newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

కేసీయార్ పంజాలో తెలంగాణ విలవిల.. రాములమ్మ ఫైర్

28-11-201928-11-2019 13:56:01 IST
Updated On 28-11-2019 13:55:45 ISTUpdated On 28-11-20192019-11-28T08:26:01.204Z28-11-2019 2019-11-28T08:21:59.258Z - 2019-11-28T08:25:45.260Z - 28-11-2019

 కేసీయార్ పంజాలో తెలంగాణ విలవిల.. రాములమ్మ ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విజయశాంతి ఫేస్ బుక్ పోస్ట్

తెలంగాణ రాజకీయాలు ఆర్టీసీ సమ్మె-కార్మికులు-కేసీయార్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీయార్ వైఖరిని విపక్షాలు ఖండిస్తున్నాయి.వారి పట్ల జాలి చూపాలని అవి కేసీయార్ ని కోరుతున్నాయి.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచారకమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి ముఖ్యమంత్రి కేసిఆర్ పై మండిపడ్డారు. తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఆమె కామెంట్లు కాకరేపుతున్నాయి.

ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకుని... మిగిలిన శాఖలకు చెందిన ఉద్యోగులపై కూడా పంజా విసరడానికి కెసిఆర్ ప్రభుత్వం సిద్ధమవుతోందన్న వాదన వినిపిస్తోంది.

శాసనసభలో ప్రతిపక్షం లేకుండా చేసిన సీఎం దొరగారు... ఆర్టీసీ సమ్మె ను ఆసరాగా చేసుకుని తెలంగాణలోని ప్రభుత్వ శాఖలు అన్నిటినీ కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చ బోతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. 

ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం... దాని ద్వారా మొత్తం వ్యవస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని అనుకోవడం కేసీఆర్ గారి వ్యూహంగా కనిపిస్తోంది. ఆర్టీసీతో మొదలైన కెసిఆర్ ప్రభుత్వ అరాచకం, రెవెన్యూ శాఖకు కూడా విస్తరించి.. అక్కడినుంచి మిగిలిన శాఖలకు కూడా వ్యాపించబోతోందన్న అనుమానాలు తెలంగాణ ప్రజల్లో బలపడుతున్నాయి.

సచివాలయం లేకుండా ప్రగతి భవన్ నుంచి ప్రభుత్వ కార్యకలాపాలను చక్కపెడుతున్న సీఎం దొరగారు.. అదే వ్యవస్థను ప్రభుత్వ శాఖల్లో కూడా అమలు చేయాలనుకోవడం దురదృష్టకరం.

ఆర్టీసీ సమ్మెకు ప్రతిపక్షాలు బాధ్యత వహించాలని చేతులు దులుపుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వం.. సమ్మె కారణంగా కార్మికుల ప్రాణాలు కోల్పోవడానికి కూడా ప్రతిపక్షాల బాధ్యత వహించాలని వితండవాదం చేస్తోంది.

కేసిఆర్ ప్రభుత్వ వాలకం చూస్తుంటే మెట్రో రైలు స్టేషన్ పెచ్చులు ఊడిపడి అమాయకురాలు ప్రాణాలు కోల్పోతే... దాని బాధ్యత కూడా ప్రతిపక్షాలదే అంటారేమో? అంతేకాదు.. మొన్న ఓ లారీ డ్రైవర్ తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్ గా బస్సును దురుసుగా నడిపి ఓ ఐ.టి. ఉద్యోగి ప్రాణాలు తీసిన ఘటనకు కూడా ప్రతిపక్షాలే కారణమని ఆరోపిస్తారేమో? 

ఇవే కాదు, హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్ పై నుంచి కారు కిందకి దూసుకువచ్చి ప్రాణాలు తీసిన ప్రమాదానికి కూడా ప్రతిపక్షాల కుట్రే కారణమని దొరగారు అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు!

తన వైఫల్యాలను ప్రతిపక్షాలకు మీదకు నెట్టడం కెసిఆర్ గారికి కొత్తేమీ కాదు. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు త్వరలోనే ఈ అరాచకానికి సరైన తీర్పుని సంఘటిత పోరాటాల ద్వారా తెలియచేస్తారని విశ్వసిస్తున్నాను... అంటూ విజయశాంతి పోస్ట్ చేశారు. 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   2 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   3 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   4 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   5 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   6 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   6 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   8 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   8 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   8 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   9 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle