండపోచమ్మ. మర్కూక్ పంప్ హౌస్. గోదావరి జలాలకు స్వాగతం పలకనున్నారు కేసీఆర్. ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు చినజీయర్ స్వామి. కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే నా లక్ష్యం అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిజం కానున్న అపురూప క్షణాలకు ముహూర్తం ఖరారయ్యింది. మీట నొక్కి డమే తరువాయి గోదావరి జిల్లాలు కొండపోచమ్మ రిజర్వాయర్ లోకి చేరనున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చివరిదైన కొండపోచమ్మ రిజర్వాయర్ కి మర్కుక్ గ్రామం దగ్గర ఏర్పాటుచేసిన నీటిని ఎత్తి పోసే పంప్ హౌస్ లాంఛనంగా ప్రారంభించనున్నారు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్.

సముద్రమట్టానికి వందల మీటర్ల ఎత్తుకు గోదారమ్మను తరలించి చరిత్ర సృష్టించారు. అసాధ్యమనుకున్న నీటి తరలింపును సుసాధ్యం చేశారు. అపర భగీరథుని వలే వందల మీటర్ల ఎత్తుకు నీటిని తరలించే మహా క్రతువును పూర్తి చేశారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఈ రిజర్వాయర్ నిర్మించడం తో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రిజర్వాయర్ ద్వారా ఐదు జిల్లాలకు సాగునీరు అందనుంది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ యాదాద్రి జిల్లాలలో రైతులకు నీరు అందనుంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నాలుగవ లింక్ లోని, 14వ ప్యాకేజీలో భాగంగా సముద్ర మట్టానికి 510 మీటర్ల ఎత్తులో 1.600కోట్ల రూపాయల వ్యయంతో, 15 టీఎంసీల సామర్థ్యంతో రికార్డు సమయంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ కోండపోచమ్మ రిజర్వాయర్ పనులు పూర్తి చేసింది. కరువు కాటకాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సిద్దిపేట జిల్లా ఇప్పుడు రిజర్వాయర్లలో నిండుకుండను తలపిస్తోంది.
కరువు కాటకాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంత రైతులు వేరే ప్రాంతాలకు కు వలస వెళ్లారు. వ్యవసాయం దండగ అని భావించిన రైతులు భార్యా పిల్లలతో బస్తీలో బతుకుదామని బయలుదేరి వెళ్లిన వాళ్ళ కుటుంబాలు వేలలో ఉంటాయంటే అతిశయోక్తి కాదు. కాలేశ్వరం ప్రాజెక్టు తో ఈ ప్రాంత రైతులకు నీరు అందిస్తామని అంటే, ఒకప్పుడు రైతులు నమ్మ లేదనే చెప్పుకోవాలి. వర్షాలు బాగా పడితే ఒక పంట పండించుకునే వారు.

ఇలాంటి కరువు కాటకాలకు కేరాఫ్ అడ్రస్ అయిన గజ్వేల్ రైతులకు కొండపోచమ్మ రిజర్వాయర్ సంవత్సరం పొడవునా సాగునీరు అందనుంది. అక్కారం పంప్ హౌజ్‌లో ఆరు పంపులును ఏర్పాటు చేసారు... ఒక్కో పంపు 27 మెఘావాట్ల సామర్థ్యం కల్గిఉంది. ఇవి రోజుకు 1200 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తాయి...అక్కారం నుండి మర్కుక్ 13 కిలో మీటర్ల దూరముంటుంది. మూడు కిలో మీటర్లు పైప్‌ల ద్వారా.. మిగతా నీటిని ఓపెన్ కాలువల ప్రవహిస్తుంది. మర్కుక్ పంపింగ్ స్టేషన్ వద్ద ప్రస్తుతం గోదావరి జలాలు సిద్ధంగా ఉన్నాయి. వీటిని నేరుగా కొండపోచమ్మలోకి ఎత్తిపోస్తారు. ఇప్పటికే డ్రైరన్ కూడ పూర్తైంది. ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తే వెట్ రన్ నిర్వహించి కొండపోచమ్మలోకి నీటిని విడుదల చేస్తారు.
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో మేఘా ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ఈ కొండ పోచమ్మ సాగర్ నిర్మాణం జరిగింది. 15 టిఎంసిల సామర్థ్యంను ఈ ప్రాజెక్ట్ ను కేవలం మూడు సంవత్సరాల్లోనే నిర్మాణం పూర్తైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా దీనిని నిర్మించారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రస్తుతం గోదావరి జలాలతో నిండుకుండలా కలకలలాడుతుంది. రంగనాయక సాగర్ నుండి గోదావరి నీటిని నేరుగ మల్లన్నసాగర్‌కు నీటిని విడుదల చేశారు. అయితే మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇంకొంత కావాల్సి ఉంది.
ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఊహించింది. దీంతో మల్లన్నసాగర్ నుండి కొండ పోచమ్మ వరకూ 18 కిలో మీటర్ల మేర ప్రత్యేక కాలువ తవ్వించారు. ఇప్పటికే రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నుండి మల్లన్నసాగర్ సర్జ్పూల్కు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఈ నీటిని ఒక పంపు ద్వారా నేరుగా మల్లన్నసాగర్ కాలువలోకి ఎత్తిపోశారు. అక్కడి నుండి ఈ నీరు కొండపోచమ్మ రిజర్వాయర్ సమీపంలోని అక్కారం పంప్‌హౌస్‌కు చేరుకున్నాయి. ఇక్కడి నుండి మర్కుక్ పంప్‌హౌస్‌కు గోదావరి జలాలు చేరుకోనున్నాయి.

అక్కారం పంప్ హౌజ్‌లో ఆరు పంపులును ఏర్పాటు చేసారు. ఒక్కో పంపు 27 మెగావాట్ల సామర్థ్యం కల్గిఉంది. ఇవి రోజుకు 1200 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తాయి...అక్కారం నుండి మర్కుక్ 13 కిలో మీటర్ల దూరముంటుంది. మూడు కిలో మీటర్లు పైప్‌ల ద్వారా.. మిగతా నీటిని ఓపెన్ కాలువల ద్వార ప్రవాహం రూపంలో నీరు వెళుతుంది. మర్కుక్ పంపింగ్ స్టేషన్ వద్ద ప్రస్తుతం గోదావరి జలాలు సిద్ధంగా ఉన్నాయి. వీటిని నేరుగా కొండపోచమ్మలోకి ఎత్తిపోస్తారు. ఇప్పటికే డ్రైరన్ కూడా పూర్తైంది.
ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తే వెట్ రన్ నిర్వహించి కొండపోచమ్మలోకి నీటిని విడుదల చేస్తారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నీటి సామర్థ్యం 15 టిఎంసిలు. రిజర్వాయర్ నిర్మాణం కోసం గాను 4,636 ఎకరాల భూమిని సేకరించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా బైలంపూర్, తానేదార్పల్లి, మామిడ్యాల గ్రామాలు పూర్తిగా మునుగుతున్నాయి.
ఈ ప్రాజెక్టు నిర్మాణం మూడేళ్లలోనే పూర్తి చేసింది మేఘ సంస్థ... ప్రస్తుతం పనులు పూర్తయ్యాయి. నీటిని నింపడమే తరువాయి. ఇది ఐదు జిల్లాలోని 2 లక్షల 85 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాలను సస్యశ్యామలం కానున్నాయి. దీనికి ఎనిమిది ప్రధాన కాలువలున్నాయి. గోదావరి జలాలు కొండపోచమ్మను చేరితే సముద్రమట్టానికి అత్యంత ఎత్తైన ప్రదేశానికి చేరినట్లే. కాళేశ్వరం వద్ద 85 మీటర్ల ఎత్తులో ఉండగా కొండపోచమ్మ 690 మీటర్ల ఎత్తులో ఉంది. గోదావరి నీరు కొండపోచమ్మను చేరడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం పూర్తవుతుంది. దీని ద్వారా ఇతర చెరువు కుంటలు, చిన్న చిన్న రిజర్వాయర్లను నింపుకోవాల్సి ఉంది. ఎనిమిది ప్రధాన కాలువల ద్వారా ఈ నీరు ఐదు జిల్లాలకు చేరుతుంది.
కొండపోచమ్మ రిజర్వాయర్‌కు నీరు విడుదల చేయడంతో ఇక్కడ రైతుల ఆనందానికి అవధులు లేవు. వందల సంవత్సరాలుగా కరువుకాటకాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు ఇప్పుడు గోదావరి జలాలను చూసి మైమర్చిపోతున్నారు. కెసిఆర్ తమ ప్రాంత ఎమ్మెల్యే కావడం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం చాలా సంతోషం గా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ తర్వాతి తరాలు కూడా ఎలాంటి కరువుకాటకాలు లేకుండా మూడు పంటలు వేసుకుని సంతోషంగా జీవిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాల మట్టం పెరుగుతుండడంతో బోరు బావుల్లో నీటి లభ్యత కూడా పెరుగుతుందని అంటున్నారు రైతులు.
సీఎం కేసీయార్, ఈప్రాంత వాసుల దశాబ్దాల కల నెరవేరనుంది. నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. కోటి ఎకరాల మాగాణి చేయడమే లక్ష్యంగా మరో ఉద్యమం సాగింది. కాలేశ్వరం ప్రాజెక్టు అంకురార్పణ జరిగింది. అనతికాలంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది. సవాలక్ష సవాళ్లను అధిగమించి, అనుమతులను సాధించి, స్వప్నాన్ని సాకారం చేసింది తెలంగాణ ప్రభుత్వం. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కృషి అనన్య సామాన్యం. భవిష్యత్తులో కరువు కాటకాలకు అవకాశమే లేకుండా చేసి.... భగవంతుడు సృష్టికి ప్రతి సృష్టి చేసింది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టు తో తెలంగాణ రైతుల నుదుటి రాత మారనుంది.



ఏపీలో స్కూల్స్ బంద్
an hour ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
34 minutes ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
5 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
6 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
2 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
9 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
9 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
an hour ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
3 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
9 hours ago
ఇంకా