newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ .. సంక్రాంతికి సమ్ థింగ్ స్పెషల్

14-01-202014-01-2020 08:41:22 IST
2020-01-14T03:11:22.258Z14-01-2020 2020-01-14T03:11:01.542Z - - 25-02-2020

కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ .. సంక్రాంతికి సమ్ థింగ్ స్పెషల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంక్రాంతి అంటే సందడి. తెలంగాణలో సంక్రాంతిలో రంగురంగుల పతంగులు ఎగురుతాయి. చిన్నాపెద్దా తేడాలేకుండా కైట్స్ ఎగరేస్తారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పతంగాలు,స్వీట్ల పండుగకు వేదికైంది. భిన్నత్వంలో ఏకత్వం భారత్ గొప్పదనం అనీ హైదరాబాద్‌ మినీ ఇండియా లాంటిదని కేటీఆర్ అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రం పౌరులైనా హైదరాబాద్‌ను తమకు సొంతింటిలా భావిస్తారన్నారు.

సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌... కైట్‌ ప్రదర్శనను తిలకించారు. దాదాపు 20 దేశాల నుంచి వచ్చిన కైట్ ఫ్లేయర్స్‌కు కేటీఆర్ స్వాగతం పలికారు. 

ప్రజలకు కేటీయార్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో వివిధ రాష్ట్రాల సంస్కృతులు వున్నాయన్నారు. ఐదు సంవత్సరాలుగా కైట్ ఫెస్టివల్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక శాఖను మంత్రి అభినందించారు. కుటుంబంతో వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేలా చేసిన ఏర్పాట్లకు ఆయన ముగ్ధులయ్యారు. అహ్మదాబాద్ కంటే ఘనంగా కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని… దేశంలోనే కైట్ ఫెస్టివల్ లాంటి కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్ మారిందన్నారు. 

హైదరాబాద్ లో పతంగుల పండుగకు ఎంతో చరిత్ర వుంది. హైదరాబాద్‌ నగరం ఏర్పడినప్పటి నుంచే అంటే 400 ఏళ్ళ నుంచి కైట్ ఫెస్టివల్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కుతుబ్‌ షాహీల కాలం నుంచి ప్రతి ఏటా హేమంత రుతువులో నగరంలో పతంగుల పండుగ కొనసాగుతుంది.  ఇబ్రాహీం కులీకుతుబ్‌ షా హయాంలో గోల్కొండ కోటలో పతంగుల పండుగ జరుగుతుండేది.

ఆరవ నిజాం మీర్‌ మహబూబ్‌ అలీ ఖాన్‌ పాలనా కాలంలో పతంగుల పండుగకు మరింత గుర్తింపు వచ్చింది. మైదానాల్లో పతంగుల పోటీలు నిర్వహించి ఎక్కువ పతంగులను పడగొట్టిన వారికి బహుమతులు కూడా ఇచ్చేవారు. 1985 వరకు పాతబస్తీలో ప్రతి ఏటా పతంగుల పోటీలు నిర్వహించారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పోటీలు జరుగుతున్నాయి..

గతంలో కంటే పతంగులు ఎగరేసే ఉత్సాహం తగ్గిందనే చెప్పాలి. హైదరాబాద్ లో జరిగే పతంగుల వేడుకకు విదేశాలనుంచి కూడా ఔత్సాహికులు వస్తుంటారు. ఎన్నో రంగుల పతంగులు వస్తుంటాయి. ఆకాశంలో ఎగురుతుంటే చిన్నారుల కేరింతలు కొడతారు. ట్రెండ్ కి తగ్గట్టుగా పతంగుల డిజైన్లు కనిపిస్తున్నాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle