newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేసీయార్ సార్...కరోనాపై కంట్రోల్ ఏదీ? ట్రెండ్ అవుతున్న #WhereIsKCR హ్యాష్ ట్యాగ్

06-07-202006-07-2020 07:36:38 IST
Updated On 06-07-2020 09:42:23 ISTUpdated On 06-07-20202020-07-06T02:06:38.729Z06-07-2020 2020-07-06T02:06:28.943Z - 2020-07-06T04:12:23.730Z - 06-07-2020

కేసీయార్ సార్...కరోనాపై కంట్రోల్ ఏదీ? ట్రెండ్ అవుతున్న #WhereIsKCR హ్యాష్ ట్యాగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. వరుసగా రెండు రోజులుగా 1800కు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రగతి భవన్‌లోనూ 30 మంది వరకూ కోవిడ్ బారిన పడినట్లు సమాచారం. ఇక హైదరాబాద్ నగరంలోనైతే కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉంది.

నగరంలోని ప్రతి చోటా కేసులు నమోదవుతున్నాయి. దీంతో నగరంలో లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. కరోనా ప్రభావానికి లాక్‌డౌన్ ప్రచారం తోడవడంతో చాలా మంది నగరాన్ని వదిలి సొంతూళ్లకు వెళ్తున్నారు.ప్రగతి భవన్లో ఉద్యోగులతో పాటు సెక్యూరిటీ నిర్వహిస్తున్న బెటాలియన్ కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రగతి భవన్ తలుపులు మూసేశారు. 

శనివారం రాత్రి హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1,10,545 టెస్టులు చేస్తే.. 22,312 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే పాజిటివ్ రేటు ఎక్కువగా ఉండగా.. టెస్టులు మాత్రం తక్కువగా ఉంటున్నాయి. ఇంతటి ఇబ్బందికర పరిస్థితుల్లో సీఎం కేసిఆర్ ప్రగతి భవన్‌ను వదిలి వెళ్లి.. ఫామ్ హౌస్‌లో ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రంపై కోవిడ్ మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో కేసీఆర్ ఎక్కడ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్‌లో #WhereIsKCR అనే హ్యాష్‌ట్యాంగ్ ట్రెండ్ అయ్యింది. హైదరాబాద్ కంటే తక్కువ కేసులు నమోదవుతున్నప్పటికీ లాక్‌‌డౌన్ విధిస్తోన్న విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. జనం హైదరాబాద్ వదిలి వెళ్తున్న న్యూస్ క్లిప్పింగులను ట్వీట్ చేసి... కాపాడాల్సిన వాళ్లే కనపడకుండా పోయారు అని వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు.

హైదరాబాద్ నుంచి 25 లక్షల మంది వెళ్లారని అంచనా.. మరి కేసీఆర్ ఎక్కడ? అని ఒకరు ప్రశ్నిస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌‌ను దయనీయ స్థితిలోకి నెట్టేస్తోందని ఒకరు కామెంట్ చేశారు.జులై 2న దేశంలో పాజిటివ్ రేట్ 6.68 శాతంగా ఉంటే తెలంగాణలో జూన్ 27 నుంచి జులై 4 తేదీల మధ్య కనిష్టంగా 22.64 శాతం, గరిష్టంగా 36.82 శాతంగా నమోదైందని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 

 రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మకాం మార్చారా? అని ప్రశ్నించింది. అన్ని ‘అద్భుతంగా’ చేసినం అన్నడు అందరిని ముంచి సల్లగా ఫామ్ హౌస్‌కు జారుకున్నడు. టిమ్స్‌లో ఇంకా నియామకాలు ఎంతవరకు వచ్చినై మరి చికిత్స ఎప్పుడు అందిస్తరు?’’ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ సర్కారును నిలదీసింది. కాంగ్రెస్ ప్రచారం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   11 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   13 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   20 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle