newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేసుల వృద్దిరేటులో హైదరాబాద్‌కు రెండో స్థానం.. రాష్ట్రంలో 1284 కొత్త కేసులు

19-07-202019-07-2020 10:09:07 IST
Updated On 19-07-2020 11:08:10 ISTUpdated On 19-07-20202020-07-19T04:39:07.482Z19-07-2020 2020-07-19T04:39:03.446Z - 2020-07-19T05:38:10.973Z - 19-07-2020

కేసుల వృద్దిరేటులో హైదరాబాద్‌కు రెండో స్థానం.. రాష్ట్రంలో 1284 కొత్త కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. 24 గంటల్లో మరో 1,284 కొత్త పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 43,780 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 30,607 (70% మంది కోలుకున్నారు. మొత్తం 12,765 (29%) యాక్టివ్‌ కేసులున్నాయి. శనివారం కోవిడ్‌ కారణంగా ఆరుగురు మరణించారు. ఇప్పటివరకు 409 మరణాలు(1%) నమోద య్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,52,700 శాంపుల్స్‌ పరీక్షించారు. శనివారం ఒక్కరోజే 14,883 శాంపుల్స్‌ టెస్ట్‌ చేశారు.

తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 667, రంగారెడ్డి 68, మేడ్చల్‌ 62, సంగారెడ్డి 86, కరీంనగర్‌ 58, నల్లగొండలో 46, వికారాబాద్‌ 35, వరంగల్‌ అర్బన్‌ 37, నిజామాబాద్‌ 26, వనపర్తి 24, సూర్యాపేట్‌ 23, సిద్దిపేట్‌ 22, మంచిర్యాల 19, మహబూబ్‌నగర్‌ 16, మెదక్‌ 15, గద్వాల, పెద్దపల్లి 14, ఖమ్మం, భువనగిరి 10 చొప్పున, ఆదిలాబాద్‌ 8, జనగామ 6, వరంగల్‌ రూరల్‌ 5, భూపాలపల్లి 4, కామారెడ్డి, సిరిసిల్ల, ఆసిఫాబాద్‌ 2 చొప్పున, నిర్మల్, నాగర్‌కర్నూల్, జగిత్యాలలో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  

కరోనాకు కొత్త హాట్‌స్పాట్‌‌గా హైదరాబాద్‌

కరోనా కేసుల సంఖ్యలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇంత కాలంగా మెరుగైన స్థితిలో ఉన్న తెలంగాణ ప్రస్తుతం ప్రమాదకర స్థితిలోకి వెళుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్ దేశంలోనే కరోనాకు సరికొత్త హాట్‌స్పాట్‌గా తయారవుతున్నదని జాతీయ వార్తా పత్రిక సమాచారం. భాగ్యనగరానికి బెంగళూరు, పుణే కూడా జత కానున్నాయని తెలుస్తోంది.

ఓ వైపు ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌లలో క్రమక్రమంగా కేసులు తగ్గుముఖం పడుతుంటే మరోవైపు ఈ మూడు నగరాల్లో మాత్రం ఇన్ఫెక్షన్ల వ్యాప్తిరేటు గణనీయంగా పెరుగుతుండటమే అందుకు నిదర్శనమని పేర్కొంది. గత 4 వారాల వ్యవధిలో దేశంలోని 9 పెద్ద నగరాల్లో కొత్తగా నమోదైన కొవిడ్‌-19 కేసులు, చోటుచేసుకున్న మరణాల గణాంకాలు ప్రాతిపదికగా ఈ అంచనాకు వచ్చినట్లు వెల్లడించింది. 

ఈ కాలానికిగానూ కేసుల వృద్ధిరేటు అత్యధికంగా ఉన్న నగరాల జాబితాలో ఢిల్లీ, ముంబై, చెన్నైలను దాటేసి హైదరాబాద్‌ రెండోస్థానానికి చేరిందని తెలిపింది. ఇక్కడ కేసుల పెరుగుదల రేటు 7.8 శాతంగా ఉందని చెప్పింది. అయితే కొవిడ్‌ మరణాల రేటులో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదని స్పష్టంచేసింది. నగరంలో కరోనా బారినపడుతున్న ప్రతి 100 మందిలో మరణాల రేటు(సీఎ్‌ఫఆర్‌) కేవలం 0.1శాతంగా ఉండటం ప్రస్తుతానికి సానుకూల అంశమని తెలిపింది. 

ఇక సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా ఖ్యాతి గడించిన బెంగళూరును కొవిడ్‌ మరణాలు దడ పుట్టిస్తున్నాయి. ఆందోళనకర రీతిలో అక్కడ గత నాలుగు వారాల వ్యవధిలోనే కొవిడ్‌ కేసుల వృద్ధిరేటు 12.9 శాతానికి పెరగగా, మరణాల రేటు భారీగా పెరిగి ఏకంగా 8.9 శాతానికి చేరింది. మరోవైపు మహారాష్ట్రలోని పుణె వైరస్‌ పంజాకు వణుకుతోంది. ఇక్కడ కేసుల పెరుగుదల రేటు 4.5 శాతానికి తాకగా, మరణాల రేటు అమాంతం పెరిగి 2.4కు చేరింది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle