newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేసీయార్ చిత్రపటానికి ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పాలాభిషేకం

08-05-202008-05-2020 18:36:22 IST
Updated On 08-05-2020 19:07:19 ISTUpdated On 08-05-20202020-05-08T13:06:22.547Z08-05-2020 2020-05-08T13:06:07.418Z - 2020-05-08T13:37:19.158Z - 08-05-2020

కేసీయార్ చిత్రపటానికి ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పాలాభిషేకం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ముఖ్యమంత్రికి రైతులు, టీఆర్ఎస్ నేతలు బ్రహ్మరథం పడుతున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ ధాన్యం కొనుగోళ్ళు చేపట్టడం, రైతులకు ఉచిత విద్యుత్, లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో రైతులు సీఎం కేసీయార్ పట్ల వల్లమాలిన అభిమానం చూపెడుతున్నారు. సంగారెడ్డి జిల్లా ఆంధోల్ మండలం జోగిపేట హనుమాన్ చౌరాస్తా వద్ద రైతులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పంచకట్టుతో రైతుగా వచ్చి పాలాభిషేకం చేశారు ఎమ్యెల్యే చంటి క్రాంతి కిరణ్. 

రైతు బంధు,రైతు రుణమాఫీ చేసినందుకు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఎమ్యెల్యే క్రాంతి కిరణ్.  ఈసందర్భంగా కేసీయార్ జిందాబాద్, జై తెలంగాణ నినాదాలు మిన్నంటాయి. కరోనా తో చిక్కుకుని పోయిన వలస కూలీలకు అండగా వున్నారని, వారికి వసతి, భోజనం, బియ్యం, 500 రూపాయల సాయం అందించారన్నారు. వలస కూలీల కోసం మొదటి శ్రామిక్ రైలు తెలంగాణనుంచే ప్రారంభం అయిందన్నారు. 

గత ప్రభుత్వాల హయాంలో రైతులు పంట పండించేందుకు నీళ్ళు లేక రాత్రనక, పగలనక పొలాల్లోనే వుండేవారని, కరెంటు కోసం, విత్తనాల కోసం అవస్థలు పడేవారన్నారు. కానీ తెలంగాణ సిద్ధించాక ధాన్యం అమ్ముకునేందుకు ప్రభుత్వమే సాయం చేస్తోందన్నారు. ఏ రైతు కూడా ఫెర్టిలైజర్ షాపుల్లో అప్పుపెట్టకుండా కేసీఆర్ వేసిన రైతు బంధు డబ్బులతో యూరియా మందును కొనుగోలు చేస్తున్నారన్నారు. కేసీయార్ రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు.

కోవిడ్ విపత్కర సమయంలో కేసీఆర్ పెద్ద మనసుతో రైతులకు అండగా నిలుస్తున్నందుకు ఆంధోల్ రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్. ఈ సందర్భంగా బకెట్లతో తెచ్చి పాలతో కేసీయార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కరోనా కట్టడికి సీఎం కేసీయార్ చేపడుతున్న చర్యల్ని ప్రధాని మోడీ సైతం అభినందించారని, లాక్ డౌన్ పకడ్బందీగా అమలుచేయడం వల్లే కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోందన్నారు ఎమ్మెల్యే క్రాంతికిరణ్. కరోనా వైరస్ తో ఇబ్బందిపడుతున్న ప్రజలకు, వలస కూలీలకు ఆయన తనవంతు సాయం చేస్తున్నారు. తన నియోజకవర్గంలో రోడ్లమీద నడిచి వెళ్లే ఇతర ప్రాంతాల వారిని ఆయన ఆదుకున్నారు. వారికి భోజనం ఏర్పాట్లు చేసి సొంతూళ్ళకు వెళ్లేందుకు తోడ్పడ్డారు. 

రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ డబ్బులను విడుదల చేసిన సందర్భంగా రైతులు, టీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాలాభిషేకాలు నిర్వహించారు. జిల్లాలోని నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లిలో రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పాలాభిషేకం చేశారు. అటు నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌రెడ్డి పాలాభిషేకం చేశారు. 

ఉదారత చాటుకున్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

 
బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   3 hours ago


చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

   4 hours ago


షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

   2 hours ago


తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

   5 hours ago


జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

   6 hours ago


అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

   7 hours ago


కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

   20 hours ago


కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

   a day ago


దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

   a day ago


Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   17-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle