newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కొండా దంప‌తులు అలా ఫిక్స్ అయ్యారు..!

16-01-202016-01-2020 09:06:07 IST
2020-01-16T03:36:07.034Z16-01-2020 2020-01-16T03:34:38.261Z - - 19-04-2021

కొండా దంప‌తులు అలా ఫిక్స్ అయ్యారు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొండా దంప‌తులు... రాష్ట్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు ఫైర్ బ్రాండ్‌గా నిలిచిన నేత‌లు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కొన్నేళ్ల పాటు చ‌క్రం తిప్పారు. రాజ‌కీయంగా వేగంగా నిర్ణ‌యాలు తీసుకోగ‌లిగే కొండా దంప‌తుల‌కు ఇప్పుడు త‌మ‌కంటూ ఒక నియోజ‌క‌వ‌ర్గం కూడా ఎంచుకోలేక‌పోతున్నారు.

జిల్లా రాజ‌కీయాల్లో త‌మ ప్ర‌భావాన్ని క్ర‌మంగా కోల్పోతున్నారు. అయితే, ఇప్పుడు వారు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని, త‌మ‌కంటూ నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎంచుకున్నార‌ని చెబుతున్నారు. కాగా, వారి స్వంత నియోజ‌క‌వ‌ర్గం ప‌ర‌కాల‌ను ఇక కొండా దంప‌తులు వ‌దిలేసిన‌ట్లే లెక్క‌.

కాంగ్రెస్‌లో ఒక‌ప్పుడు వెలుగు వెలిగిన కొండా దంప‌తులు త‌మ‌కు రాజకీయంగా గుర్తింపును ఇచ్చిన వైఎస్సార్ కుటుంబం కోసం మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌ను కోల్పోయి ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వెంట న‌డిచారు. అప్ప‌టి నుంచి వీరికి క‌ష్టాలు ప్రారంభ‌మ‌య్యాయి.

త‌ర్వాత వైసీపీకి దూర‌మై అనూహ్యం వారు ఎంత‌గానో వ్య‌తిరేకించిన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో త‌మ స్వంత నియోజ‌క‌వ‌ర్గం ప‌ర‌కాల‌ను వ‌దులుకొని టీఆర్ఎస్ పార్టీ సూచించిన విధంగా కొండా సురేఖ వ‌రంగ‌ల్ ఈస్ట్ నుంచి పోటీ చేసి గెలిచారు.

ఆ త‌ర్వాత ఐదేళ్ల పాటు మ‌ళ్లీ ఎమ్మెల్యేగా వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క‌మ‌య్యారు. ఒకానొక స‌మ‌యంలో ఆమెకు మంత్రి ప‌ద‌వి కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంతా భావించారు. దీంతో కొండా దంప‌తుల‌కు మ‌ళ్లీ పాత రోజులు వ‌చ్చిన‌ట్లే అని వారు అనుచ‌రులు సంబ‌ర‌ప‌డ్డారు. కానీ, హ‌రీష్‌రావు వ‌ర్గంగా ముద్ర ప‌డిన వారికి 2018 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ క‌నీసం టిక్కెట్ కూడా ఇవ్వ‌లేదు. దీంతో కాంగ్రెస్‌లోకి వెళ్లి మ‌ళ్లీ ప‌ర‌కాల నుంచి పోటీ చేశారు.

ఇక్క‌డే వారు రాజ‌కీయంగా పొర‌పాటు నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌ళ్లీ త‌మ స్వంత నియోజక‌వ‌ర్గం ప‌ర‌కాల అయితే సులువుగా గెల‌వ‌వ‌చ్చు అనుకున్నారు. కానీ, 2014 నుంచి 2018 వ‌ర‌కు ఎమ్మెల్యేగా ప‌ని చేసిన చ‌ల్లా ధ‌ర్మారెడ్డి ప‌ర‌కాల‌లో బాగా బ‌లం సంపాదించారు. ఒక‌ప్పుడు కొండా దంప‌తుల‌కు నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన వ‌ర్గంగా ఉన్న నేత‌లంతా చ‌ల్లా వైపు వెళ్లారు. దీంతో ప‌ర‌కాల నుంచి గ‌త ఎన్నిక‌ల్లో కొండా సురేఖ ఓట‌మి పాల‌య్యింది.

ఆ త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె అంత చురుగ్గా ఉండ‌టం లేదు. కాగా, ఇప్పుడు వీరు ప‌ర‌కాల‌ను వీడాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆమె ఎమ్మెల్యేగా ప‌నిచేసిన వ‌రంగ‌ల్ ఈస్ట్‌కే మ‌ళ్లీ వెళ్లాల‌ని భావిస్తున్నారు. ఇక్క‌డ కాంగ్రెస్ నుంచి ఎవ‌రూ స‌రైన నేత లేరు. దీంతో ఈస్ట్‌కు వెళితే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బ‌ల‌ప‌డ‌వ‌చ్చ‌ని కొండా సురేఖ భావిస్తున్నారు. ఇక‌, కొండా ముర‌ళి సైతం వచ్చేసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఆయ‌న భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకున్నారు. ఇక్క‌డ కూడా కాంగ్రెస్‌కు స‌రైన నేత లేరు. కాంగ్రెస్ నుంచి గెలిచిన గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు. దీంతో కొండా ముర‌ళి ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకున్నారు. భూపాల‌ప‌ల్లిలో కొండా దంప‌తుల‌కు ప్ర‌త్యేకంగా వ‌ర్గం ఉంది. దీంతో ఇప్పటి నుంచే దృష్టి పెడితే ఎన్నిక‌ల నాటికి భూపాల‌పల్లిలో గెల‌వ‌వ‌చ్చ‌ని వారు భావిస్తున్నారు.

ఇప్పటికే ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ బాధ్య‌త‌ల‌ను వీరే తీసుకున్నారు. ఇటీవ‌ల మ‌ళ్లీ రాజ‌కీయంగా యాక్టీవ్ అవుతున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ పార్టీ అభ్య‌ర్థులను గెలిపించుకునేందుకు తీవ్రంగానే ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే, భూపాల‌ప‌ల్లిని ముర‌ళి, వ‌రంగ‌ల్ ఈస్ట్‌ను సురేఖ ఎంచుకుంటే ప‌ర‌కాల‌ను పూర్తిగా వ‌దిలేసిన‌ట్లే లెక్క‌. కాగా, త‌మ వార‌సురాలు సుశ్మిత‌ను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని క‌ల‌లు క‌న్న కొండ దంప‌తులు ఇప్పుడు ఆ ఆలోచ‌న‌ను సైతం వాయిదా వేసుకున్నారు.

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   an hour ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   an hour ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   5 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   7 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   2 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   9 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   9 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   2 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   3 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   10 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle