newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

కేసీయార్ సర్కార్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు

18-12-201918-12-2019 08:48:44 IST
Updated On 18-12-2019 09:03:45 ISTUpdated On 18-12-20192019-12-18T03:18:44.769Z18-12-2019 2019-12-18T03:18:31.199Z - 2019-12-18T03:33:45.714Z - 18-12-2019

కేసీయార్ సర్కార్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ సర్కార్ పై మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో ఏం చేయాలన్నా ఆరు శాతం కమీషన్ ముట్టజెప్పాల్సిందేనన ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్ అమలవుతోందన్నారు. తెలంగాణలో మద్యం ధరల పెంపు నిర్ణయంపై మండిపడ్డారు. బహిరంగలేఖ ద్వారా పలు ఆరోపణలు చేశారు. 

కేఎస్‌టీ మాఫియా ప్రభావం వల్లే ఇదంతా జరిగిందన్నారు.  ఓ ఎంపీ చెన్నై, ఢిల్లీలో మకాం వేసి బేరం కుదిర్చాడని ఆయన ఆరోపించారు. మద్యం ధరల పెంపు భారీ కుంభకోణమని, కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తానే కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. ఈమేరకు రేవంత్‌ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ లేఖ రాశారు.

తెలంగాణలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ.. ఎక్సైజ్ అండ్ ప్రమోషన్ శాఖగా మారిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. మద్యాన్ని ప్రోత్సహించడమంటే మహిళల భద్రతలో రాజీ పడటమేనని, 20 కోట్లకు పైగా జనాభా ఉన్న యూపీలో కూడా మద్యం ఆదాయం ఇంతగా లేదని అన్నారు. 

‘ఆరు కేసీఆర్ లక్కీ నెంబర్. కేఎస్‌టీ కూడా ఆరు శాతమే. మద్యం అమ్మకాల్లో దోపిడీ కోసమే ప్రభుత్వం గుత్తాధిపత్యం చెలాయిస్తోంది. కమీషన్లు ఇచ్చే బ్రాండ్లనే ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణలో జరిగే నేరాలకు మద్యం కారణమని తేలుతోందని, అయినా ప్రభుత్వం మద్యం ఆదాయంపైనే ఆధారపడుతోందన్నారు. 

మద్యం అమ్మకాలు, అధిక ధరలపై వినియోగదారుల ఫోరం ఏం చేస్తోంది. లాటరీ జూదం అన్నారు. మరి అదే లాటరీ విధానంలో మద్యం షాపులెలా కేటాయిస్తారు. షాపు దక్కని దరఖాస్తుదారుడుకి డబ్బు వాపస్ ఇవ్వకపోవడం నేరం. జనవరి 30న కట్టాల్సిన రుసుములు ఈ రోజే కట్టాలని షాపులకు తాఖీదులు ఇస్తున్నారు. పెంచిన ధరలు తక్షణం నిలిపేయాలి’అని రేవంత్‌ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. 

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   6 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   7 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   9 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   10 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   10 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   11 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   14 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   15 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   15 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle