newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేసుల పద్మవ్యూహంలో రేవంత్ ?

18-03-202018-03-2020 08:58:50 IST
Updated On 18-03-2020 08:58:44 ISTUpdated On 18-03-20202020-03-18T03:28:50.513Z18-03-2020 2020-03-18T03:27:44.689Z - 2020-03-18T03:28:44.295Z - 18-03-2020

కేసుల పద్మవ్యూహంలో రేవంత్ ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా వున్నా, ఎమ్మెల్యేగా ఓటమి పాలైనా, తాజాగా ఎంపీ అయినా ఆయన దూకుడు మాత్రం మారలేదు. తాజాగా రేవంత్ కేసుల పద్మవ్మూహంలో చిక్కుకుపోయారు. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే అనుమతులు లేకుండా డ్రోన్‌ కెమెరాలు వాడారన్న కేసులో అరెస్టయిన ఆయన.. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. కాగా, గతంలో ఆయన రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిపోయిన ఓటుకు నోట్లు కేసు విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది.

దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉండటంతో  ఓటుకు నోటు కేసులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుపై ఈ రోజు విచారణ చేపట్టిన ఏసీబీ స్పెషల్ కోర్టు.. విచారణను వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

ఈ కేసులో ఏ-1గా ముద్దాయిగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నందున ఆయన్ను కోర్టులో హాజరుపర్చలేదు. మిగతా నిందితులు సెబాస్టియన్, ఉదయసింహ కోర్టుకు హాజరయ్యారు. ఇప్పటికే ఓటుకు నోట్లు కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ.. మొత్తం 960 పేజీలతో చార్జిషీట్‌ దాఖలు చేసింది. నిందితుల పాత్ర, అసలు సూత్రధారుల సంబంధించి కీలక విషయాలను అందులో పొందుపరిచినట్టు తెలుస్తోంది. 

ఈ కేసుకు సంబంధించిన ఆడియో టేపుల FSL రిపోర్టు సైతం కోర్టుకు చేరడంతో ఏం జరగబోతోందనేది ఉత్కంఠగా మారింది. ఈ కేసులో స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి ఇవ్వజూపిన డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనేది కీలకం కానుంది. త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2015లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ముఖ్య అనుచరుడు వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టారు. అనంతరం అరెస్ట్ అయ్యారు. 

వచ్చే నెలలో జరిగే విచారణ కీలకం కానుంది. దీనికి తోడు రేవంత్ రెడ్డి సూట్ కేసు కంపెనీలు పెట్టి మోసం చేస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. భూ కబ్జాలు, రాజకీయ కుట్రలు, ఫోర్జరీ కేసులు. వీటన్నిటికీ తోడు రేవంత్‌రెడ్డి కున్న మరో కోణం మనీలాండరింగ్‌ అని ఆయన ప్రత్యర్ధులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దొంగ సొత్తు తెచ్చుకునేందుకే కంపెనీలు పెట్టడం.. రేవంత్‌ కుటుంబ సభ్యులే వాటికి డైరెక్టర్లుగా ఉండటం జరుగుతోందనే ఆరోపణలు వున్నాయి.

రేవంత్‌ రకరకాల రంగాల్లో 29 కంపెనీలు పెట్టారు. ఈ కంపెనీల మూలాలు తవ్వితే దిమ్మదిరిగే వాస్తవాలు బయటపడబోతున్నాయంటున్నారు. షెల్‌ కంపెనీలు పెట్టడం, కొంతకాలానికి రద్దు చేయడం. ఇదీ రేవంత్‌కు బాగా అలవాటైందని, ఒకే అడ్రస్‌తో ఇన్ని కంపెనీలు కాగితాల మీద స్థాపించిన రేవంత్‌ రెడ్డి ఉద్దేశం ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎంపీగా వుండి తన మీద వస్తున్న ఈ ఆరోపణలకు సమాధానాలు ఎందుకు చెప్పడం లేదని కొందరు టీఆర్ఎస్ నేతలే ప్రశ్నిస్తున్నారు, 20 కంపెనీలకు పైగా రేవంత్‌ రెడ్డి ఇల్లే చిరునామా కావడంపై కూడా అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.

ఒకే చిరునామాతో కాగితాలపై కంపెనీలు పెట్టడం ఒక ఎత్తయితే, నెలకొల్పిన కంపెనీల్లో 17 కంపెనీలను రద్దు చేయడం మరో ఎత్తు. ఈ కంపెనీలన్నిటికీ సేల్స్‌ ట్యాక్స్‌ చెల్లించారా? జీఎస్టీ చెల్లిస్తున్నారా? నిబంధనల ప్రకారం రిటర్న్స్‌ ఫైల్‌ చేశారా? అన్న అంశాలపై లోతైన దర్యాప్తు జరిగితే తప్ప అసలు సంగతి బయటకు రాదంటున్నారు. రేవంత్‌ కుటుంబానికి నిజంగా కార్యకలాపాలు ఉన్నాయా అన్న సందేహాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల వెనక అసలు కథ ఏంటన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులే 29 కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉంటడం వెనక మతలబుపై విచారణ చేసే అవకాశం ఉందని అంటున్నారు. రేవంత్‌రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపర్చిన విషయాల అనుమానాస్పదంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.  2009, 2014 ఎన్నికలకు ముందు రేవంత్‌ సమర్పించిన అఫిడవిట్లలో- తనకు 17 కంపెనీల్లో షేర్లు ఉన్నట్లు తెలిపారు. కానీ 2018 ఎన్నికలనాటి అఫిడవిట్లో ఆ షేర్లు ఏంటో, ఆ షేర్ల విలువ ఏంటో ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

రేవంత్‌కు లైన్ క్లియరేనా? రాహుల్ ఆశీస్సులు వున్నట్టేనా?

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle