కేసీయార్ మౌనంతో తెలంగాణకు అన్యాయం
02-08-202002-08-2020 10:01:58 IST
Updated On 02-08-2020 13:45:18 ISTUpdated On 02-08-20202020-08-02T04:31:58.797Z02-08-2020 2020-08-02T04:29:10.984Z - 2020-08-02T08:15:18.512Z - 02-08-2020

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశ పూర్వకంగానే మౌనంగా ఉంటున్నారని, ఇందులో పెద్ద కుట్ర దాగి వుందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రెండు టీఎంసీ నీళ్ల కోసం రూ.1 లక్ష కోట్లు కేసీఆర్ ఖర్చు చేశారు. తరతరాల తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినట్టు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ కృష్ణా నదిపై ప్రాజెక్టులను ఎందుకు నిర్మించడం లేదని ఆయన ప్రశ్నించారు. కృష్ణా నది జలాలను ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా దోచుకుపోతున్నా జగన్ను కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంచి, సంగమేశ్వర్ దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మిస్తే కృష్ణా నది నుంచి ఆంధ్రప్రదేశ్ అదనంగా 6 టీఎంసీ నీళ్లను దోచుకుపోతుందని అది తెలంగాణకు భారీ నష్టమని ఉత్తమ్ అన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఏపీ తెలంగాణకు అన్యాయం చేస్తుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని దీని వెనక అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. పోతిరెడ్డిపాడును కేసీఆర్ అడ్డుకోకుండా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? జగన్ కి ఎన్నికల సమయంలో కేసీఆర్ ఆర్థిక సహాయం చేసారనే ప్రచారం జరుగుతుంది.కేసీఆర్, జగన్ లు కలిసినప్పుడు నీటి సమస్యల పై తెలంగాణ రాష్ట్రానికి అన్యాయంపై కేసీఆర్ మాట్లాడక పోవడం కుట్రలో భాగమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన తాము కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డ్ కు ఫిర్యాదు చేశామన్నారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి షెకావత్ కు లేఖ రాసి ఫిర్యాదు చేశామన్నారు. ఆయినా కూడా కేసీఆర్ నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం పెద్ద ఎత్తున అనుమానాలకు తావిస్తున్నదని అన్నారు.పోతిరెడ్డిపాడు విస్తరణ సంగమేశ్వర్ -రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల- కల్వకుర్తి లాంటి ఏ ఒక్క ప్రాజెక్టుకు చుక్క నీరు రాదని ఆందోళన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు విస్తరణకు ఏపీ 11న టెండర్లు పిలుస్తున్నట్లు తెలుస్తుంది. టెండర్లు పూర్తి కావాలనే కేసీఆర్ అపెక్స్ భేటీ వాయిదా వెయ్యమన్నారని ఉత్తమ్ అన్నారు.కృష్ణా జలాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఈనెల 5న నిర్వహిస్తుండగా, అదే రోజు కేసీఆర్ కేబినెట్ భేటీ పెట్టడం ఏంటని ఉత్తమ్ ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు-రాయలసీమ లిఫ్ట్ పనులు మొదలైతే కేసీఆర్ రాజీనామా చెయ్యాలి అని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
16 minutes ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
an hour ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
2 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
3 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
5 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
5 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
20 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
20 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
21 hours ago

గత సావాసంతో టీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల సపోర్ట్
19 hours ago
ఇంకా