newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేసీయార్ బర్త్ డే వేడుకలపై కేటీయార్ ట్వీట్ వైరల్

12-02-202012-02-2020 15:11:04 IST
Updated On 12-02-2020 16:54:52 ISTUpdated On 12-02-20202020-02-12T09:41:04.492Z12-02-2020 2020-02-12T09:40:58.659Z - 2020-02-12T11:24:52.061Z - 12-02-2020

కేసీయార్ బర్త్ డే వేడుకలపై కేటీయార్ ట్వీట్ వైరల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఉద్యమ సారథి, సీఎం కేసీయార్ ఈనెల 17న పుట్టినరోజు జరుపుకోనున్నారు. రెండవసారి సీఎం అయ్యాక ఇవి రెండవ పుట్టినరోజు వేడుకలు. 65వసంతాలు పూర్తి చేసుకుని 66 వసంతంలోకి అడుగుపెడుతున్నారు కేసీయార్. ఈ నేపథ్యంలోనే తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తండ్రి పుట్టినరోజు వేడుకలపై దృష్టిపెట్టారు. హంగు ఆర్బాటాలకు దూరంగా ఉండాలని ట్వీట్ చేశారు కేటీయార్. అంతేకాదు కేసీయార్ బర్త్ డే ఎలా చేయాలో ఆయన సూచించారు. కేటీఆర్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

"2020, ఫిబ్రవరి 17న గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 66 ఏళ్లు రాబోతున్నాయి. కాబట్టి ఆయనకు ఎంతో ఇష్టమైన హరిత హారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటాలి’’అని సూచించారు కేటీయార్. 'ఈచ్ వన్ ప్లాంట్ వన్' అనే నినాదంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతిఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని పిలుపునిచ్చారు. మన రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ 'హరిత హారం' కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

గత ఏడాది సీఎం కేసీఆర్ పుట్టిన రోజు నాడు ఎంతో మంది ప్రముఖులు, ఆయన అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలపడానికి క్యూ కట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసారు. ప్రతి ఒక్కరు హోర్డింగ్ ల కోసం కాకుండా మొక్కలు పంచాలన్నారు.

ప్రతి పండుగను పదికాలాలపాటు గుర్తుండిపోయేలా మనమే ముందడుగు వేయాలని కేటీయార్ భావిస్తున్నారు. ఇటు కేటీయార్ తో పాటు ఆయన సోదరి, మాజీ ఎంపీ కవిత కూడా గతంలో రాఖీ పండుగను వినూత్నంగా జరిపిన సంగతి తెలిసిందే. తన సోదరుడికి రాఖీ కట్టి, హెల్మెట్ కానుకగా ఇచ్చారు.

ప్రతి ఒక్కరు రాఖీ కట్టి సోదరుడికి హెల్మెట్ కానుకగా ఇవ్వాలన్నారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారు. 

 

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   27 minutes ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle